Sunday, July 5, 2009

తెలుగు పేర్లు

మన ఆంధ్ర సంగతో!
కేంద్రం నించి ముష్టి యెత్తుకోవలసిన వాటి సంగతి సరే! మన ఎం పీ లు అందుకు పనికి రారు అని మరోసారి నిరూపణ అయిపోయింది కదా!
కనీసం మన రాష్ట్రం లో, కేంద్రం దాతృత్వం తో అవసరం లేని పనులు చెయ్యడానికి మన రెండొందల పైచిలుకు మెజారిటీ వున్న ఎం ఎల్ యే లు యేమైనా చెయ్యచ్చుకదా? వాళ్ళకి మిగిలిన ప్రతిపక్ష ఎం ఎల్ యే లు కూడా మద్దతు ఇస్తారుగా?
ఉదాహరణకి ‘శ్రీ గిరి శ్రీ పతి దేవస్థానం’ అని మార్చడం, (ఆ వూళ్ళ పేర్లు మార్చగల ధైర్యం వుంటే ఇంకా మంచిది!), హైదరాబాదు ని భాగ్య నగరం అని మార్చడం, బెజవాడ, రాజమహేంద్రి—ఇలా పేర్లు మార్చడం—ఇలాంటివి చెయ్యచ్చు కదా—మన తెలుగుదనం వుట్టిపడేలా!
ఆలోచించండి!

2 comments:

Shashank said...

మన ఎం. ఎల్ .యే లా? కావాలంటే తిరుపతి ని రావీజ్పతి నగరం అనో ఇందిరాబాద్ అనో అని చెప్పండి చట్టుకున మార్చేస్తారు. అంత కంటే ఆశలు పెట్టుకోకండి.

A K Sastry said...

డియర్ Shashank!

హహ్హహ్హ! చాలా బాగా చెప్పారు!

మరి వాళ్ళని యెక్కుకున్నది మనమేగా!

చంద్రబాబు జేపీ కాంగ్రెస్ దగ్గర 59 కోట్లు దొబ్బారంటున్నాడు! చిరంజీవి కావాలనే కొన్నిచోట్ల వాళ్ళ కేండిడేట్లని నిలబెట్టలేదు అంటున్నాడు!

ఇప్పటికైనా, మన చిరంజీవులూ, జేపీలూ, చంద్రబాబులూ, కేసీఆర్ లూ, నారాయణలూ, రాఘవులు లూ, యేచూరి లూ కనీసం 'సమర్తాడితే' బాగుండును!