Monday, November 30, 2009

......సం రక్షణ


‘………….గ్రామయాత్ర’


మొన్న ఆదివారం సాయంత్రం యేమీ తోచక రోడ్డుపక్కన నిలబడితే, అక్కడ ఓ కులం వాళ్ళు కట్టించుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ముందు దాదాపు టాటా ఏస్ వాన్ అంత సైజులోనేవున్న ఒక వాన్ ఆగి వుంది.  


రోడ్డుమీద సైకిళ్ళపై వెళుతున్న నలుగురైదుగురు (తొమ్మిదో, పదో తరగతి) ఆడపిల్లలు(—నవ్వుతూ తుళ్ళుతూ వెళుతూండడం వారి వయసులో సహజం!) వాళ్ళ వ్యాఖ్యలు నా చెవిని పడ్డాయి.  


(వాళ్ళు చదువుతున్న స్కూలు లోని--వాళ్ళ సబ్జెక్ట్ లో బోధించే వాళ్ళ దగ్గరే--‘ట్యూషన్’ చెప్పించుకోడం ఈ రోజుల్లో తప్పనిసరి!)  


వ్యానుకోపక్కని మేస్తున్న గేదెని చూసి “యేమే! ఇవాళ ‘గేదెగ్రామ యాత్రేమోనే!’” అందో అమ్మాయి. 


మిగిలినవాళ్ళు గొల్లున నవ్వారు.  


ఇంకో అమ్మాయి, ఆ వ్యాను ముందున్న ఓ పందినీ, పిల్లల్నీ గమనించి, “కాదే! ‘పందిగ్రామ యాత్రనుకుంటా!’” అంది. ఇకవాళ్ళ నవ్వులకి కంట్రోలు వుంటుందా!  


కొన్ని సంస్థలు, నిర్వాహకులు మన హిందూ ఆచారవ్యవహారాలనీ, నమ్మకాల్నీ, సాంప్రదాయాల్నీ యెలా భ్రష్టుపట్టించి, కౄరమైన పరిహాసాలాడుతున్నాయో (రో) గమనించారా?  


(ఇది నా ‘క్యామెడీ చానెల్’ లో వ్రాద్దామనుకొన్నాను! కానీ నేనింకా పరిహసిస్తున్నాననుకొంటారేమోనని భయపడ్డాను!)





8 comments:

Malakpet Rowdy said...

అర్ధం కాలేదండీ - ఆ పిల్లలు వేరే మతస్థులా లేక గుడి నిర్వాహకుల నిర్వాకమా ఇది?

కెక్యూబ్ వర్మ said...

సరదాగా తీసుకోవచ్చుకదా?

Anonymous said...

నాకు అర్ధం అయి...కానట్టుగ వుంది !

మంచు said...

సార్ ..అర్ధం కాలే..

A K Sastry said...

డియర్ Malakpet Rowdy!

ఆశ్చర్యం గా వుందే! నా ఇదే బ్లాగులోని 16-11-2009 నాటి ‘గోగ్రామ యాత్ర’ టపా చదివి, కామెంట్ కూడా వ్రాశారే! మరోసారి ఆ యాత్ర నిర్వాహకుల నిర్వాకం చదవండి!

ఆ పిల్లలు యే మతస్తులో తెలియదుగాని, ఆ రోజు తతంగాన్ని చూశారన్నది మాత్రం నిశ్చయం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ కెక్యూబ్ వర్మ! లలిత! మంచు పల్లకీ!

పైన చెప్పిన నా టపాని జాగ్రత్తగా చదవండి! చక్కగా అర్థం అవుతుంది!

ధన్యవాదాలు!

మంచు said...

ముందు టపా చదివాను.. అర్ధం అయ్యింది.
ఒకరి ఊహలకు , అలొచనలు , కామెంట్స్ వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం.. తల్లితండ్రులు గురువులు చెప్పిన/ నేర్పించిన బుద్దుల మీద అధారపడి వుంటాయి.. అందరూ మంచిగా అలొచించాలంటే ఎలా ?

A K Sastry said...

డియర్ మంచు పల్లకీ!

…………….అంటే………..ఆ పిల్లలదే తప్పంటారా? ఆ యాత్ర నిర్వాహకులకి ‘క్లీన్ చిట్’ ఇస్తున్నారా?

మరోసారి ఆ టపా ‘పూర్తిగా’ చదవండి!

ధన్యవాదాలు!