ఆహ్లాదం
ఆ మధ్య, రాష్ట్రం లో ప్రతిరోజూ తిరిగే 20 వేల బస్సుల్లో, "ఎల్సీడీ" టీవీలు పెట్టేసి, రోజంతా వినోద కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఆర్టీసీ వారు నిర్ణయించారన్నారు.
ఇంతకు ముందు, వొల్వో, సూపర్ లగ్జరీ బస్సుల్లో మామూలు టీవీలని పెట్టి, మళ్లీ అవతల పారేశారట.
ఇంకా అంతకు ముందు, టీవీలూ, వీసీఆర్లూ కూడా అలాగే పారేశారు.
ఇప్పుడు, ఓ ప్రైవేటు సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి, ఆ సంస్థే తిరిగి ఆర్టీసీకి ప్రతీ బస్సుకీ, నెలకీ 225 రూపాయలు చెల్లిస్తుందట! యెంతబాగుందో పథకం! ప్రజావినోదం, ప్రభుత్వాదాయం!
కొసమెరుపేమిటంటే, పల్లెవెలుగు బస్సుల్లో, పల్లె ప్రజలకు అనుగుణమైన (పాడి పెంటలు, పెంట చీమలు, పశువూ-పేడా, పందుల పెంపకం లాంటివేమో మరి) కార్యక్రమాల్నే ప్రసారం చేస్తారట!
ఆర్టీసీ లాభల బాటలో నడచుగాక!
మొన్న (22-09-2010) మా జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు యెందుకో ఊపొచ్చి, ఓ ప్రకటన విదుదల చేశాడు.
జడ్పీ కార్యాలయం లో మహాత్మా గాంధీ, బీ ఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సర్ ఆర్థర్ కాటన్, ఆల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మదర్ థెరిస్సా, వై యెస్ రాజశేఖర్రెడ్డి వంటి నాయకుల నిలువెత్తు విగ్రహాలని నెలకొల్పుతారట.
ఇలాంటి మహనీయుల వర్థంతి, జయంతి కార్యక్రమాలని కార్యాలయం లోనే నిర్వహిస్తారట.
ఆ కార్యాలయ ప్రాంగణాన్ని వై యెస్ రాజశేఖర్రెడ్డి పార్కుగా అభివృధ్ధిపరచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తారట. (మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటెయిన్ల సంగతెందుకు మరచిపోయారో--యెక్కడా చూడలేదో, యెవరూ చెప్పలేదో మరి)
పార్కింగ్ కి కూడా ప్రత్యేక స్థలం కేటాయిస్తారట.
ఇన్ని చెప్పినాయన, వీటికి నిధులెవరిస్తారన్నది చెప్పలేదు. (అయినా--తనది కాదు కాబట్టి, ప్రజలందరూ తాటి పట్టిలమీద యెదురు దేక్కుంటూ కాశీదాకా పొమ్మంటాడు--వాడిదేం పోయిందీ?)
అసలు ఇలాంటి ప్రకటన ఇప్పుడెందుకు చేశాడు? అని కొంతమంది ముక్కుమీద వేళ్లు కూడా వేసుకుంటున్నారు!
2 comments:
ఒక్కొక్కటీ ౧౦ వేలనుకున్నా, ౨౦ కోట్లు! అయినా బస్సుల్లో టీవీలు నిద్ర చెడగొట్టడానికే!
డియర్ JB - జేబి!
ఆ కోట్లే కాకుండా, బస్సుకీ నెలకీ 225 రూపాయలిస్తామంటున్నరంటే, వాళ్ల సంపాదన యెంతవుంటుందో--అందులో ముడుపులెన్నో?
ధన్యవాదాలు.
Post a Comment