Saturday, December 27, 2008
గమ్మత్తు
Thursday, December 25, 2008
గమ్మత్తు
గమ్మత్తుతెలుగువాళ్ళకి ఇంటి పేర్లు వుంటాయి!—ఇది సామాన్యార్ధకం కాదు! యెందుకంటే, తెలుగు వాళ్ళే అయిన చాలా మందికి ఇంటి పేర్లు వుండవు! కొన్ని తెలంగాణా జిల్లాలలో, వాళ్ళ వృత్తినే ఇంటి పేరుగా చెప్పుకుంటారు! రాయల సీమలో కొంతమందికి వాళ్ళ ఊరు పేరే ఇంటి పేరు! దక్షిణంలో కొంతమందికి తండ్రి పేరే ఇంటిపేరు! ఇంకొన్ని ఇంటిపేర్లు చిత్రంగా వుంటాయి—సామాన్యంగా ఇంటిపేరుని ఒకే ఇంగ్లీష్ అక్షరంతో సూచిస్తారు! ఉదాహరణకి, దేవులపల్లి వారు డీ అనీ, నేదురుమిల్లి వారు ఎన్ అనీ—ఇలా! దేవులపల్లివారు డీపీ అనీ, నేదురుమిల్లివారు ఎన్ ఎం అనీ పెట్టుకోరు! కానీ, కొంతమంది, మన రాశ్శేఖర్రెడ్డి తండ్రి లాంటి వాళ్ళు (ఇంకా పూర్వులేమో) వాళ్ళ ఇంటి పేరుని వై ఎస్ అనీ, ఆది కేశవులు నాయుడు డీ కే అనీ—ఇలా పెట్టుకున్నారు! వై ఎస్ అంటే, యెద్దుల సందు ఇంటి అని! (ఇప్పుడు రాశ్శేఖర్రెడ్డి ‘యెద్దునసనదింటి’ అనో, ఇంకేదో చెబుతున్నాడు!) వాళ్ళ ఇల్లు యెద్దుల సందు లో వుండేది గావును! అదే వాళ్ళ ఇంటి పేరయిపోయింది! ఇంకో విషయం తెలుసా? మొగల్తూరు రాజుల ఇంటిపేరు ‘కలిదిండి’వారు! రాను రానూ, వారిని సం సంబోధించడంలో, ‘శ్రీ రాజా’ అని ముందు చేర్చి, కలిదిండి ‘ఫలానా ఫలానా రాజుగారు’ అనే వారు! చివరకి వాళ్ళ ఇంటిపేరు కాస్తా ‘శ్రీ రాజా కలిదిండి’ అయి పోయింది! వాళ్ళ వారసుల పేర్లన్నీ, ఎస్ ఆర్ కే అనే ఇంటి పేరుతోనే మొదలవుతాయి! ఇంకొన్ని ఆసక్తికర విశేషాలు మరోసారి!
Monday, November 3, 2008
Friday, October 31, 2008
Saturday, October 11, 2008
Sunday, June 15, 2008
----------ఎవరంటే! తెలుగు భాష గురించి 'ఉత్తుత్తి 'గా కాకుండా, సీరియస్ గా..............(సారీ! తెలుగులో ఈ మాట లేదుకదా!.....అరె! సారీ అనే మాట కూడా లేదుగా!) నిజంగా........నిఝంగా.........నిఝెంగా తెలుగు గురించి ఆలోచించే, బాధపడే, (మళ్ళీ లేచే), సిగ్గుపడే,-------(ఇక 'పడే' అనే మాట వచ్చినప్పుడల్లా 'మళ్ళీ లేచే' అనేది మీరే చదివేసుకోండి..... అస్తమానూ నేను రాయను)-----తపనపడే, పాటుపడే..............ఓ జీవి!"ఓతెలుగు రాడికల్"
ఈ జీవి కొన్ని ప్రశ్నల్ని సంధిస్తాడు............(ఈ మాట తెలుగేనా?--ఏమో!)...... (అవునూ........జీవి లింగరహితం గదా?..........స్తాడు అనాలా? స్తుంది అనాలా?) "ధర్మ సందేహాలు తరవాత.......ముందు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటొ......... అదే...అడగదలుచుకున్నదేమిటో అడిగెయ్యవోయ్! జీవీ! అంటున్నారా?-----సరే! మరి మీ దగ్గర సమాధానాలుంటే పంపిస్తారుగదూ?
నా సమాధానాలు కూడా రాస్తూ వుంటాను! చదవండి! తప్పైతే, దిద్దుకోడానికి నేను రడీ! (అంటే సిద్ధం అన్నమాట)
ఇక ప్రశ్నలు..........నా సమాధానాలు (ప్రతీ ప్రశ్న కిందా) 1) తెలుగు ప్రాచీన భాషా? కాదా?
జ: ఖచ్చితంగా అవును!
ఎలాగంటే, ఆదికవి గా గౌరవించబడుతున్న 'నన్నయ్య ' 11వ శతాబ్దం వాడు. అంటే క్రీ.శ.1000వ 1099వ సంవత్సరాల మధ్యలో వాడు. మొదటగా తెలుగు భాషని 'సంస్కరించడానికి ' "అంధ్ర శబ్ద చింతామణి" అనే వ్యాకరణన్ని వ్రాశాడు. అంటే, అంతకు ముందే ఈ భాష వుందనీ, దాన్ని సంస్కరించాడనీ కదా అర్థం?
ఇదే కాకుండా, బోలెడన్ని ఆధారాలు కూడా పెద్ద పెద్ద పండితులు చూపిస్తున్నారు(ట).
మరి వెయ్యి సంవత్సరాల చరిత్ర వుంటే చాలు, ప్రాచీన భాషగా గుర్తిస్తామన్న గవర్నమెంటు, తెలుగు కన్నా ముందు 'తమిళాన్ని ' గుర్తించడం ఎందుకట? అంటే, కాంగీరేసొళ్ళ గవర్నమెంటులో చేరడానికి, మద్దతు ఇవ్వడానికి, డీఎంకే పార్టీ పెట్టిన షరతుల్లో ఇది ఒకటి కాబట్టి!
మరి దానివల్ల ఒరిగేదేమిటి? అనడిగితే, ఓ ఐదు కోట్లిచ్చి, 'మీ భాషాభివృద్ధి చేసుకోండి ' అంటారట గవర్నమెంటోళ్ళు!
మరి, అన్నిరాష్ట్రాలకన్నా ఎక్కువమందిని గెలిపించి, వాళ్ళకి మెజారిటీ రావడానికి కారణమైన తెలుగు వాళ్ళకి దక్కిందేమిటి? అసలు షరతులు పెట్టే ధైర్యం కూడానా, మన ఆరంభ శూరులకి?
మన గిరీశాన్ని పొగడాలనిపించడంలేదూ? (మనవాళ్ళొట్టి వెధవాయలోయ్! అన్నందుకు)
2) 'తెలుగువారు తెలుగు భాషనే మాట్లాడండి ' అంటూ తెలుగు భాషని కంగాళీ చేసి, భ్రష్టు పట్టిస్తున్నదెవరు?
జ: తెలుగు వీరాభిమానులైన పండితులే!
3) అన్నమయ్యకి తెలుగు భాష రాదా?
జ: అన్నమయ్య మాతృ భాషే తెలుగు! ఆయన వ్రాసిందే అచ్చమైన తెలుగు భాషలో! మరి.....?
4) శ్రీ శ్రీ ఊహించిన మరో ప్రపంచం వస్తుందనుకుంటున్నారా? అసలు రావాలా? వద్దా?
జ: ఖచ్చితంగా రాదు! వస్తే మంచిదే గాని....రాకపొయినా ఫరవాలేదు!
5) ఓ ముసలాడెవరో, పెద్ద గొప్పగా చెప్పిన 'వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు! ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు!' అనే న్యాయ సూత్రాన్ని ఇప్పుడూ పాటించడం ఉచితమా?
జ: ఇది ఎప్పుడూ ఉచితం కాదు! తనదాకా వచ్చిన తరవాత, ప్రతీ దోషీ ఆశ్రయించడానికి మాత్రం బాగా పనికొస్తోంది!
6) "కాన్స్ క్రిప్షన్" అనే మాట విన్నారా? మీ అభిప్రాయం?
జ: ఇండియా దటీజ్ భారత్ లాంటి దేశానికి అత్యవసరమైన వాటిలొ మొదటిది! కానీ ఎందుకో ఎవరూ ఇంతవరకూ పట్టించుకొలేదు!
7) అమెరికావాడు యుద్ధాలు ఎందుకు చేస్తున్నాడు?
జ: "ట్రిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన ఆయుధ సామాగ్రి పాడవకుండా చూసుకోడానికే బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చెయ్యవలసి వస్తోంది! పైగా ఫలానా ఆయుధం ఇన్నివేల మందిని చంపగలదు......ఫలానా ఆయుధం ఇన్నివేల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న వాటినన్నింటినీ నాశనం చెయ్యగలదు అని చెప్పుకోడమే తప్ప, అవి నిరూపించబడడం, వాటికన్న గొప్పవి తయారు చెయ్యగలం అని నిరూపించుకోవడం ఎలా? అందుకే.....ఓ సారి వాడి చూస్తే పోలా!" అనిపించినప్పుడల్లా.....ఏదో ఒక దేశం మీద యుద్ధం చేస్తూ వుంటాడు అమెరికావాడు!
8) 'క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ ' ఎప్పుడు, ఎందుకు వచ్చింది?
9) 'ఫాక్లాండ్ యుద్ధం, ఇంగ్లాండు ఎందుకు చేసింది?
ప్రస్తుతం ఈ తొమ్మిది యక్ష ప్రశ్నలకీ సమధానాలు చెప్పండి. తరవాత మిగిలినవి.......త్వరలో!
----------"ఓ తెలుగు రాడికల్"