Thursday, April 29, 2010

.....క్షమించని

కులాల ప్రసక్తి

రాజుల కాలం లో, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో యుధ్ధాలు చేసేవారు. దానికోసం సైన్యాన్ని తర్ఫీదు ఇచ్చి, బలాన్నీ, ఆయుధాలనీ పెంచుకొనేవారు. 

యుధ్ధాల్లో దళాలకి అధిపతుల్ని నియమించేవారు--వారికి నాయుడు, రాయుడు, లాంటి పదవులిచ్చేవారు. రాజు క్షత్రియుడైతే, సాధారణం గా క్షత్రియులే సైన్యాధిపతిగా నియమింపబడేవారు. రాజు రెడ్డి అయితే, రెడ్డినే సైన్యాధిపతిని చేసేవారు. 

దళాధిపతులు చూపించిన పౌరుషాన్ని మెచ్చుకొని, వారికి కొంత భూమిని ఇచ్చేవాడు రాజు. ఆ భూముల్లో వ్యవసాయం చేయించుకొంటూ, కోటకి కూడా 'కాపు' గా వుండేవారు. వీళ్ళే ప్రాంతాలని బట్టి, కాపు కులం, వెలమ కులం--ఇలా యేర్పడ్డారు. ఇలాంటి వంశాలవాళ్ళే--వీరమాచనేని (వీరమాచయనాయని), ఘట్టమనేని, త్రిపురనేని, పర్వతనేని, రాయని, సర్వారాయని--ఇలాంటి ఇంటిపేర్లు వున్నవాళ్ళు. (వీళ్ళలో ప్రస్తుతం కొన్ని ఇంటిపేర్లవారు 'కమ్మ' లేదా 'చౌదరి' కులం గా వ్యవహరించబడుతున్నారు.)

ఇతరకులాలలోని వాళ్ళు, కొంత సంపాదించుకొని, స్వయం గా భూవసతిని యేర్పాటు చేసుకొని, ముఖ్య వృత్తి వ్యవసాయం, పాడి గా గలవాళ్ళు 'కమ్మ' కులం గా యేర్పడ్డారు. ఉత్తరభారతం లోని 'చౌధురీ' ల నించి 'చౌదరి' నామాన్ని స్వీకరించారు. వీళ్ళ ముఖ్య లక్షణం యేమిటంటే, బంజరు భూముల్ని కూడా తమ శ్రమ శక్తి తో బంగారు పండే భూములుగా మార్చడం! పాడి ని వృధ్ధి చేసుకోవడం. (ఈ కులం వాళ్ళు లేకపోతే, ఆంధ్ర ప్రదేశ్ లో యే ప్రాంతం లోనూ వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో వుండేదికాదు అంటే అతిశయోక్తి కాదు!)

(మా మేష్టారు తన తిట్టులో వుపయోగించిన 'దొమ్మరి, దూదేకుల, కమ్మరి, కుమ్మరి, మేదరి, మాల, మాదిగ, సాలి, కంసాలి, యెట్టి, యానాది, ఈడిగ, పాకీ' ఇలా సమస్థ కులాలవాళ్ళూ సైన్యం లో వుండి, వాళ్ళ వాళ్ళ వృత్తులు చెయ్యకపోతే, ఆ సైన్యాలు అంతంత సంఖ్యల్లో మనుగడ సాగించగలిగేవా?)

యుధ్ధాలు లేని శాంతి సమయం లో ఈ కులాలవాళ్ళందరికీ తగ్గ వుపాధి--ఆయుధాలు తయారు చెయ్యడమో, రాళ్ళూ వగైరా మోయించి గుళ్ళు కట్టించడమో, కళలని అభివృధ్ధి చెయ్యడమో--ఇలాంటివి చేసి, వాళ్ళకి వుపాధికి లోటులేకుండా చూసుకునేవారు.

సాహిత్యాన్నీ, ఇతర కళలనీ పోషించి, వాళ్ళకి కూడా అగ్రహారాలు ఇచ్చేవారు.

--మిగతా మరోసారి

2 comments:

హరి దోర్నాల said...

రాజు, రేడు, రెడ్డి, రాయడు, నాయకుడు, నాయుడు అనే పదాలకు సారూప్యత ఉంది. కాపులకు మీరు చెప్పిన అర్థం సరిపోయింది. బహుశ వెలనాటి నుండి వెలమ వచ్చిందనుకుంటాను. కమ్మ పదం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. తెలిస్తే సెలవిస్తారా?

కృష్ణశ్రీ said...

డియర్ హరి దోర్నాల!

మీ ఆసక్తి కి చాలా సంతోషం.

నాకు తెలిసినంత వరకు, ఓ శతాబ్దం క్రితం 'గమళ్ళ' అనే కులం వుండేది. వాళ్ళ ప్రధాన వృత్తి--తాటి చెట్ల నించి కల్లు గీయడం.

దానికి సాధనం గా, తోలుతో పటకాలని తోలు దారాలతోనే కుట్టడం లో నైపుణ్యం సంపాదించారు.

దాంతో దర్జీ వృత్తి లాంటివి కూడా చేసేవారు(ట).

ఈ కులం వాళ్ళే, క్రమేణా గౌండ్ల, గౌండ, గౌడ, గౌండరు--ఇలా మారారు.

ఇంకా వ్యవసాయ పనులు కూడా శ్రధ్ధగా చేసి, భూములు సంపాదించడం మొదలుపెట్టారు. (వ్యవసాయం అంటే, పాడి కూడా).

తరవాత్తరవాత, ఇంకొన్ని కులాలు (గొల్లలూ మొదలైన వాళ్ళు) కూడా ఈ కులం లో కలిసిపోయి, కమ్మ కులం యేర్పడింది.

(గొర్రెల, గొర్ల, మేకల, మేకా మొదలైన ఇంటిపేర్లు దీనినే సూచిస్తాయి).

(ఇప్పుడు 'ముదిరాజ్' అనే కులాన్ని వివిధ కులాల కలయిక గా భావిస్తారు!)

కొంతమంది అభిప్రాయం ప్రకారం, గుండ్లకమ్మ వాగు క్రింద వ్యవసాయం చేసేవాళ్ళు కమ్మవాళ్ళయ్యారని కూడా వుంది.

(క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ కులం వాళ్ళు యెక్కువగా వుండడం దీనికి బలం చేకూరుస్తుందని భావన.)

ఇంకా కొన్ని వాదాలు వున్నాయిగానీ, ఇవే
ముఖ్యమైనవి.

ధన్యవాదాలు.