Friday, March 18, 2011

సిగ్గులేని సోనియా'నికమ్మా' ప్రథాని

చాలా విషయాల్లో చూస్తున్నాముకదా—భారతీయులకి యేదైనా “అప్రాచ్యుడు” చెపితేనే నిజమని నమ్ముతారు!

అప్పుడు, గత లోక్ సభలో విశ్వాస తీర్మానం సందర్భంగా డబ్బు మూటలు చేతులు మారాయని మన మీడియా వీడియోలతో నిరూపించినా, ఆదికేశవులు నాయుడు, మంద జగన్నాథం లాంటివాళ్లు యెదురుగుండా కనిపిస్తున్నా, మళ్లీ యూపీయేకే పట్టం కట్టారు.

ఇప్పుడేమో, వికీలీక్స్ అనే అప్రాచ్యుడు చెపితే—అదుగో చూశారా—అదే నిజం అంటున్నారు.

పైగా, అధికారాంధులు అతి తెలివిగా, పాత లోక్ సభలో జరిగినవాటికి కొత్త లోక్ సభ “జవాబుదారీ కాదు” అనీ, “అది మరిచిపోయిన” వ్యవహారం అనీ, కిశోర్ చంద్ర దేవ్ కమిటీ “ఇంకా దర్యాప్తు జరగాలని” చెప్పినా, ఆ రిపోర్టు తో ఆ వ్యవహారం ముగిసింది అనీ, దానిమీద “ఏక్షన్” కూడా తీసుకొని, ముగ్గురి మీద “అవినీతి నిరోధక” కేసులు పెట్టేసి, చేతులు దులుపుకున్నామనీ, డబాయిస్తున్నారు!

(అసలు ఆ వెధవలని పోలీసు కస్టడీ కి ఇచ్చి వాళ్లు “తమ పధ్ధతిలో” వాళ్లని ప్రశ్నించి వుంటే, వాళ్లు “యెవరి తరఫున” డబ్బులు ఇచ్చారో బయటపడి వుండేది కాదా? అప్పుడు “వాళ్ళ మీద” పెట్టవలసిన కేసులు పెడితే సరిపోనుకదా? బాస్ ఆఙ్ఞ ప్రకారం హత్యలూ, దోపిడీలూ వాడి అనుచరులు చేసినా, బాస్ దే కదా నేరం?)

తరవాత జరిగిన యెన్నికల్లో తమ కూటమికి యెక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి, ఆ అరోపణలని జనం యెవరూ నమ్మలేదని నిరూపితం అయిపోయిందట! జనం నమ్మినా, నమ్మకపోయినా నేరం నేరమే! అవున కాదా?

మన "నికమ్మా" అయితే, “అశ్వథ్థామ హతః” లెవెల్లో, “నేను యెవరినీ కొనలేదు, యెవరినీ కొనమని చెప్పలేదు, నాకు డబ్బుల వ్యవహారం తో సంబంధం లేదు” అని ఘోషిస్తున్నాడు—ఢంకా బజాయించి మరీ!

అవినీతి “బురద” అయితే, ఈ లోక్ సభలూ, ప్రథానీ వగైరాలూ, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ—అంతెంతుకు—ప్రతీ రాజకీయ నాయకుడూ, ప్రభుత్వాధికారీ—అందరూ "తామరాకులే" అని నమ్మెయ్యాలి జనం! గాలీ వానా ఒకేసారి వస్తే అసలు కథే వుండదుకదా!

యెంత బాగుందో మన ప్రజాస్వామ్యం!

జనం చెప్పులు తీసి యెప్పుడు చేతులతో పట్టుకుంటారో—వోట్లు అడగడానికి వస్తే “మచ్చపడ్డ” వెధవలకి యెలాంటి సత్కారాలు చేస్తారోనని—వేచి చూస్తున్నాను.

కొసమెరుపు : టేంక్ బండ్ నాశనమైనా, పార్లమెంటు దద్దరిల్లుతున్నా, ఇప్పుడు "సెజ్ లు రద్దు చెయ్యడానికి నిబంధనలు అడ్డు వస్తాయా?" అని ఆలోచిస్తున్నాడట మన ముఖ్యమంత్రి! (జగన్ మీద పిడకలవేటలో ప్రసిధ్ధుడు కదా మరి!)

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

udaya said...

antaa baagundi kaanee stree sambandha vishayaallo parusha padajaalam baaguntundaa ?

Anonymous said...

Manmohan Singh Epitomizes Evil
http://www.deeshaa.org/2011/03/16/manmohan-singh-epitomizes-evil/

Sonia Gandhi Exposed
http://www.youtube.com/watch?v=84fkL6yB1X8&feature=related

http://www.youtube.com/watch?v=WYwQkhWMXIQ&feature=related

Anonymous said...

Jawaharlal Nehru Exposed - I

http://www.youtube.com/watch?v=x6WSRZvOuZ4&feature=related

Jawaharlal Nehru Exposed - II

http://www.youtube.com/watch?v=FmwhMY2iqtQ&feature=related

కృష్ణశ్రీ said...

డియర్ udaya!

“స్త్రీ సంబంధ”, “పురుష పదజాలం”—నాకర్థం కాలేదు.

కాస్త వివరిస్తే బాగుండేది.

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

పై ఇద్దరు అన్నోన్లూ!

లింకులు ఇచ్చినందుకు సంతోషం—కొంతమందైనా అవి చదువుతారు/వింటారు అని ఆశిద్దాం.

నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కావు—యెప్పుడో మన ప్రింట్ మీడియాలో వివరంగా ప్రచురించబడ్డవే!

మన దురదృష్టమేమిటంటే—మన సోకాల్డ్ “యెడ్యుకేటెడ్” కూడా పేపర్లు “చదవరు”—“తిరగేస్తారంతే”. ఒకవేళ చదివినా, “వ్యాసాలు” చదవరు. ఒకవేళ చదివినా—తెలిసిందేగా—వాళ్ల ఙ్ఞాపక శక్తి చాలా తక్కువ!

దాంతో, మిడిమిడి ఙ్ఞానులూ, మూర్ఖులూ రెచ్చిపోతూంటారు.

చూద్దాం—ఇంకెన్నాళ్లో!