Tuesday, May 26, 2009

కలిసొచ్చే కాలానికి….

…..నడిచొచ్చిన ‘పొన్నాల’!
జాం జాం అంటూ సాగిపోయే హైద్రాబాదు ట్రాఫిక్, కొన్ని గంటల పాటు 'జాం ' అయ్యి ఆగిపోయిందట—కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం పేరు చెప్పుకొని! పోలీసులేం చేస్తారు పాపం! వాళ్ళకొచ్చిన ఆదేశాల ప్రకారం, సాయంత్రం 4 గంటలనించే ట్రాఫిక్ నియంత్రణ మొదలెట్టారు! {ఆదేశాలిచ్చింది మన ‘వుంతా’ (అంటే తీతా కి వ్యతిరేకం—అనగా తీసేసిన తాసిల్దారు కి వ్యతిరేకం—వుంచేసిన తాసిల్దారు అని)—అంటే మన యెదవ......సారీ! యాదవ్ నా మజాకా అని} కొన్ని కిలోమీటర్ల పొడవునా, కొన్ని వేల వాహనాలు నిలిచిపోవడంవల్ల, పాపం పొన్నాల, తన కారు దిగి, నడుచుకుంటూ వెళితేగానీ, ప్రమాణ స్వీకారం చేరుకోలేకపోయారట! కొంతమంది సైకిళ్ళమీదా, ఇంకొంతమంది మోబైక్ లు/స్కూటర్ల మీదా పరిగెట్టారట! ఇక మన బొచ్చె, బాలినేని, టైముకి చేరలేకనేపోయారట! వీళ్ళ సంగతి యెలాగున్నా, వోటేసిన, వెయ్యని సామాన్య ప్రజానీకానికి ఈ ఇక్కట్లేమిటి—కొత్త ప్రజా ప్రభుత్వం పేరు చెప్పుకొని! తుంటె మీద కొడితే, పళ్ళు రాలడమంటే ఇదేనేమో! ఇంతకీ, ఈ పాపం యెవరిదంటారు?—ఆఖరు నిమిషం వరకూ యెవరికి మంత్రి పదవులు ఇస్తున్నాడో ప్రకటించని మన రాశ్శేఖరుది కాదూ? దీన్ని నివారించలేమా? కొసమెరుపేమిటంటే, రాత్రి 9 గంటలైనా, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదట! అదండీ!

3 comments:

పానీపూరి123 said...

ముందే ప్రకటిస్తే...మిగతా MLA లు రారు కదా?

A K Sastry said...

Dear Panipuri123!

మీరు మరీనూ! మంత్రుల ప్రమాణ స్వీకారానికి మిగిలిన ఎమ్మెల్యేలెందుకండీ? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేది శాసన సభలో!

ఈ ప్రమాణ స్వీకారాలకీ, మొదటి సంతకాలకీ ఇంత సీన్ అవసరమా అన్నదే పాయింటు!

ధన్యవాదాలు!

రానారె said...

టైటిలు అదిరింది సార్.