Thursday, April 30, 2009

శ్రీ శ్రీ

శ్రీ శ్రీ శతజయంతి
ఇప్పటి పరిస్థితుల్లో ఆయన ‘రిలవెన్స్’? ఆయన ప్రేమ పాటలు—‘కిరణాలలోనేగా—సరోజం కిలకిల నవ్వేదీ’ ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ—ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో! ……….నే వెళితే మరి నీవో? మజునూవవుతావూ!’ ‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై………’

Tuesday, April 28, 2009

గెలుతు

“గెలుతు షాభ”
(తెలుగు భాష) “రీము మేయి సేచునుత్తారు?” (మీరు యేమి చేస్తున్నారు?) “నయ్యం నిత్తారా?” (అన్నం తిన్నారా?) “పేరు లకుమ్మాదు!” (రేపు కలుద్దాము) “కిం యా మేటియి గంతసులు?” (ఇంకా యేమిటి సంగతులు?)

“లుగుతె”

“లుగుతె” షభా! “రుమూసుకున్నినో, డుక్కోప!” “న్నన్నయ్యాచి! ద్దన్నాయ్యాపె!” “మిచేస్తున్నారుయే?” ఇదో కోడ్ తెలుగు భాష! ప్రాక్టీసు చెయ్యండి!

Saturday, April 18, 2009

కొంతమంది

(తె)‘లంగా’(ణా) వాదులు
తొలి విడత పోలింగు ముగిసింది—తెలంగాణాలో హస్తం తిరగబడిందంటున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి ‘ప్రాంతీయ విభేదాలని’ రెచ్చగొట్టడానికి పూనుకున్నాడనీ అంటున్నారు! నిజంగా తెలంగాణా ఇస్తే మంచిదా, రాష్ట్రం మూడుగానో, నాలుగ్గానో విడిపోతే మంచిదా—అన్న విషయం పక్కన పెడితే, అసలు గొడవంతా ఈ ‘లంగా’ వాదులతోనే వస్తోంది…..యెప్పుడు వచ్చినా! అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, ఓ (దుర్)రాజ(కీయ) శేఖర రెడ్డి ప్రవేశిస్తాడు. తెలంగాణా మంత్రులూ, ఎంపీలతో సంతకాలు పెట్టించి, ప్రత్యేక తెలంగాణా కావాలని అధిష్టానానికి పంపిస్తాడు. వాడి వ్యక్తిగత కారణాలతో వేరే కుంపటి పెట్టుకున్న కేసీఆర్ ని రెచ్చగొట్టి, పొత్తు పెట్టుకొని, యెన్నికల్లో గెలిచి, తెప్ప తగలేసి, ‘యేకాభిప్రాయం’…….ఇంకా మాట్లాడితే 6 కోట్ల మంది యేకాభిప్రాయం’ అన్నాడు. ఇప్పుడు మూడు ప్రాంతాలూ ఆరు యెడారులుగా మారతాయని హెచ్చరిస్తున్నాడు! నాయకుల మీద చెప్పులు వేయించిందీ, ముఖ్య మంత్రిని దించడానికి హైదరాబులో మత కలహాలు రేపిందీ యెవరూ—అన్నది ‘వేయి రామ మాడల’ ప్రశ్న! ఓ పక్కన అసలు తెలంగాణా ‘ఉద్యమం’ యేదీ? హోల్ ఆంధ్రాయే కాదు—భారద్దేశం మొత్తంలో—ఇంకా మాట్లాడితే ప్రపంచంలో యే ఉద్యమం నడిచినా, దానికి వెన్నెముక—యువతరం! అంటే విద్యార్ధులతో, మహిళలతో కలుపుకుని! శ్రీలంకలో ఎల్ టీ టీ యీ ఈ రోజు మట్టి కరుస్తోందంటే కారణం—యువత వికర్షితులు అవడంవల్లే! యెందుకు జరుగుతోందిలా? యువతమాట—‘పెద్దవాళ్ళున్నారుగా…..చూసుకోడానికి!’ అని. ఇంకా—నేనూ, నా ర్యాంక్, నా కెరీర్, నా పెళ్ళీ, నా ఇల్లూ, నా పిల్లలూ, భవిష్యత్తూ, వీటన్నింటి తరవాత……..తరవాతే……ఇంకేదైనా! అందుకే రాజ్యమేలుతున్నది—డెభ్భై యేళ్ళూ, ఎనభై యేళ్ళూ దాటిన వాళ్ళూ. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అన్నట్టు, ఈ లంగా గాళ్ళని ఓ పట్టు పట్టాలంటే కావలసినది……. “పావన నవజీవన బృందావన నిర్మాతలు” కదా!