Friday, May 14, 2010

'.....క్షమించని

కులాల ప్రసక్తి'

రెండు రంగాలు (సీన్లు) వ్రాస్తాను. చదివి, జవాబు చెప్పండి.

మొదటి రంగం :

ఓ హైవే--అక్కణ్ణించి ఇంకో దారి చీలుతుంది. అక్కడికి ఆ వూరు బస్ స్టాండ్ కొంచెం దూరం. యెటు వెళ్ళే బస్సులైనా, ఆ సెంటర్ లో ఆగుతాయి. ఆ సెంటర్ లో ఓ హోటెల్. స్లాబ్ బిల్డింగులో నీట్ గా వుంటుంది. టిఫిన్లు కూడా చాలా బాగుంటాయి. ఓ పక్కా, మధ్యనీ నాలుగేసి కుర్చీలు వుండే టేబుళ్ళు. ఇంకో పక్క, ఆరు కుర్చీలు వుండే టేబుళ్ళు. ఉదయం 6 నించీ, 11 దాకా యే టేబులూ ఖాళీ వుండదు.

ఆ సెంటర్ లోనే అనేక పాక హోటళ్ళు వున్నాయి--వాటిలోనూ ఖాళీ వుండదు ఆ సమయం లో.

ఆ వూళ్ళో ముందు రోజు రాత్రి ఓ శుభకార్యానికి వచ్చాడొకాయన. తెల్ల ఫేంటూ, తెల్ల షర్టూ టక్ చేసుకొని, చలవ కళ్ళజోడు పెట్టుకొని, టిప్ టాప్ గా వున్నాడు. తన ఆఫీసుకి ఆలస్యం అయిపోతుందేమో అని, టిఫిన్ చెయ్యకుండా బయల్దేరి వచ్చేశాడు. 

ఈ హోటల్లో నలుగురు కూర్చొనే టేబులు దగ్గర, యెడం వైపు కుర్చీలో కూర్చున్నాడు. కుడివైపు కుర్చీ గోడ దగ్గరగా వుంది. అది ఖాళీ. టిఫిన్ ఆర్డరు ఇచ్చాడు. సర్వర్ తేగానే, శుభ్రం గా చేతులు కడుక్కుని, తినడం ప్రారంభించాడు.

హోటెల్ యెదురుగా ఓ లారీ ఆగింది. అందులోని క్లీనర్, పాపం ఆకలితో నకనకలాడుతున్నాడు. డ్రైవర్ ని బతిమాలి, ఓ ఐదు నిమిషాల్లో వచ్చేస్తానన్నా అని, క్రిందికి దిగాడు. 

అతని వాలకం మామూలే--చొక్కా అంతా ఆయిల్ మరకలూ, చేతుల్నిండా నల్లగా గ్రీజు మరకలూ!

హోటల్లోకి వచ్చేసరికి, మన నీటుగాడి ప్రక్కన గోడదగ్గర వున్న సీటొక్కటే ఖాళీ వుంది!

సంశయిస్తూనే, 'కొంచెం జరుగుతారా?' అన్నాడు. నీటుగాడు విననట్టే నటిస్తూ, టిఫిన్ లాగించేస్తున్నాడు. 

ఇతను, అటుగా వస్తున్న సర్వర్ని దీనం గా వేడుకొన్నట్ట్లు చూశాడు. ఆ సర్వర్, 'కొంచెం జరగండి సార్!' అన్నాడు. 

జరగకపోగా, అయిష్టంగానే లేచి, గోడదగ్గర సీటుకి ఇతనికి దారిచ్చి, మళ్ళీ తన కుర్చీలో బాగా యెడం వైపు జరిగి తన టిఫిన్ 'మమ ' అనిపించి, సర్వర్ తో 'కాఫీ కేన్సిల్ ' అని చెప్పేసి, బయటికి వచ్చేశాడు బిల్లు చెల్లించి!

ఇక్కడ అసలు విషయం యేమిటంటే, ఆ నీటుగాడు ఓ దళితుడు. క్లీనర్ ఓ అగ్ర వర్ణం వాడు!

మరి యెందుకలగ?

ఇంకో రంగం మరోసారి.

6 comments:

మంచు - పల్లకీ said...

మీరు చెప్పేదంతా అబద్దం.. "" ఆ నీటుగాడు ఓ దళితుడు. క్లీనర్ ఓ అగ్ర వర్ణం వాడు "" అగ్రకుల దురహంకారులు వున్నతకాలం ఇలా ఎప్పటికీ జరగదు.. ఒకవెళ అలావున్నా... ఆ నీటుగాడు.. ఆ క్లీనర్ ని నెత్తిమీద పెట్టుకుంటాడు..
ఇట్లు
- ఎదోఒకవాది

Sitar said...

ఇది జరిగే అవకాశం ఉంది.
నా అనుభవం ఒకటి చెప్తాను...
నేను ఒక చిన్న రైతు కొడుకుని. నాకు ఒక నిమ్న కులానికి చెందిన ఒక క్లాస్మేట్ ఉన్నాడు.అతని తండ్రి ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్. ఆయన టీ టీ డీ కార్య నిర్వహణాధికారి గా కూడా చాలా కాలం పని చేశారు. నా డిగ్రీ ఐ పోయిన తరువాత,అతను మా బాబాయి గారి అబ్బాయి పెళ్ళి లో కనపడ్డాడు. పెళ్ళి కూతురు వాళ్ళ తరపునుంచీ స్నేహం వలన పెళ్ళి కి వచ్చానని చెప్పాడు.
నేను అతనిని "మనమిద్దరం వధూ వరులిద్దరి తో కలిసి ఒక ఫొటో దిగుదామా..?" అని అడిగాను.
దానికి అతని సమాధానం, "అంత సీన్ లేదు"....???

Anonymous said...

ఓస్ ఇంతేనా.జే ఎన్ టీ యూ కాకినాడ లో కొన్ని దశాబ్దల నుంచే అగ్రకులాల స్టూడెంట్స్ ని కాలేజ్ హాస్టళ్ళలోంచీ వెళ్ళగొట్టి, వాళ్ళ పై రాగింగ్ టైం నుంచీ నా నా వెధవ పనులూ చేయించి వివక్ష చూపుతారు. చూపించేవారు ఎవరంటారా? ఇంకెవరూ సొకాల్డ్ అణగదొక్కబడిన కులాల స్టూడెంట్స్. అగ్రకుల ప్రొఫెసర్స్ స్కూటర్స్ సీట్లు కోయటం సాధారణం అక్కడ. ఇలాంటి విషయాలు రాష్ట్ర వ్యాప్తం గా చాలా కాలేజీ లలో మామూలు గానే జరుగుతుంటాయి..ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయిలే...టైం సరిపోదు...

మంచు - పల్లకీ said...

ఇంకోరంగం కూడా చూసాకే కామేంటెచ్చు అనుకున్నా... కానీ నాలొని ఎదోఒకవాది ..ఎదొదాన్ని ఖండిచకపొతే తోచదు.. రెండొ రంగం కూడా అయిపొయాకా నా అసలు అభిప్రాయం చెబుతా :-))

Anonymous said...

క్రిష్ణశ్రీ గారూ,
దీనికి సమాధానం నా దగ్గరుంది. కానీ, ఈ టపా మీరు ఆ సమాధానం కోసమే రాశారని తెలుసుస్తోంది, అంతే కాదు మీరు మరో రంగములో ఆ పాయింటునే ఉపయోగించి ఒకదాన్ని సమర్ధించుకో చూస్తున్నారని నాకని పిస్తోంది . సరే రాయండి.

మీ మరో రంగముకోసం ఎదురుచూస్తున్నాను, ఒక వేల ఆ రంగము నేను ఊహించింది కాకపోతే, నేను ఊహించిందేమిటో మీతో చెప్పి, తప్పుగా ఊహించినదుకు, మిమ్మల్ని అపార్థము చేసుకున్నదుకూ క్షమాపణ కూడా చెబుతాను. నిజమే అయితే నా వాదన వినిపిస్తాను.

కృష్ణశ్రీ said...

డియర్ మంచు - పల్లకీ! Sitar! andhrudu!అకాశరామన్న!

ఓపిగ్గ చదివి, అభిప్రాయాలు వ్రాసినందుకు చలా సంతోషం.

ధన్యవాదలు.