Monday, September 14, 2009

హేతువాదం.....


హేతువాదులు--16


క్రియలూ, యోగాలూ : --2  


పాణిని అనేవాడు సంస్కృత వ్యాకరణం వ్రాశాడు--దానికి చక్కని భాష్యం వ్రాశాడు పతంజలి--ఇది ప్రజల వాక్శుద్ధి కోసం.  


రోగాలకి చికిత్సల గురించి వ్రాశాడు--చరకాచార్యుడు తన చరక సం హితలో--ఇది ప్రజల ఆయుష్షు పెంచడానికి.  


శరీరం, మనస్సూ శుభ్రంగా వుంచుకోడానికి--యోగ శాస్త్ర భాష్యం వ్రాశాడు పతంజలి.  


చరకుడూ, పతంజలీ ఒకడే అని చాలామందికి తెలియదు!  


ఇక ప్రస్తుతం లో అనేక యోగా లూ, బోళ్ళుమంది యోగా 'గురూ' లూ--త్రికోణ యోగా, చతురస్ర యోగా, పంచముఖ యోగా, అష్టదళ యోగా, పిరమిడ్ యోగా--ఇలా రకరకాల షేపుల్లో అనేక యోగాలు! పాతకాలపు 'కుండలినీ యోగా' లాంటివి యెలాగూ వుండనే వున్నాయి.  


మూలాధార చక్రం నించీ, అనాహత వగైరా చక్రాలద్వారా నిద్రలేపిన కుండలినీ శక్తిని సహస్రారం దాకా చేర్చి, (కపాల) మోక్షం చెందినవాళ్ళెవరైనా వున్నారా?  


ఈ కుండలినీ యోగానికీ, గాయత్రి కీ ముడి పెట్టి, మంగేష్ లాంటివాళ్ళు యేమైనా సాధించారా?  


ఇక ధ్యానం, జపం, తపం ఇలాంటివి కూడా వున్నాయి.  


'ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస' అని చక్కగా నిర్వచించాడో మహానుభావుడు. నిజం. (దీన్నే పూర్వం ప్రాణాయామం అనేవారనుకుంటా!) నిపుణులే చెప్పాలి.  


వీళ్ళు చెప్పేది 'పూర్తిగా శ్వాశ తీసుకొని, కుంభించగలిగినంతసేపు బిగబట్టి, తీసుకోడానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం లో తిరిగి బయటికి వదలాలి' అని. ఇది కేవలం శ్వాసని క్రమబధ్ధీకరించడానికే! మన బుర్రలో తిరుగుతున్న ఆలోచనలని బట్టి శ్వాస క్రియ 'ఇర్రెగ్యులర్' గా వుంటుంది. నిద్రపోవడానికి ముందు ఇలా చేస్తే, శ్వాస క్రమబధ్ధీకరింపడి, చక్కగా నిద్ర పడుతుంది.  


ఆలా అని పిల్లికీ, బిచ్చానికీ ఒకే మంత్రం కాదు.  


ఇప్పుడు 'ఫిజియో థెరపిస్టు 'లు 'ఒకేసారి వేగంగా వూపిరి తీసుకోండి--తీసుకోడానికి పట్టిన సమయం లో సగం సమయం లోనే, నోటి ద్వారా వదలండి' అని చెపుతారు--ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళకి!  


అలా చెయ్యడంవల్ల, ఛాతీలో (వూపిరితిత్తుల్లో) ఇన్ ఫెక్షన్లు రావు! మరి ఇదేమి యోగం? ధ్యానం? ఈ 


యోగాలూ, ధ్యానాలూ--వీటి ప్రచారం--  


ఇవన్నీ యెందుకు?

7 comments:

Mangesh said...

నేను మీకు గుర్తు వస్తుంన్నందుకు చాలా సంతోషం. బహుశా మీకు గాయత్రి గుర్తు వచ్చినప్పుడల్లా నేను మీ మదిలో మెలుగుతానేమో.
నేను మీ టపాలు చదివిన తరువాత మీ మేధస్సు అర్థమైనది. మీరు పడుతున్న శ్రమ అర్థమైనది. మీకు నా థన్యవాదములు.

అసలు మానజ జన్మే పరిపూర్ణత కొరకు. ఆ అన్వేషణలో అనేక దారులు వెతికి చివరకు విసిగి వేసారి తనను తాను తెలుసుకోవడమే నిజమైన అన్వేషణ అని తెలిసి దానివైపు వెళతాడు. "ఎవరు దేనికొరకు అన్వేషణ చేసినా అది నన్ను తెలుసుకొనుటకు చేయు ప్రయత్నమే" అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి యున్నాడు. "నన్ను" అంటే నేనును తెలుసుకోవటం అని అర్థము. మీరు చేస్తున్న ప్రయత్నము కూడా అదే అని భావిస్తాను. అలా జీవులు చేసే అన్వేషణలో ఏర్పడిన అనేక మార్గములే ఈ యోగములు, ధ్యానములు, మంత్రములు. దేనివల్ల ఎలాంటి ఆనందము పొందారో దానిని పొందినవారు తెలియజేసి మిగిలిన వారు కూడా దానిని అనుభవించ వలెనని వారు వాటిని ప్రపంచమునకు అందించారు. అన్ని మార్గములు కూడా ఆనందమును పొందుటకే. అన్నింటిలోనూ సత్యము వున్నది. దేనినీ నమ్మనిచో ఎందులోనూ లేదు. చివరకు ప్రపంచము అంతా లోపభూయిష్టముగా కనపడుతుంది. చూచే చూపును బట్టే అంతా. చూపు లేని వాడికి ఎమీ లేదు.

జరుగుతున్న వాటిని విమర్శిస్తేనో, బాగా తిట్టితేనో మార్పు రాదు. మార్పు సహజంగా లోపలి నుండి కలగాలి. ఎవరు ఎన్ని చెప్పినా తనకు తోచిందే నిజం అని భావించటం మానవ నైజం. కొంత మంది మాత్రమే అన్నిటిలోనున్న సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించి కృతకృత్యులవుతారు. మనకు తెలిసిందే సత్యము కాదు. అలా అని తెలియంది కూడా సత్యము కాదు. రెండూ కలిపి సత్యము. మీ రచనలతో ప్రజలను చైతన్య వంతులను చేయండి. వారిని మేల్కొలపండి. జాగృతులను చేయండి. ప్రేమతో చెప్పండి. ప్రేమతో సమస్తమును జయించ వచ్చును. మీరు కొన్ని టపాలలో ఒక వర్గ విమర్శ చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. మీ ఉద్దేశ్యము మంచిదే అయిననూ దానిని అందరూ మెచ్చే విధముగా తెలియచేయవలెను కదా? మనసు కాక హృదయము స్పందించ వలెను. హృదయము నందు కలిగిన మార్పే నిజమైన మార్పు.

మనిషి లేని సమాజము లేదు. మార్పు కలిగిన మనిషి వల్ల సమాజము మారుతుంది. అది అందున్న అందరికి కలగాలి. ఒక్కరికి కాదు. దానికోసం ప్రయత్నము ఒదలకుండా వేచి వుండటమే. అందుకు అందరం ప్రయత్నిద్దాం.

ధన్యవాదములు,
మంగేష్

కృష్ణశ్రీ said...

డియర్ Mangesh!

నేను 'యేకహస్తం' (single handed)తో చేస్తున్న కృషిని అర్థం చేసుకొన్నందుకు ధన్యవాదాలు!

అక్కడ గాయత్రి ముఖ్యం కాదు--మీ 'perception' ముఖ్యం నాకు.

మీరు చెపుతున్నవి చాలా బాగుంటున్నాయి-'యోగములు, ధ్యానములు, మంత్రములు.....మిగిలినవారు కూడా దానిని........అందించారు' అన్నది అక్షర సత్యం!

కానీ ఆ పేరుచెప్పుకొని వ్యాపారాలు చెయ్యడం (పాపం పొట్టకూటికే అన్నాసరే), వేలంవెఱ్ఱుల్ని ప్రోత్సహించడం యెంతవరకు సబబు?

నా టపాలు పూర్తిగా చదవకుండా, సమన్వయలోపంతో 'వర్గ విమర్శ' అనుకున్నవాళ్ళు ఆమాట వొప్పుకున్నారుకదా?

'......అందరికి కలగాలి......ప్రయత్నిద్దాం.' అనేమాటలు నా చెవుల్లో అమృతం పోశాయి!

కొనసాగించండి!

మరోసారి ధన్యవాదాలు!

Mangesh said...

అక్కడ గాయత్రి ముఖ్యం కాదు--మీ 'perception' ముఖ్యం నాకు.
___________________________________________________________________

గాయత్రి గురించి నా perception మీకు ఎందుకు నచ్చలేదు. నచ్చక పోవటానికి ఏమైనా ఆథారాలు వున్నాయా? నాకు ఆనందాన్ని ఇచ్చిన దాన్ని ఇంకొంత మందికి పంచే ప్రయత్నము చేశాను. అంతే కానీ అందులో వున్నది సరికాదు అని ఎలా చెప్ప గలరు. చాలా సందర్బములలో నేను వ్రాసిన గాయత్రి టపా గురించి మీరు చాలా వ్యంగముగా విమర్శించారు. అది ఎంత వరకు సబబు. ఎవరి దర్శనము వారిది కదా? అందులో కూడా సత్యము వున్నదని మీకు ఎందుకు అనిపించలేదు. అది అవగాహానా లోపమే కదా? కుండలినికి గాయత్రికు ముడి పెట్టి అన్నారు. సమస్త యోగములకు కూడా గాయత్రే మూలము. అందువల్ల దాన్ని దేన్తో ముడి వేసినా తప్పు లేదు. అన్నీ అందులో నుండి వచ్చినవే.. అందులోనికి వెళ్ళి పోయేవే...

వేలంవెఱ్ఱుల్ని ప్రోత్సహించడం యెంతవరకు సబబు?
____________________________________________________
వేలంవెఱ్ఱుల్ని ప్రోత్నహించమని చెప్పటం లేదు. కోటి విద్యలు కూటి కొరకే కదా? ఎవరు ఎన్ని చేసినా పొట్ట నింపుకోటానికే కదా? ఇక వ్యాపారం అంటారా! అది వారి వారి సంస్కారము బట్టి వుంటుంది. చేసే పని, చెప్పే మాట అన్నీ కూడా ఆ వ్యక్తికి వున్న అవగాహనను తెలియచేస్తాయి. వ్యక్తిలోని అపరిపూర్ణతే అతని చేత కర్మలు చేయిస్తుంది. అది పూర్తి అయితే దాని వైపు వెళ్ళడు. ఇది అందరికి వర్తిస్తుంది. దీనికి ఎవరూ అతీతులు కారు. ఇతరులకు ఏరకంగా కూడా హాని చేయకుండా జీవనము కోసము ఏ పని ఐనా చెయ్య వచ్చును. అంతఃకరణ శుద్ది వుండాలి.

ధన్యవాదములు

కృష్ణశ్రీ said...

డియర్ Mangesh!

Perception--అంటే, మళ్ళీ--'గాయత్రిగురించి నా ' అంటారు!

నేను మీ 'గాయత్రి టపాని ' వ్యంగ్యం గా విమర్శించానంటారు! (యెప్పుడో యెక్కడో మీకే తెలియాలి!)

'........ముడివెయ్యడం' తప్పనలేదు--యేమైనా సాధించారా? అన్నాను!

'ఇతరులకి హాని చెయ్యకుండా........'--నిజం! కానీ వేలంవెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయే!

నా వుద్దేశ్యంలో మీ perception కి ఇవే దాఖలాలు!

ధన్యవాదాలు!

Mangesh said...

మీరు విమర్శించినది "నా" perception నే కదా? కాబట్టి గాయత్రి గురించి "నా" అన్నాను. నేను ఏమి సాధించాను అన్నారు. అది మీకు తెలియదు కదా? తెలిననప్పుడు అలా మాట్లాడటము వ్యంగము కాక మరి ఏమవుతుంది. మీరు వ్రాసే వాటి గురించి నేను మీరు ఏమి సాథించారు అనలేదే. మీరు తెలియచేసినదానికి మరింత అవగాహన ఇవ్వటానికి ప్రత్నించాను. నా పేరు మీరు రెండు సందర్బములలో వాడారు. అది కూడా విమర్శనాత్మకంగా.

వేలం వెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయి అన్నారు. అవి మాత్రమే చేసున్నాయా? అన్నిటిని వెక్కిరిస్తూ, విమర్శిస్తూ పూర్తిగా తెలుసుకోకుండా అవి ఎందుకు, ఇవి ఎందుకు.. అవి ఎవరికి ఏ మేలు చేశాయి.. వాటి వల్ల ఎవరు ఏమి లాభము పొందారు అనటము వల్ల కూడా సమాజానికి హాని జరుగుతుంది. ఏది ఏందుకు వున్నదో పూర్తిగా తెలియదు కదా? ఏదీ అనవసరముగా లేదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు అది అవసరము లేదు. పనికి మాలినది.. అందరూ ఎమిటో .... వెఱ్ఱి అని పిస్తుంది. తెలిసినప్పుడు ఏది ఎందుకు వుపయోగపడుతుందో తెలుస్తుంది. సృష్టిలో అనవసరమైనది ఏమీ లేదు. దానియందు అవగాహనా లోపము వల్ల మనకు అనవసరం అని పిస్తుంది. ఆలోచించండి...

కృష్ణశ్రీ said...

డియర్ Mangesh!

అదుగో! మళ్ళీ విమర్శిస్తున్నానంటున్నారు!

'గాయత్రి గుర్తుకొచ్చినప్పుడల్లా.........' అని మీరంటే, అది కాదు మీ perception ముఖ్యం అన్నానని మరిచిపోతే యెలా?

రెండుసార్లు వాడినా, '.......లాంటి వాళ్ళు ' అని అందర్నీ అన్నాను--మిమ్మల్ని ప్రత్యేకించలేదే?

ఇక సాధించడం విషయానికొస్తే, నేనేదో సాధించాను అని చెప్పుకోలేదు--నా టపాల ద్వారా!

కానీ, యోగాలూ వగైరాలవల్ల యేదో వుంటుందని విపరీత ప్రచారం చేసేవాళ్ళు సమాధానం చెప్పవలసే వుంటుంది--లేదా ప్రచారం మానుకోవాలి!

'యెందుకు' అనే ప్రశ్నే లేకపోతే, ఇప్పటి సమాజ వునికే లేదు! అది హాని చేస్తోందన్నారంటే.....!

ధన్యవాదాలు!

Mangesh said...

ఇంకొకరిని ఒకనితో పోలిస్తే ఇద్దరూ ఒకటనే కదా?

మీరు ఏమి సాథించారో నాకు తెలుయదు, కనుక నేను మిమ్మల్ని ఏమి సాథించారో అని అనలేదు. పూర్తిగా చదివి అవగాహన చేసుకోండి

కానీ, యోగాలూ వగైరాలవల్ల యేదో వుంటుందని విపరీత ప్రచారం చేసేవాళ్ళు సమాధానం చెప్పవలసే వుంటుంది--లేదా ప్రచారం మానుకోవాలి!
___________________________________________________________________________________

ఎవరికి సమాథానము చెప్పాలి? వారు చెప్పినది కరెక్టే అని ఎవరు నిర్ణయిస్తారు? అవతలి వారు చెప్పినది నిజం అని చెప్పాలంటే ప్రశ్నించినవానికి తెలిసి వుండాలి కదా? తెలినప్పుడు ఎవరు ఏది చెప్పినా తప్పే అని పిస్తుంది.

'యెందుకు' అనే ప్రశ్నే లేకపోతే, ఇప్పటి సమాజ వునికే లేదు!
______________________________________________________________
యెందుకు అనే ప్రశ్న యెందుకు వేసుకోవాలి? ఎవరు వేసుకోవాలి? ఎవరికి వేయాలి?
జవాబును ఎవరు నిర్ణయిస్తారు?

నేను ఎవరు? యెందుకు ఇలా వున్నాను అనేదే నిజమైన ప్రశ్న. దాని జవాబు కొరకు ప్రయత్నించాలి. అంతే కాని ప్రపంచము ఇలా యెందుకు వుంది అంటే అది అంతె.. జవాబు దొరకదు.. వెతకటమే మిగులుతుంది.

అది హాని చేస్తోందన్నారంటే.....!
________________________________________
హాని అంటే నిర్వచనమేమిటి? అది ఎవరికి చేస్తుంది? ఎవరు చేస్తారు? యోగాలు వగైరాల వల్ల హాని ఎలా జరుగుతుంది? అసలు యోగం అంటే నిజమైన అర్థము ఏమిటి?