సోంపేట
...........అంటే నాకు మొదట గుర్తు వచ్చేది సర్దార్ గౌతు లచ్చన్న--ఆయన స్వగ్రామం మందస అన్నా, ఆయన నియోజకవర్గం సోంపేట అన్నా గుర్తు వచ్చేది ఆయనే.
మొన్న అక్కడ జరిగింది మహా దారుణం--అంటే చాలా తక్కువ చెప్పినట్టు.
నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు.
అన్ని రోజులనించీ, అంతమంది పోలీసువాళ్ళని రప్పించి, మోహరించి, కవాతులూ గట్రా చేయించి, వాళ్లు ఫలానా రోజు జనాలు యెవరూ ఫలానా చోటకి రావద్దు అని హెచ్చరికలు చేసినా, అన్నిరోజులూ మన మీడియాలు యేమి చేస్తున్నట్టు?
'పోలీసులు కొంత అతిగా ప్రవర్తించినట్టు తోస్తూంది' అని పెద్దాయన అన్నాట్ట--ఆయన అనుభవం లో లోక్ నాయక్ మీద లాఠీఛార్జీ లాంటి పెద్ద పెద్ద అతి ప్రవర్తనలు ఇంకా చాలా వుండి వుంటాయి కాబట్టి, ఇది పెద్ద తప్పు కాదేమో!
డీజీపీ లాంటి పోలీసు వున్నతాధికారులెవరూ ఆ రోజు రాష్ట్రం లోనే లేరట. మరి అక్కడి పోలీసువాళ్ళకి ఆదేశాలు యెవరిచ్చారో?
కొంతమంది చిన్న వున్నతాధికారులు, 'మేము పోలీసువాళ్ళు అందరికీ ఆయుధాలు ఇవ్వలేదు. కేవలం లాఠీలే పట్టుకెళ్ళమన్నాము. టియర్ గాస్ ఇచ్చాము. ఆయుధాలు ఇచ్చినవాళ్ళకి కూడా రబ్బరు బుల్లెట్లే ఇచ్చాము. మరి.......' అని జుట్లు పీక్కున్నారట. మరి పేలిన గన్ లూ, బుల్లెట్ లూ 'ప్రైవేటు' సైన్యానివేనా?
ఆరోజు సాయంత్రం ఐదు గంటలవరకూ, మాననీయ హోం మంత్రి, చెల్లెమ్మ సబిత కూడా, 'మాకు పూర్తి వివరాలు తెలియవు--వచ్చాకే చెపుతాను' అనీ, వివరాలు తెప్పించుకొని, 'వెనక్కి వచ్చేస్తున్న పోలీసుల మీద జనం దాడి చేశారు కాబట్టి పోలీసులు కాల్పులు జరిపారట' అని చెప్పడమేమిటి?
(టీవీల్లో వీడియోలు చూసిన వాళ్లందరూ చెప్పగలరు--ఇందులోని నిజమెంతో!)
'అక్కడ శంకుస్థాపన యేమీ జరగలేదు' అని కంపెనీ ప్రతినిధులు భుజాలు తడుముకున్నారంటే, అసలు ప్లాన్ యేమిటో తెలియడం లేదూ?
కొణిజేటివారు ఇప్పటికైనా 'యెవరి బాధ్యత యెంత' అని నిగ్గదీస్తారా?
బాబ్లీ గురించి జరుగుతున్నది చూస్తూంటే, యెవరికైనా ఆ నమ్మకం వస్తుందా?
మిగతా మరోసారి.
4 comments:
మీడియా వాళ్ళని ప్రజలు కర్రలతో కొట్టారట! అలాగే ‘అక్కడ పోలీసులు మాత్రమే ఉన్నారు, కంపెనీ తాలూకూ ప్రైవేట్ మూక లేద’ని అంటే, పత్రికలకు కొంతమంది, ఆ ప్రైవేట్ మూక ఉన్న ఫోటోలను పంపించారట! గౌరవనీయమైన స్థానంలో ఉండి అబద్దాలను చెప్పటానికి వాళ్ళు[సిఎం, హోంమంత్రి, డీజీపీ,గట్రా] సిగ్గుపడటం లేదండి. అదే ఇక్కడ అసలు సమస్య!
డియర్ AMMA ODI!
వాళ్ళెవరూ సిగ్గుపడరు--యెందుకంటే, సోకాల్డ్ 'అధిష్టానం' వాళ్లని యెలా పలకమంటే అలాగే పలుకుతారు.
చిన్న వున్నతాధికారులు చాటుమాటుగానైనా వెంటనే స్పందిస్తారు.
ధన్యవాదాలు.
thilaapaapam thala pidikedu. gajula
కాదు--
"తిలాపాపం ఎన్ సి సి/రాజకీయుల/పోలీసుల/ప్రైవేటు సైన్యాల...........తలా--
"జోలెడు"!
Post a Comment