Wednesday, November 29, 2017

జాతి ద్రోహులూ……. – 1


……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!

వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు. ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల్లా……కొంతమంది మూర్ఖులైనా వాళ్లు వ్రాసినవి నమ్మకపోతారా, మరింత ప్రచారం చెయ్యకపోతారా…..అన్న వాళ్ల ఆశ ఒక్కటే!

మొన్నటి టైమ్‌స్ ఆఫ్ ఇండియా లో సంపాదకీయం లో సిగ్గులేని వ్రాతలు చూడండి. అసలు వాడు వ్రాయదలుచుకున్నది, ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య విభేదాలు ఉండకూడదు అని. కానీ వ్రాసింది అవాకులూ, చెవాకులూ……. 


“……….Recent judgments like banning of liquor vends along highways, which hurt tourism and caused job losses, or asking movie audiences to sing the national anthem before every film screening, which is an unnecessary substitution of tokens for substance that could prompt vigilante action, are examples of judicial overreach.” (Underlining is by me).

……అంటే వాడి ఉద్దేశ్యం…..హైవేలమీద విచ్చలవిడిగా మద్యం అమ్మితే, టూరిజం పెరిగి, లక్షల ఉద్యోగాలు వస్తాయి అనా? అలా అయితే, గుళ్ల దగ్గరా, బళ్ల దగ్గరా వద్దు వగైరా నిబంధనలెందుకు? అవీ పీకేస్తే, మరిన్ని ఉద్యోగాలూ అవీ నా?
…..జాతీయగీతం ప్రదర్శించాలి అనీ, అప్పుడు లేచి నిలబడాలి అని మాత్రమే చెప్పారా? మీరుకూడా పాడకపోతే డొక్క చించుతాము అన్నారా?

ఇంకా……

“Any government’s first job, before anything else, is to maintain law and order……”


……కదా మరి? కానీ దానికి ముందు ఏమి వ్రాశాడో చూడండి……!

“…….the Padmavathi episode where Karni Sena wantonly threatens to wreak violence on the film’s cast, crew and theatres. At least four state governments and central government demonstrated a weak-kneed approach to the agitators. No different is governmental response, or lack of it, to gauraksha related lynchings.”

…….అంటే, కర్నీ సేన వాళ్లు అంతా చేశాక అప్పుడు మొసలి కన్నీళ్లు కారిస్తేనో, లేక ముందుగానే “వాళ్లని” చావగొట్టి, చెవులు మూస్తేనో…..శాంతి భద్రతలు కాపాడినట్టా? ఎక్కడో, ఎప్పుడో ఇలాంటి పత్రికలు గోరక్షకులు ఎవర్నో ఊచకోత కోసేస్తున్నారంటూ ప్రచారం చేసేస్తే, ప్రభుత్వాలు వాటి “గోవధ నిషేధం” లాంటి చట్టాలని తుంగలో తొక్కెయ్యాలా?

(ఈ విషయం లో అప్పట్లోనే నా బ్లాగులో వ్రాసింది క్రింది లింకులో చదవండి)



(మరింత మరోసారి)