Thursday, January 14, 2010

మన తెలుగు


పండగలు


బాగుంది కదూ!  


మన సంస్కృతీ సాంప్రదాయలకల్లా మూలం--ముగ్గులూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, హరిదాసులూ, భోగిమంటలూ, గాలిపటాలూ, కోడిపందాలూ--ఇవే(ట)!  


(పై అన్నిటికీ పురాణాల్లోనో, సైన్సుపరంగానో యేదో ఒక కారణం చెప్పగలుగుతున్నారు అందరూ--ఒక్క గాలిపటాలకి తప్ప! మరి బలరామ కృష్ణులూ, కౌరవ పాండవులూ, రామ లక్ష్మణ భరత శతృఘ్నులు కూడా గాలిపటాలు యెగరేశారు అని యెక్కడా దాఖలాలు లేవు! బాల చంద్రుడుకూడా బొంగరాల ఆట ఆడాడుగానీ, పతంగులు యెగరెయ్యలేదు! యెందుకో?)  


పల్లెల్లో--పాపం రైతులు తమ రబీ పంటకి నీళ్ళందక, సగంచేను యెండిపోతుంటే, యే మురిక్కాలవకి అడ్డుకట్టకట్టి నీళ్ళు పెట్టుకుందామా అని వాటికి శ్రమిస్తూనే వున్నారు!  


రేషను కొట్లముందూ, గ్యాస్ కంపెనీలముందూ పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తూనే వున్నాయి! యెక్కడా ముగ్గులూ, గొబ్బిళ్ళూ మొదలైనవి కనపడటం లేదు!  


మామూలు రోజుకీ, పండగ రోజుకీ--యే ఒకళ్ళిద్దరు బలిసినవాళ్ళకో తప్ప--తేడా యేమీ తెలియడం లేదు!  


మరి, పెద్ద పల్లెటూళ్ళలో--కోడి పందాలూ, పక్కనే చీకులూ, బెల్టు దుకాణాలూ బాగానే దర్శనం ఇస్తున్నాయి--పోలీసులకి అధికారులచేత 'చూసీ చూడనట్టు ' పొండి--అని అదేశాలు ఇప్పించి, యధేచ్చగా పోటీలు పడుతున్న ఒకళ్ళో ఇద్దరో నాయకులతోపాటు అనేక మంది చోటా మోటా రాజకీయులూ, వాళ్ళ అనుచరులతోపాటు!  


పట్టణాల్లో, ముగ్గుల పోటీలూ, గొబ్బెమ్మల పోటీలూ, పతంగుల పోటీలూ, వంటల పోటీలూ, భక్తిపాటల, డాన్సుల పోటీలూ, టీవీల్లో రకరకాల 'షో'లని చూసి, అనుకరణలూ--ఇవీ జరుగుతున్నవి!  


నగరాల్లో అయితే, పూర్తిగా రాజకీయులు--తెలంగాణా హరిదాసుల్నీ, సర్కారు గంగిరెద్దుల్నీ, నిరసన డాన్సులూ అవీ--ఇవీ దృశ్యాలు!  


సెక్రటేరియట్ లో తక్కువక్లాసు వుద్యోగినులకి ముగ్గుల పోటీలు నిర్వహించారు!  


ఇక మన సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా యేమీ తక్కువ తినలేదు! శాయ శక్తులా ప్రత్నిస్తున్నాయి--మన సంస్కృతీ సాంప్రదాయాల్ని కాపాడటానికి!  


వచ్చే యేడాది అవి తమ కార్యాలయాల్ని ఆవుపేడతో అలికించి, ముగ్గులు పెట్టించి, గొబ్బెళ్ళు తట్టించి, పొంగళ్ళు పెట్టించి, ఆటపాటల్తో కార్యాలయాల్లోనే గడపమంటాయేమో తమ వుద్యోగుల్ని!  


(అలా అన్ని కార్యాలయాలూ చేస్తే, ఈ రైళ్ళలోనూ, బస్సులలోనూ రద్దీ తగ్గి, టిక్కెట్ చార్జీ దోపిడీలూ ఇవీ వుండకపోను!)  


ఇక వార్తల్లో, '.............ప్రజలందరూ సాంప్రదాయ బధ్ధం గా...........వగైరాలతో.........విశేష పూజలతో...........సాంస్కృత కార్యక్రమాలతో.......ఆనందం గా జరుపుకొన్నారు! ...........నాయకులు.........కూడా అందోత్సాహాలతో..........జరిపించారు!' ఇవీ 'స్టాండర్డ్' వాక్యాలు--ప్రతీ పండగకీ!  


ఇక యాంకర్లు మూడు రోజుల ముందునుంచీ, నాలుగురోజుల తరవాతదాకా, 'మీకు మా...........శుభాకాంక్షలు!' అంటారు ప్రతీ కార్యక్రమంలోనూ!  


తెలుగు సాంప్రదాయవాదులూ--మీకు జోహార్లు!



5 comments:

సుజాత వేల్పూరి said...

అసలు ఈ న్యూస్ ఛానెళ్ళ వాళ్ళు చెప్పకపోతే సంక్రాంతికి పంట ఇంటికొస్తుందనీ, గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు వస్తారనీ, సంప్రదాయ రీతిలో కొత్త బట్టలు జనం ధరిస్తారనీ,అరిసెలు వండుకుంటారనీ,కోడి పందాలతో పల్లెలు సరదాగా గడుపుతాయనీ ....నాకూ ఏమీ తెలియకపోవునండీ!

వీళ్ళకి ఎంతైనా రుణపడి ఉంటాను.

A K Sastry said...

డియర్ శరత్'కాలమ్' &
చిలమకూరు విజయమోహన్!

చాలా సంతోషం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ సుజాత!

మరే! మనం మార్స్ మీదో, యూరేనస్ మీదో వున్నాం కదా!

ఋణపడే వుందామా--తీర్చుకోడానికి ప్రయత్నిద్దామా?

ధన్యవాదాలు!

Unknown said...

మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు

A K Sastry said...

డియర్ ధరణీరాయ్ చౌదరి!

చాలా సంతోషం!

ధన్యవాదాలు!