.......దౌర్భాగ్యం
- ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, ఈతముక్కల లో జ్వాలాముఖి అమ్మవారికి 10,001 "గారెలతో", అవికూడా వివిధ రంగుల్లో, అలంకరించారట.
'పచనం' చేసిన ఆహార పదార్థాలకి 'అంటు' అనేది వుంటుందని నమ్మేవాళ్లు ఇదివరకు. దేవుళ్లకీ, దేవతలకీ వారికి నివేదించే ప్రసాదాలు కూడా వారికి తగిలించకుండా దూరంగానే వుంచుతారు.
ఇలాంటి గ్రామదేవతలకి అలాంటివి వుండవు, మాంసమూ, మద్యం తో సహా యేవైనా తగిలించవచ్చు అంటారా? అవున్లెండి--మధ్యలో మనకెందుకు!
- అజ్మల్ కసబ్ గుర్తున్నాడుగా?
వీడు జైల్లోనే వుండగా, తనకు చికెన్, మటన్ పెట్టలేదనీ, పత్రికలూ టీవీ ఇవ్వలేదు అనీ ఇలా రోజుకో వీరంగం వేస్తున్నాడు.
వాణ్ని అక్కడే వుంచి, వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా విచారణ సాగిస్తున్నారు. విచారణ సమయం లో అనేక వెకిలి వేషాలు వేస్తున్నాడట. మొన్న యేకంగా జడ్జీగారి మొహం మీద పడేలా కెమేరామీదే "వుమ్మి" వేశాడట!
అయినా మన న్యాయమూర్తులు, వాడు "మానవహక్కుల వుల్లంఘనలతో సంబంధం వుండే అంతర్జాతీయ న్యయ స్థానానికి" తన కేసుని అప్పగించాలని డిమాండు చేస్తే, వుదారంగా "ప్రభుత్వానికి నీ కోరిక ని పంపిస్తాం" అన్నారట!
వీడికి ఈ బ్లాగరు ఈ క్రింది టపా లో
విధించమన్న శిక్షనే విధించాలని దేశ భక్తులెవరైనా వుద్యమం లేవదీస్తే బాగుండును.
- ప్రపంచ చరిత్రలో, తామర్లేన్ (కుంటి తైమూర్), చెంఘిజ్ ఖాన్ లు అత్యంత కౄరులని, (తుగ్లక్ ఓ పిచ్చివాడనీ) పేరుపడి అన్ని దేశాలవాళ్లకీ తెలుసు.
ఇప్పుడు మంగోలు దేశమూ లేదు, అక్కడెక్కడా వాళ్లపేర్లతో పట్టణాలు గానీ, పేటలు గానీ, రోడ్లు గానీ వున్నట్టు దాఖలాలు లేవు.
మరి మన దౌర్భాగ్యమేమిటో, మనదేశం లో వున్నాయి ఇప్పటికీ!
గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, కొండవీడు ప్రాంతం లో "చెంఘిజ్ ఖాన్" పేట లో, ఇస్కాన్ 150 కోట్లతో ప్రారంభిస్తున్న ప్రాజెక్టుకి రోశయ్య భూమి పూజ చేశారు. వాళ్లు "వెన్నముద్ద వేణుగోపాల స్వామి" అలయనికి బంగారు తాపడం చేసి, "స్వర్ణ దేవాలయం" గా తీర్చి దిద్దుతారట.
ఆమధ్య పేపర్లలో వాళ్ల ప్రాజెక్టుగురించీ, మధ్యలో ఓ పేద్ద హంస ఆకారం లో ఓ కట్టడాన్నీ, గార్డెన్లనీ--ఇలా ఓ ప్లాను చిత్రాన్నీ ప్రచురించారు.
బాగానే వుంది--కానీ ఈ "చెంఘిజ్ ఖాన్ పేట" యేమిటీ?
తైమూరు సంగతి నాకు తెలియదుగానీ, తుగ్లక్ పేరుతో ఇంకా అనేక నగరాల్లో మార్గాలూ, వాడి "ఆబాద్" పేరుతో నగరాలూ మనదేశం లో వున్నాయి.
మన అనేక "ఆబాదు"లని పేర్లు మార్చడానికి మనకి యెలాగూ తోకలేవడం లేదు!
కనీసం "వెధవల" పేర్లతో వున్నవేనా మార్చలేరా? వాటికీ, మీ "ప్రత్యేక జాతి సోదరులకీ" కూడా సంబంధం వుందా? వాళ్ల వారసులేనా వీళ్లు?
కానివ్వండి! ఇంకెన్నాళ్లో.....!