Tuesday, June 30, 2009

ఆరంభ శూరులు

తెలుగోడి గోడు!
భారద్దేశం లో హిందీ తరవాత అధిక సంఖ్యాకులు మాట్లాడే భాష, ఇప్పటికీ తెలుగేనట!
ఈ విషయం ఇంగ్లీషు వాళ్ళే ఆ రోజుల్లోనే గుర్తించారు (ట). అందుకే నాణాల మీద ఇంగ్లీషు, హిందీ తరవాత తెలుగులోనే ‘ఒక అణా, ఒక రూపాయి’ ఇలా ముద్రించేవారు (ట)!
మరిప్పుడో?
మనకెంత గోరోజనమంటే, మనక్కావలసింది మనం అడగడం కూడా మనకి ‘అడుక్కోవడం’ క్రింద లెఖ్ఖ! దీనికి మనకి ‘ప్రిస్టేజి కొశ్చను’!
‘పాపం తెలుగు వాళ్ళకి ఫలానాది ఇవ్వండర్రా!’ అని ఓ కన్నడ మొయిలీనో, మళయాళ వయలారో, ఇటాలియన్ సోనియాకి సిఫార్సు చేస్తే, ఆవిడ పంజాబీ మన్మోహన్ కి చెపితే, ఆయన బీహారీ లాలూకో, తమిళ చిదంబరానికో మరాఠా శరద్ పవార్ కో చెప్పి, యెంతో కొంత విదిలించమనేవారు!
మరి 38 శాతమో యెంతో వోట్లతోనే తొంబలుగా ఎం పీలని పంపించినా, మనకి దక్కుతున్నదేమిటి?
‘రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగింది’ ‘బడ్జెట్ లో మనకి అన్యాయం జరిగింది’ అని గంభీర సన్నాయి నొక్కులు—మన ముఖ్య మంత్రిగారి చేత!
మరి ఆరంభ శూరులు అంటే అనరూ!

No comments: