Tuesday, February 7, 2017

"Something basically wrong....."--3

"అదుగో పులి......అంటే, ఇదిగో తోక!"

మన జనాలు.....అంటే దేశం మొత్తం మీద ఉండేవాళ్లు అందరూ.....ఇలా అంటారు అంటే, యేమాత్రం అతిశయోక్తి లేదు!

ఇలా "మాస్ సైకాలజీ"ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్నవాళ్లలో ప్రథములు..... కాంగ్రెస్ వాళ్లు!

--ఓ ఎలక్షన్ ముందు, వీధి తలుపు మీద "నామం" వేసుకోక పోతే, రాక్షసి లోపలికి వచ్చేస్తుంది అనీ, అందర్నీ మింగేస్తుంది అనీ, నామం కనపడితే, దాన్ని నాకేసి, వెళ్లిపోతుంది అనీ ప్రచారం చేశారు!

--ఇంకోసారి, ఆకాశంలో కొన్ని పిశాచాలు ఓ శవాన్ని మోసుకెళ్తున్నాయి అనీ, ఆ సమయం లో బయటికి వస్తే, రక్తం కక్కుకుని చచ్చిపోతారు అనీ పుట్టించారు.

--ఇంకోసారి, వీధి తలుపులమీద "ఓ స్త్రీ, రేపురా...." అని వ్రాస్తే, ఆ తల విరబోసుకుని, నాలుక బయటకి వేళ్లాడుతూ ఉండే స్త్రీ.....వెళ్లిపోతుంది అనీ, అలా వ్రాయక పోతే, ఇంట్లోకి వచ్చేసి, అందర్నీ మింగేస్తుంది అనీ పుట్టించారు!

--మరోసారి, వెంకటేశ్వర స్వామి పాము రూపం లో మాయమై పోయాడు అనీ, సరిగ్గా అలాంటి ఉత్తరాలే ఇంకో ఇరవై వ్రాసి, ఇరవైమందికి పంపిస్తే మంచి జరుగుతుంది అనీ, లేకపోతే అనేకవిధాల నష్టపోతారు అనీ.....పుట్టించారు!

ఇవన్నీ ఎన్నికల ముందే జరిగేవి అనీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించేది అనీ అందరూ ఎరిగిన సత్యం!

అవే ఉపాయాలు జనతావాళ్లూ, బీజేపీ వాళ్లూ ఉపయోగించాల్సి వచ్చింది......"వినాయకుడు పాలు తాగుతున్నాడు....." వగైరాలతో! అప్పుడూ వాళ్లే నెగ్గారు!

ఇప్పుడు కూడా, అలాంటివి పుట్టిస్తూనే ఉన్నారు......చతికిలపడుతూనే ఉన్నారు! 

ఇప్పుడు, సోషల్ మీడియా దరిద్రాలోటీ! పైసా ఖర్చు లేకుండా, అపప్రథలని వ్యాపింపచెయ్యొచ్చు! తరవాత నలుగురూ తిడితే, నోరు వెళ్లబెట్టచ్చు!

అలాంటివే....."ఈజిప్టు తరహా....."; "జల్లికట్టు తరహా......"; "ఇంకేదో తరహా......" అంటూ పేలే అవాకులూ, చెవాకులూ!

మరి మీరేమంటారు?

4 comments:

sarma said...

అది వాళ్ళకి ఉగ్గుపాలతో వచ్చిన విద్యేనంటాం.

మీ బ్లాగ్ ఫాంట్ సైజ్ పెంచాలంటాం, కనపట్టం లేదంటాం :)

A K Sastry said...

డియర్ sarma!

చాలా సంతోషం. ఇప్పుడు సైజ్ బాగుందా?

ధన్యవాదాలు!

SD said...

That's why they say "Yes size matters!" :-)

sarma said...

ఇదివరకటికంటే మేలేగాని, మరికొంచం పెంచచ్చు :)