Friday, October 8, 2010

కుహనా......

......సామరస్యం


హమ్మయ్య! అయోధ్య గురించి తీర్పొచ్చేసింది--60 యేళ్లో యెంతో నానిన తరవాత--అదీ సర్వ జన సమ్మతం గా--అని కొంతమంది సంతోషించేశారు.

"ఇదేదో రొచ్చు గుంట లా వుంది--రండ్రా చేపలు పట్టేద్దాం" అంటూ తయారైపోతున్నారు కొంతమంది సెక్యులరిస్టులు--తమ సోదరులమీద ప్రేమ కారి పోతూ!

ఇక, ప్రముఖ సామరస్య వాదులు తమ కలాలని దులిపి, వ్యాసాలు వ్రాసేస్తున్నారు. కొంతమంది సిండికేటెడ్/ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తమ అమూల్యాభిప్రాయాలనీ, రాబోయే వందేళ్లలో యెవరు యెలా ప్రవర్తించాలో సలహాలనీ గుప్పించేస్తున్నారు.

వుదాహరణకి ఓ వ్యాసం లో--

"అయోధ్య కోసం 60 యేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న మహంత్ భాస్కర దాస్, హషీం అన్సారీ ఆప్త మిత్రులు. భిన్న వాదనలు వినిపించడానికి ఒకే వాహనం లో న్యాయస్థానానికి వచ్చేవారు.
(వాళ్లిద్దరూ జంటిల్మెన్ కాబట్టి!......వాళ్లూ కొట్టుకు చచ్చి వుంటే వీళ్లకి మరో రకం వ్రాతలకి ఆస్కారం వుండేది మరి)

ఆయోధ్య లోని అన్ని ఆలయలకీ దేవతా విగ్రహాల అలంకరణకి పూల హారాలూ, భక్తులు సమర్పించే పూల మాలలూ తయారు చేసేది అష్రాఫీ భవన్ ప్రాంతం లో నివసించే 15 ముస్లిం కుటుంబాల వారే. హ్రస్వ దృష్టి వున్నవారికి అది కేవలం జీవనోపాధిగానే కనిపించవచ్చు కానీ......(ట).

రెండు దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిత్ లు పారిపోవడం వల్ల అనేక ఆలయాలు ఆలనా, పాలనా లేనివయ్యాయి. కానీ పహల్గాం లో 900 యేళ్ల నాటి శివాలయానికి....ముస్లిములే పూజారులై.....పండిత్ లు తిరిగి వచ్చి ఆలయ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్న.....(ట).

పంజాబులో....కేరళలో....కర్ణాటకలో....అనేక మసీదుల్ని హిందువులే పునర్నిర్మించారు (ట).


అబ్దుల్ వాహిద్ అనే ఆయన వారసత్వం గా వచ్చిన వృత్తివ్యాపకం "రామ్ లీలా" లో పాల్గొనే రామ, లక్ష్మణ, సీత, రావణ, హనుమ పాత్రధారులకి ఆహార్యాలు రూపొందించడమే. అతని ముగ్గురు కుమారులూ అదే పనిలో వుంటారు. ఆయన అసలు పేరు మరుగున పడి, ఇప్పుడు "రాం సింగ్ డ్రెస్ వాలా" అంటున్నారు (ట).


రిటైర్డ్ ఇంజనీరు సికిందర్ వార్సీ, తన మిత్రుడు మెకానిక్ మొహమ్మద్ ఇస్లాం లు "రామాయణాన్ని" మృదుమధురం గా గానం చేస్తున్నారు (ట) గత రెండు దశాబ్దాలుగా, యెవరు పిలిచినా.

వారణాసి లో "నజ్ నీన్" రామ చరిత మానస్ ని ఉర్దూలోకి చకచకా అనువదిస్తోంది. ఇప్పటికి సుందరకాండ ముగిసింది, మరో నెలన్నరలో పూర్తవుతుంది (ట)."

(అన్నట్టు--తులసీదాసు యెప్పుడూ "అయోధ్య రామాలయం" గురించి వ్రాయలేదు/పాడలేదు అంటూ అప్పటికి ఆ ఆలయమే లేదు అంటున్నారు జన విఙ్ఞాన వేదిక వారు--ఆయన గ్రుడ్డివాడని మరిచి పోతున్నారు!)

ఇంకా అనేక వుత్సవాల్లో, పూజల్లో, అనేక రాష్ ట్రాల్లో--దేశవ్యాప్తం గా "సామరస్యం" వెల్లి విరుస్తోంది (ట).

బాగానే వుంది. 

వీళ్లందరితో యెవరికైనా, యెప్పుడైనా, యెందుకైనా తగవు వచ్చిందా?

వస్తున్నది మహమ్మదీయుల్లో, అదీ సున్నీల్లో, "కొంతమంది" కడివెడి పాలల్లో విషం చుక్క జల్లే--మూర్ఖుల వల్లనేకదా?

ఆమాత్రానికి "వోవరాక్షన్"లు యెందుకు?

ఇలాంటి వాడే చిదంబరం--అయోధ్య తీర్పు మీద వ్యాఖ్యానించిన వెంటనే, మసీదు కూల్చివేత గురించి విలేఖర్లు అడిగితే, మాయా బజారు సినిమాలో సూర్యకాంతం లెవెల్లో సోనియా 'అలా చెప్పరాబాబూ! అమ్మ మెచ్చుకొంటుంది 'అన్నట్టు వెలిగి--"అది ఖచ్చితం గా నేరమే......." అని, మళ్లీ యెందుకైనా మంచిదని, "నా దృష్టిలో" అని ముక్తాయించాడు!

3 comments:

A K Sastry said...

బాబూ! ఈ కామెంట్ కి Anonymous అవసరమా!

Anonymous said...

అదేంటి సార్.. కనీసం బూతులు తిట్టలేనివాడివి అజ్ఞాత ఎలా అయ్యావోయ్ అని ఆ అజ్ఞాతను దెప్పుతున్నారా? :))
కలికాలం..

A K Sastry said...

డియర్ snkr!

అవును. కలికాలమే! బ్లాగుల్లో అఙ్ఞాతలంటే, బూతులు తిట్టే/ట్టుకొనే వాళ్లు అని రూఢీ అయిపోయిందన్నమాట! ఖర్మ.

అఙ్ఞాతలెక్కడ అవసరమో ఇదివరకే నా "కృష్ణశ్రీ" బ్లాగులో వ్రాశాను. వీలైతే చదవండి.

ధన్యవాదాలు.