Sunday, December 20, 2009

బ్లాగులు


అంతరంగాలు


'ఇంటర్నెట్' ని 'అంతర్జాలం' అనీ, 'పోస్ట్'లని టపాలు అనీ అనువదించుకున్నాం--బాగానే వుంది గానీ, 'బ్లాగ్'లని యెవరూ అనువదించలేదెందుకో?  


బ్లాగులు వ్రాసేవాళ్ళందరూ (ఒకళ్ళిద్దరు తప్ప) తాము మనసా, వాచా నమ్మినవాటినే వ్రాస్తారు కాబట్టి, వీటిని 'అంతరంగాలు' లేదా 'ఆంతర్యాలు' అందామా?  


మరి అంతరంగాలు వ్రాసేవాళ్ళని యేమనాలి? 'అంతరంగ రచయితలు' అంటే బాగుండలేదు! 'ఆంతర్యులు' అంటే యెలా వుంది?  


సరే! ఇంతకీ యెందుకు మొదలుపెట్టానంటే, మన తెలుగు బ్లాగర్ల మీద నాక్కోపం వస్తోంది!  


యెంతోసేపు బుర్రని ఫోర్కుతో చుట్టూరా గుచ్చుకొని, మెదడు బయట పడేసి, చిందరవందర చేసి, దాంట్లో విలువైన ఆలోచనలని ప్రోదిచేసి, వ్రాసీ, తిరిగి వ్రాసీ, తప్పులు దిద్దుకొనీ, కాస్త ఆవేశం తగ్గించుకొనీ, మళ్ళీ మళ్ళీ వ్రాసీ, ఓ టపాని ప్రచురిస్తే, ఒకటో రెండో వ్యాఖ్యలు! 


అవీ అసలు విషయాన్ని పట్టించుకోకుండా, టపా మొదట్లో వ్రాసిన ఏ చిన్న విషయాన్నో పట్టుకొని, రాధ్ధాంతాలూ, కు విమర్శలూ, 'స్టాండర్డ్' వాగుళ్ళూ!


ఇదండీ--మన తెలుగు బ్లాగు ప్రపంచం!  


అసలు 'కాంట్రవర్సీ' లోకి ప్రవేశించడానికే భయపడుతున్నట్టున్నారు మన బ్లాగర్లు! మరి భయం యెందుకో తెలియదు!  


నేను మొదటినించీ, అన్ని బ్లాగులలోనూ, 'కాంట్రవర్షియల్' విషయాలనే వ్రాస్తున్నాను! 


వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకీ, దేవస్థానాలకీ, చివరికి మా బ్యాంకు యాజమాన్యానికీ, 'లింకులు' పంపిస్తున్న స్నేహితులు యెందరో వున్నారు!  


మరి వ్యాఖ్యలు చేసేవాళ్ళు పూర్తిగా చదవరో, ఇంకేదైనా ప్రభావాలకి లోనవుతారో, అవగాహనా లోపమో--తెలియదు! 


అసలు కాంట్రవర్షియల్ విషయమ్మీద ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు--దాదాపు శూన్యం!  


ఒక్కొక్కసారి, నాలుగు గొంతుకలతో విరుచుకుపడే మలక్ పేట్ రౌడీ దగ్గరనించీ, మంచుపల్లకీ వంటివాళ్ళ దగ్గరనించీ, చక్కటి బ్లాగు నిర్మించుకున్న మంగేష్, వంశీ ఎం మాగంటి ల వరకూ, ఇదే నేను గమనించింది!


అఖిల ప్రపంచ తెలుగు బ్లాగరులారా! యేకం కండి! మీకు పోయేదేమీ లేదు! అనవసర భయాలు తప్ప!  


యెలా వుంది నా నినాదం?

19 comments:

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

ప్రియ నేస్తం!
నా బ్లాగ్స్ వీక్షించడానికి ఇదే నా ఆహ్వానం!!
www.raki9-4u.blogspot.com. . naa sweeya geethaalakai..(lyrics)
www.rakigita9-4u.blogspot.com naa sweeya naanaalakai...
www.raki-4u.blogspot.com naa sweeya vachana kavithalakai..
సదా మీ
స్నేహాభిలాషి
రాఖీ..

కెక్యూబ్ వర్మ said...

మీ ఆవేదన అర్థవంతం. మీ సూచన ఆచరణీయం. నా బ్లాగులు కూడా చూడగలరు.

Malakpet Rowdy said...

నాలుగు గొంతుకలతో విరుచుకుపడే మలక్ పేట్ రౌడీ
_________________________________

What do you mean by this? I use only two ids - This one and "Bhardwaj Velamakanni" - I have no other ids.

I suggest you verify the facts before making these baseless allegations.

Malakpet Rowdy said...

oops - verify the facts "instead" of making these baseless allegations.

Malakpet Rowdy said...

అంతే కాదు, ముందుగా నోరు అదుపులో పెట్టుకోకుండా నోటికిష్టమొచ్చినట్టు కారు కూతలు మొదలెట్టింది విరుచుకుపడింది తమరే! లెక్కలు రావా మమతాదీలా అని - అందుకే ఇవ్వాల్సిన పధ్ధతిలో రిప్లై ఇచ్చా! కావాలంటే వెళ్ళి ఆ పోస్టు మళ్ళీ చూసుకోండి.

http://teluguradical.blogspot.com/2009/07/blog-post_24.html

మంచు said...

నాకేమీ అర్ధం కాలే :(

Malakpet Rowdy said...

ఆయన వివాదాస్పదం అనుకున్నవి మనకి అలా కనబడలేదని ఆయన బాధ. మనకి ఏవి ఎలా కనబడాలో కూడా ఆయనే చెప్తారన్నమాట :))

Ekalavya said...

మిష్టర్ Malakpet Rowdy!

నీకు రెండు ఐడీలు వున్నాయని వొప్పుకున్నావు! హేపీ!

పుట్టినప్పటినించీ వేరే భాషలోనే యేడుస్తున్నావా యేమిటి?

లేకపోతే, వాడుక మాట 'నాలుగు గొంతుకలతో' అనేదాన్ని నాలుగు ఐ డీ లుగా అన్వయించుకుంటావా! చిన్నపిల్లవాడు యెవడైనా గట్టిగా యేడుస్తుంటే, 'నాలుగు గొంతుకులు వేసుకొని యేడుస్తున్నాడు' అంటారు! నీకు అది కూడా తెలియక 'ఒంటికాలి మీద' లేస్తున్నావు! (మళ్ళీ 'నాకు రెండుకాళ్ళూ వున్నాయి! విత్ డ్రా దట్ బేస్ లెస్ యెలిగేషన్' అంటావేమో!) ముందు తెలుగు నేర్చుకో!

నువ్వు రిఫరెన్సులివ్వక్కర్లేదు! అందరూ చూసారు! ముందటి టపాలు చదవకుండా, యేమేమి పేలావో, కొన్ని నిమిషాలలో యెన్ని సార్లు తిప్పి తిప్పీ అవేమాటలు వ్రాసావో! నీమీద యే ప్రభావం వుందో!

'మనకి యేవి ఎలాకనపడాలో కూడా ఆయనే చెప్తారన్నమాట' అనడంలోనే తెలుస్తోంది—నీకు వివాదాస్పద విషయాలని స్పృశించాలంటే భయమని!

ఇప్పటికైనా కాస్త బుర్రపెట్టి అలోచించు!

Malakpet Rowdy said...

నీకు రెండు ఐడీలు వున్నాయని వొప్పుకున్నావు! హేపీ!
_______________________________________

నేను ఎప్పటినించోవాడూతున్నాను సారు - నా పేరు అందరికీ తెలుసు కూడా .. తమలాగా దొంగ ఐడిలతో వ్రాసే అవసరం ఇప్పటిదాకా రాలేదు :))

By the way, "మిష్టర్ Malakpet Rowdy!" is a sureshot giveaway - ఐడీ మార్చినప్పుడు భాష కూడా కాస్త మారాలి :))

పుట్టినప్పటినించీ వేరే భాషలోనే యేడుస్తున్నావా యేమిటి?
______________________________________

అవును - తమకేమన్నా ప్రాబ్లమా? :))


ముందు తెలుగు నేర్చుకో!
______________________________________

కొంపదీసి మమతాదీ లెక్కలతోపాటు తెలుగుకూడా మీరే నేర్పిస్తారా? హతోస్మి :))

నువ్వు రిఫరెన్సులివ్వక్కర్లేదు! అందరూ చూసారు! ముందటి టపాలు చదవకుండా, యేమేమి పేలావో, కొన్ని నిమిషాలలో యెన్ని సార్లు తిప్పి తిప్పీ అవేమాటలు వ్రాసావో!
___________________________________


అందరూ చూశారు, తిట్టారు కూడా - కానీ తిట్టింది మిమ్మల్నో, నన్నో, లేక వేరెవరినో మళ్ళీ ఒకసారి చూసుకోండి :))

నీకు వివాదాస్పద విషయాలని స్పృశించాలంటే భయమని!
ఇప్పటికైనా కాస్త బుర్రపెట్టి అలోచించు!___________________________________


బుర్ర పెట్టి ఆలోచించాల్సింది తమరే. మీరు వివాదం అనుకున్నది ప్రపంచంలో ప్రతీ ఒక్కడికీ వివాదం అనుఖోవడం తమరి మూర్ఖత్వమే.

Malakpet Rowdy said...

పైగా, వివాదం అనేది ఒకరితో ఒకరు ఏకీభవించనప్పుడు పుడుతుంది - Not when the things are agreed upon! ఈ బ్లాగులో (నేను చదివిన పోస్టుల్లో) అన్నిటితో కాకపోయినా చాలా విషయాలతో ఏకీభవించాను కాబట్టే ఆయా పోస్టుల్ని వ్యతిరేకించాల్సిన అవసరం రాలేదు.

మంచు said...

ఎకలవ్య గారు : వయస్సు మరీ 18 పెట్టేరేంటండి :-))))

Ekalavya said...

మిష్టర్ Malakpet Rowdy!

చంపేశారు! నా భాష చూసే గురువుగారితో సమంగా ట్రీట్ చేస్తున్నారన్నమాట!
కానీ మనం ఆయనతో సమానం అవ్వాలంటే ఇంకో యేడు జన్మలెత్తాలేమో!

నేను చిన్నప్పట్నించీ తెలుగులోనే యేడుస్తున్నాన్లే!

తెలుగువాళ్ళకి తెలుగు ఇంకొకళ్ళు నేర్పించక్కర్లేదంటా! బుర్రపెట్టి నేర్చుకోవాలంతే!

ఇక వివాదాల గురించి, 'చాలా విషయాలతో ఏకీభవించాను' అన్నారు—మరి ఏకీభవించినవాటిని తెలియచెపితే, ఆయనకి సపోర్టు ఇచ్చినట్టు కదా? అది చెయ్యడానికి యెందుకు భయం?

మంచుపల్లకీ!

ఆ భగవంతుడు పెట్టిన దానికి నేనేమి చెయ్యనండీ?

మంచు said...

ఊరుకొండి మరీను.. కామంట్లలొ ఉపయొగించిన బాషను బట్టి కొంత అంచనా వెయ్యచ్చు.. ఒకటి మీరు కంగారులొ మీ వయస్సు తప్పు పెట్టివుండవచ్చు ..
లేక నువ్వు నీ వయస్సుకు మించి మెచ్యురెడ్ అయ్యొండొచ్చు.. 18 సంవత్సరాలకె అంత మెచ్యురిటి అంటే తప్పకుండా మీ గురువుగారిని మించిపొయావ్.. . ఏడు జన్మలు ఆగక్కర్లెదు.. :-))

నాకన్న చిన్నొడివని ఏకవచనం లొ మట్లాడే పర్లేదు.. కదా :-)

Malakpet Rowdy said...

భాష ఒక్కటే కాదు - 'ఏ' బదులు 'యే' వాడకం కూడా :))

ఇక చెప్పడం సంగతి - నాలుగయిదు సార్లు కామెంట్లలోనే చెప్పినట్టున్నాను కదా వ్రాసింది బాగుంది అని!

A K Sastry said...

డియర్ Rakhee!

చాలా సంతోషం! మీ 'అంతరంగం' చూశాను! వీలువెంబడి అన్ని టపాలూ చదువుతాను!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ కెక్యూబ్ వర్మ!

చాలా సంతోషం! మీ 'అంతరంగం' చూశాను! వీలువెంబడి అన్ని టపాలూ చదువుతాను!

మీరు అనుసరిస్తున్న అంతరంగాలన్నీ నేను కూడా చూస్తూనే వున్నాను!

ధన్యవాదాలు!

Ekalavya said...

మిష్టర్ Malakpet Rowdy!

తెలుగులో యేడిచేవాడెవడైనా, వాక్యం మధ్యలో 'అచ్చుల్ని ' వాడరు! ఒక్క పత్రికలవాళ్ళు తప్ప. వీలైతే సంధులు వాడతారు, లేకపోతే యకారాలూ వగైరా వాడతారు—తమకు అదియునూ తెలియదు తమ బొంద! (ఇది మా గురువుగారు వాడిన మాట!)

ఇక ఆయన అన్నది 'యేకీభవించాను ', 'బాగున్నాయి ' అని స్పందించడం కాదు. ఆయన వ్రాసినదానికి—ముఖ్య విషయానికి—మద్దతుగా ఒక మాట అనడం, దాన్ని ఇతరులకు కూడా కన్వే చెయ్యడం!

ఉదాహరణకి, క్రింది టపాలో, జూనియర్ లెక్చరర్ల నియామకానికి పెట్టే పరీక్షలో ఇచ్చే అర్థంపర్థంలేని ప్రశ్నల్ని విమర్శించారు!

దానికి సపోర్టు చేస్తూ, 'అలాంటి ప్రశ్నల వల్ల ఉపయోగం లేదు ' అని యే ఒక్కరైనా వ్రాశారా?

ఆయన 'ఒసామా' బ్లాగులో, 'అభిషేకాలు ' శీర్షిక 'తో వ్రాసిన ముఖ్య విషయం—విగ్రహాలని మొత్తం నిర్మూలిస్తే బాగుంటుందని!

ఆ విషయాన్నెవరైనా సపోర్టు చేశారా?

మరెందుకీ వృధా స్పందనలు?

మంచుపల్లకీ!

నా మెచ్యూరిటీ గురించి అప్పుడే యేమి చూశావు!

రూట్స్ నవల ని యేకబిగిన చదివినా, అర్థం అయినంతవరకే చదువుకుంటూ పోయినా, నాకు 38 రోజులు పట్టింది పూర్తి చెయ్యడానికి.

అదండీ నా మెచ్యూరిటీ!

Malakpet Rowdy said...

అలాగా! మన తెలుగు బ్లాగుల్లో ఎంతమంది "ఏ" బదులు "యే" వాడతారో కాస్త చూపించండీ సారూ ....

అలాగే, విపరీతంగా "!" గుర్తులు కూడా మన బ్లాగుల్లో ఎంతమంది వాడతారోకూడా చూపిస్తారా :)) (ఏకలవ్య, కృష్ణశ్రీ తప్ప)

అలగే "డియర్" అని తెలుగులో వ్రాసి, ఆ తరవాత ఐడీని యధాతధంగా వ్రాసేవాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో :))

ప్రతీ చాటర్/బ్లాగరికీ కొన్ని రోజుల్లో ఒక శైలి అలవాటవుతుంది, దానిని మానుకోవడం అంత సులభం కాదు.

అచ్చులు సాధారణంగా రానిది ఒక వాక్యం మధ్యలో కాదు - ఒక పదం మధ్యలో :))

ఇవి మీరు వ్రాసిన వాక్యాలే:

(1) "ఇక ఆయన అన్నది 'యేకీభవించాను ', 'బాగున్నాయి ' అని స్పందించడం కాదు"

(2) "ఉదాహరణకి, క్రింది టపాలో, జూనియర్ లెక్చరర్ల నియామకానికి పెట్టే పరీక్షలో ఇచ్చే అర్థంపర్థంలేని ప్రశ్నల్ని విమర్శించారు"

మధ్య మధ్యలో ఎన్ని అచ్చుల్ని వాడారో చూసుకోండి :))

తమరు చేస్తోంది అచ్చుల బదులు హల్లులు వాడడం కాదు .. ఒక్క "ఏ" బదులు "యే" వాడడమే :))


నా తెలుగే దరిద్రమనుకున్నా ... నాకన్నా దరిద్రపుగొట్టు తెలుగు తమది :))

అబద్ధాలాడడానికైనా కొంత తెలివుండాలి :))

Malakpet Rowdy said...

I am not sure whether I read the posts you have mentioned. - I dont read all the posts from all the blogs and its quite possible that I missed some or many posts.

.. and yeah .. I am not the Publicity Manager for this blog and I reserve the right to tell or not to tell others about what I read in this blog.