కులాల ప్రసక్తి'
రెండో రంగం :
మెట్లెక్కి బ్యాంకులోకి వస్తున్నాడో రైతు--దాదాపు 50 యేళ్ళు వుంటాయి, అడ్డపంచి పైకి మడిచి కట్టి, తలకి గుడ్డ చుట్టి, తెల్లచొక్కామీద బురద మరకలతో!
బ్యాంకు జవాను--'దించు! దించయ్యా పంచెని!' అన్నాడు. కంగారుగా పంచెని దించేశాడు రైతు. 'తలగుడ్డ తియ్యి! బ్యాంకులోకి వచ్చినా మర్యాద తెలియదు!' అనగానే, తలగుడ్డ తీసి చంకలో ఇరికించాడు ఆ రైతు.
ఫీల్డాఫీసరు యెదురుగా నించొని, 'సార్! మా పంట ఋణాలు చెల్లించేసి పదిహేనురోజులు పైన అయ్యింది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. దుక్కి దున్ని సిధ్ధం చేశాము. విత్తనాలకి డబ్బు కావాలి. ఇన్నాళ్ళూ కొత్త మేనేజరు రావాలని ఋణాలు ఇవ్వలేదు. ఇప్పుడైనా........' అంటూంటే--
ఫీల్డాఫీసరు, 'ఇవాళ సోమవారం! ఇవాళెవరు రమ్మన్నారు నిన్ను?' అన్నాడు.
'కొత్త మేనేజరు సోమవారం వస్తాడంటే......'
'అవునయ్యా! అన్నాడు. కానీ ఈ ముష్టి వూరుకి యెవరు వస్తారు? జోనల్ ఆఫీసు లో రిపోర్టు చేసి, అక్కణ్ణించే ఇంకోవూరుకి మార్పించుకొని వెళ్ళిపోయాడు ఆయన! మళ్ళీ ఇంకొకర్ని వెయ్యాలి, ఆయన రావాలి.......చూద్దాం.....మళ్ళీ వచ్చే మంగళవారం రండి.' అనేశాడు.
(నేను ఆ బ్రాంచిలో చేరి రెండురోజులే అయ్యింది. తరవాత తెలిసింది ఆ రైతు ఓ 50 యెకరాలకి ఆసామీ అని! ఆ జిల్లాలో 50 యెకరాలంటే, కృష్ణా గోదావరి జిల్లాల్లో 5 యెకరాలకి సమానం! అయినా, పెద్ద రైతే కదా? వాళ్ళ వూరు బ్యాంకు వున్న వూరు నించి ఓ 15 కిలోలు వుంటుందిట. ఆ రోజు ఆయన ఇంకెవరిదో మోటార్ సైకిల్ మీద లిఫ్ట్ అడిగి, బ్యాంకుకి వస్తూంటే, ఓ లారీ వీళ్ళమీద రోడ్డు గుంటల్లో వున్న బురద వర్షపునీరు చిమ్మేసి, వెళ్ళిపోయిందట!)
మరో పదిహేనురోజులకి కూడా కొత్త మేనేజరు రాలేదు. రైతులు వాళ్ళ పాట్లు వాళ్ళు పడ్డారు.
ఈ రంగం లో బ్యాంకు జవానూ, ఫీల్డాఫీసరూ ఇద్దరూ దళితులు. ఆ రైతు అగ్రవర్ణం వాడు.
మరెందుకలగ?
--మిగతా మరోసారి
4 comments:
రోజూ చూస్తున్నా, అందరకూ తెలిసినప్పటికీ, ఎవ్వరూ సృజించని కోణాన్ని సృజిస్తున్నారు, Pls. keep going.
డియర్ Krishna!
యెవరైనా తిట్టడం మొదలెట్టారా లేదా అనుకుంటూ కామెంట్స్ చూసే నాకు అప్పుడప్పుడూ మీ లాంటివారి వ్యాఖ్యలు కొత్త ఉత్తేజాన్నిస్తాయి.
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
కృష్ణశ్రీ గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Very good point, ippudu kulam kadu dabbu, vesham(konni sarlu) chusi viluva istunnaru.
Post a Comment