Tuesday, June 14, 2011

ఓ రకం పిచ్చోళ్లు


కళా "కారులు"



మా "బ్లూ మౌంటేన్" రాజుని అనేవాళ్లం...."కళాకారులండీమీరు" అని! (ఆయన వ్రాసింది యేదైనా, ఓ ఐదు నిమిషాల తరవాత ఆయనకే చూపిస్తే, "నేనే వ్రాశానా? యేమో....యేమి వ్రాశానో గుర్తు లేదు!" అనేవాడు.

కొపెర్నికస్, గెలీలియో, సోక్రటిస్ లాంటి మేధావులని "పిచ్చోళ్లు" అన్నారట ఆ రోజుల్లో! అని వూరుకోలేదు--శిక్షలు విధించారు(ట).

ఇంతకీ, లలిత కళల్లో ప్రముఖమైనవి నాట్యం, కవిత్వం, తరవాత చిత్రలేఖనం. కొత్తగా కవిత్వం చదివేవాడికి, యే కవిత చదివినా, "అద్భుతం!" అనిపిస్తుంది. కొంత వయసు వచ్చాక, ప్రముఖుల కవితలు చదివినా, "యేమిటో ఈ కవిత్వం!"....ఈమాత్రం నేను వ్రాయలేనా? అనిపిస్తుంది.

ఇక చిత్రలేఖనం! నిజంగా "అద్భుతమైన" కళ! సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు, కనిపించేదాన్ని యథాతథంగానూ, కనిపించనివాటిని వూహించి దానికో ఆకారం యేర్పరచి, అందరినీ "అవి" ఇలాగే వుంటాయి అని నమ్మించడం! అలా మనకి లభించినవే, ఛాయాగ్రహణం లేనిరోజుల్లో వుండే రాజులు, నవాబులు మొదలైనవాళ్ల "చిత్రాలు". అలాగే, రాజా రవివర్మ లాంటి వాళ్ల పుణ్యమా అని, మనం యెప్పుడూ చూడని మన దేవుళ్ల, దేవతల రూపాలూ, అకారాలూ, ఆహార్యాలూ మనకి లభించాయి! అదీ చిత్రలేఖనం అంటే!

ఇంక శతాబ్దాల క్రితం నుంచీ పాశ్చాత్య చిత్రకారులు ప్రపంచ ప్రసిధ్ధి చెందినవాళ్లున్నారు కొంతమంది. మైఖేల్ ఏంజిలో, లియొనార్డో డా వించీ, రెనాయిర్ లాంటివాళ్లు. ఇంక "పాబ్లో పికాసో" అని అసలు పిచ్చోడు ఒకడుండేవాడు. మొదట చెప్పినవాళ్ల "పెయింటింగులు" చూసి, వాటిలో--మన వేదాలూ, సంస్కృతం ల లాగ, యెవరికి తోచిన అర్థం వాళ్లు చెప్పడం, కనపడని విషయాలని కూడా వూహించడం, వాటిమీద రీసెర్చ్ చేసి డాక్టరేట్లు తెచ్చుకోవడం, "ఆర్ట్ క్రిటిక్స్" అనబడేవాళ్లు ఇలా చేస్తూ, వాటి "ధరలని" విపరీతంగా పెంచడం, డబ్బున్న పిచ్చోళ్లు వాటిని కొనుక్కోవడం.....అదో ప్రపంచ వ్యాప్త వెర్రి!

మొన్నీమధ్య డా వించీ "మొనాలిసా" మీద రీసెర్చ్ చేసి, ఆయన తన మగ నౌఖరుకి ఆడవేషం వేసి, ఆ బొమ్మ గీశాడు అని తేల్చారట! ఇంక, ఓ రచయిత, "డా వించీ కోడ్" అనే తన నవలలో, ఆయన పెయింటింగులకి అర్థం చెపుతూ, క్రిస్టియానిటీకి సంబంధించిన రహస్యాలనేవో బయటపెట్టేశాడు అని ఆ పుస్తకం బ్యాన్ చేశారు కొన్ని దేశాల్లో!

పికాసో గురించి చెప్పాలంటే, మా "బ్లూ మౌంటేన్" రాజు లాంటివాడే! వాడేమి గీశాడో వాడికే కాదు, ప్రపంచంలో యెవరికైనా అర్థం అయితే వొట్టు! పైగా దానికి మోడర్న్ ఆర్ట్ అని ఓ పేరు! అదో ప్రత్యేకమైన "స్కూల్" అట!

అదే స్కూల్ లో బయలుదేరాడట మన దేశం లో ఒకాయన--ఎం ఎఫ్ హుస్సేన్ అని! బుడుగు బొమ్మలు వేసి, క్రింద "ఫది యెగురే పఛ్ఛులు"; "చీకట్లో వెళుతున్న రైలు" ఇలా వాటి పేర్లు వ్రాసినట్టు, యేవో పిచ్చి బొమ్మలు గీకేసి, క్రింద పేర్లు వ్రాయడంతో వచ్చింది గొడవంతా! ఆయనకి ఆడ పిచ్చి అనికూడా అంటారు ఆయన చిత్రాలు చూసినవాళ్లు. సరే! మనదేశంలో, కావలసినంత వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేఛా వున్నాయి. అలా అని, నగ్నంగా వున్న స్త్రీల బొమ్మలు వేసేసి, వాటి క్రింద "సరస్వతీ దేవి", "భారత మాత" లాంటి పేర్లు వ్రాసెయ్యడమేనా? పోనీ ఆ చిత్రాలకీ, మన వూహల్లో వున్న ఆ దేవీ దేవతలకీ యేమైనా పోలికలు వున్నాయా? అందుకే ఆయన్ని దేశం నుంచి తన్ని తగిలేశారు!

మొన్నీమధ్య ఆయన పై లోకాలకి వెళ్లిపోయాక, ఇన్నాళ్లూ మాట్లాడని సో కాల్డ్ "ఆర్ట్ లవర్స్ ఆఫ్ ఇండియా", వ్యాసాలమీద వ్యాసాలు వ్రాసేస్తున్నారు.....భారతదేశాన్నుంచి ఆయన్ని వెళ్లగొట్టడం పాపమనీ, హత్యచేస్తామని బెదిరించారు....ఇంకిప్పుడు యెలా హత్య చేస్తారు? అనీ....ఇలా వ్రాసేస్తున్నారు....తమ "కళాభిమానాన్ని" చాటుకుంటూ!

అలాంటి కళా"కారుడు" మన దేశం లో పుట్టడమే మన దౌర్భాగ్యం!

కళా"కారుల" అభిమానులూ.....ముర్దాబాద్!


4 comments:

Anonymous said...

ఏకీభవించాను మాస్టారూ, ఒక్క పికాసో-మొనాలిస విషయంలో తప్ప. నేను మొనాలిస లాంటి పైంటింగ్‌ను గీయలేను.

Indian Minerva said...

పికాసో చిత్రాలు నాకూ అర్ధం కావండీ. కానీ ఈ మధ్య ఒక physics పుస్తకం చదువుతుంటే ఈ మోడ్రన్ ఆర్ట్ అంతా "దేవుడు మాత్రమే ప్రపంచాన్ని సాంతం చూడగలడు(కాబట్టి ఆ దేవుని perspective ని ప్రతిఫలిస్తూ అప్పట్లో చర్చివాళ్ళు బొమ్మలని 2Dలో వేసేవాళ్ళట)" అనే ఆలోచనని ధిక్కరిస్తూ ఆయనలాంటివాళ్ళు perspectives వేసి తరువాత్తరువాత 4థ్ డైమెన్షనూ(టైమూ) 5th డైమెన్షనూ అవీ వేసారట.

పదో తరగతిలో హుస్సేనుగారి చిత్రాలపై రభస విని అయ్యోపాపం ఆయన్నెందుకలా అందరూ ఆడిపోసుకుంటున్నారు? నిజంగా మనం రసహీనులం అని అనేసుకున్నాను(అప్పట్లో నాకు internet అందుబాటులో లేదుకాబట్టీ, ఆబొమ్మలు పత్రికల్లో అచ్చేయదగ్గవికాదుకాబట్టీ నేను వాటిని చూడలేదు). క్రిందటేడాది ఆయన పారిపోయినప్పుడు చూశాను ఆయన చాతాళాలన్నింటినీ. కళాకారుడేమోగానీ లౌక్యుడు ఎవరి బొమ్మలు వేస్తే తంతారో(లేదూ ఏకంగా రాళ్ళతోకొట్టి చంపుతారో) ఎవరిబొమ్మలు వేస్తే అహా అంటూ పేరుప్రతిష్టలు అంటగడతారో తెలుసుకొని మరీ వేశాడు. హుస్సేను గారి అభిమానులతో మాట్లాడాలని వుంది. కొన్ని సందేహాలకు సమాధానాలు చెబుతారేమో ప్రయత్నించాలనుంది.

A K Sastry said...

డియర్ Snkr!

మీరేకాదు.....ప్రపంచంలో యెవరూ మొనాలిసా లాంటి చిత్రం గియ్యగలను అని ధీమాగా చెప్పలేక పోయారిప్పటివరకూ!

అంతేకాదు....దశాబ్దాలుగా ప్రపంచ చిత్రకారులు "అలాంటి ఫీచర్సే" వుండి, "అలాగే చిరునవ్వు నవ్వగల" మోడళ్ల గురించి అన్వేషణలో కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి, చేతులెత్తేశారు! ఆ మోడల్ ఆయన మగ నౌఖరు అని తేల్చడానికి ఇదీ ఒక కారణమే!

మీకూ అలాంటి మగ నౌఖరు వుంటే తప్పక ప్రయత్నించండి. యేమో....యే పుట్టలో యే పాముందో! మీరే ప్రపంచ రికార్డులని బ్రేక్ చెయ్యచ్చేమో!

పికాసో విషయం యేమిటో మీరు వ్రాయలేదు.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Indian Minerva!

మీరు వ్రాసినదాంట్లో, "చర్చి వాళ్ల" ఆలోచనలని ధిక్కరిస్తూ అన్నది 100% కరెక్టు.

ఇంక, 3డీ చిత్రాలవరకూ చూశాను....అద్భుతమైనవి యెన్నో! ఈనాడు "హాయ్ బుజ్జీ"లో అప్పుడప్పుడు అలాంటి చిత్రాలు ప్రచురిస్తున్నారు. నిజంగా అద్భుతాలే. వాటిని కలెక్టు చేస్తున్నాను నేను.

ఐన్ స్టెయిన్ ప్రతిపాదించిన 4త్ డైమెన్షను ఇంకా థియరీ రూపంలోనే వుంది. అలాంటి చిత్రాలేమీ రాలేదు. దాని వుపయోగం ప్రస్తుతానికి సైన్స్ ప్రయోగాల్లోనే.

5త్ డైమెన్షన్ గురించి నేను వినలేదు.

మీ సందేహాలని పై పికాసో అభిమాని యేమైనా తీర్చగలరేమో ప్రయత్నించండి.

ధన్యవాదాలు.