Sunday, August 14, 2011

కేరళ లోని......



......ఆలయాలూ, ఆచారాలూ

అనుకోకుండానే మొన్న ఓ చిన్న పనిమీద  (ఆ పని విషయం వేరే టపాలో) కేరళ వెళితే, ఆ పని అయ్యాక, యెలాగూ వచ్చాముకదా అని, దేవాలయాలు చుట్టివచ్చాము--ఇతర ప్రదేశాలతోపాటూ.

తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఈ మధ్య వార్తల్లోకి యెక్కాడుకదా--లక్ష కోట్లకి పైగా సంపదతో, బాలాజీని మించాడు అంటూ! వెళ్లి చూసి వచ్చాము--గుడినీ, దేవుణ్నీ మాత్రమే. (ఆ నేలమాళిగలూ వగైరా చూడనివ్వడం లేదు)

ఇక్కడ ఆచారం యేమిటంటే, మగవాళ్లు పైన చొక్కా, బనీనూ వగైరా లేకుండా, పెంచె మాత్రమే కట్టుకొని లోపలకి వెళ్లాలి. ఆడవారు చీరలూ, సల్వార్ కమీజు వేసుకోవచ్చుట. మోడరన్ డ్రెస్సులు మాత్రం నిషిధ్ధం.

చరిత్రలోకి వెళితే, అసలు ఈ ఆచారం యెలా యేర్పడింది? అనేదానికి సమాధానం వొక్కటే--జంధ్యం వేసుకొనే అగ్రవర్ణాలవారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం వుండేది అప్పట్లో! అది స్పష్టంగా కనిపించడానికే ఈ యేర్పాటు.

1930 ల్లో గాంధీ గారు ఓ సభలో వుండగా, ఓ చిన్నపిల్ల ఆయనని అడిగిందట--ఆలయం చుట్టూ వీధుల్లో అందరూ స్వేచ్చగా తిరుగుతున్నారు, దేవుడి పనులు కూడా చేస్తున్నారు, మరి ఆలయంలోకి యెందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించిందట. ఆయన అప్పటి ధర్మకర్త అయిన మహారాణివారిని ఆ ప్రశ్న ఆడిగాడట. దానికి ఆవిడ "అనాదిగా వస్తున్న ఆచారం" అని చెప్పిందట. 

అప్పటికి "మైనరు" గా వున్న మహారాజు (మహారాణిగారి మేనల్లుడు) ఆ క్షణంలోనే నిశ్చయం చేసుకొన్నాడట. తరువాత ఆయన మైనారిటీ తీరి, రాజు అవగానే పట్టాభిషేక సభలోనే "సర్వజనులకీ ఆలయ ప్రవేశం" ప్రకటన చేశాడట.

బిడ్డపోయినా.....అన్నట్టు, ఆ ఆచారం మాత్రం కొనసా....గుతోంది. 

పులిని చూసి......అన్నట్టు, ఆ రాష్ట్రంలో మిగతా ఆలయాలవాళ్లు అలాంటి ఆచారాలనే కొనసాగిస్తున్నారు--చిన్నా చితకా ఆలయాలతో సహా! కొన్నింటిలో ధోతీ నియమం లేదు--పేంటు ధరించవచ్చు. చొక్కా, బనీనూ మాత్రం విప్పేసి, చేతిమీద వ్రేళ్లాడేసుకొని, వెళ్లిపోవచ్చు.

ఇంక కెమేరాలూ, సెల్ ఫోనులూ నిషిధ్ధం. ఫోటోలు తీయడం నిషిధ్ధం. కొన్నిచోట్ల గర్భగుడిలో తప్ప, బయట ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోలు నిషిధ్ధం! (టెర్రరిజం వంక వీటికి--పురాతన ఆచారాల ముసుగు! అక్కడికి దేవుడి ఫోటో తీస్తే ఆయన మహిమ తగ్గిపోతుందేమో మరి!)

అదీ సంగతి. 

12 comments:

ఆత్రేయ said...

ఏదైనా దేవాలయం లోకి ప్రవేశించటం అంటే ఆ దేవాలయ సాంప్రదాయాన్ని, ఆ దైవాన్ని గౌరవించినట్లే. మరి ఆ సాంప్రదాయ పాటించడానికి ఎందుకు మనసొప్పదు.?
ఇక పోతే కేరళ లో దేవాలయాల్లోమగ వాళ్ళు పై బట్ట తీసి వెళ్ళటం అనేది తిరువనంతపురం నుంచి వచ్చిన సాంప్రదాయం కాదు, ఈ విషయం మీద మీరు ఇంకొంచం విషయ పరిశీలన చేయ వలసినది.
ఒక్క కేరళ మాత్రమే కాదు కర్ణాటక, తమిళనాడు లోని ఇంకొన్ని ప్రదేశాల్లో ఇదే ఆచారం అనాదిగా ఉన్నది.
ఈ ఇబ్బంది అంతా దేవాలయాలని కేవలం విహార యాత్ర, శిల్ప సౌందర్య వీక్షణం కోసం వెళ్ళే వాళ్ళకే.
sorry for commenting against the post as an intruder.

Anonymous said...

అయ్యా, తెలుగు రాడికల్ గారు, పెద్దలు మీరు. విషయావగాహన లేకుండా ఒక ముఖ్యమైన అంశం మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు.

>>>>>చరిత్రలోకి వెళితే, అసలు ఈ ఆచారం యెలా యేర్పడింది? అనేదానికి సమాధానం వొక్కటే--జంధ్యం వేసుకొనే అగ్రవర్ణాలవారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం వుండేది అప్పట్లో! అది స్పష్టంగా కనిపించడానికే ఈ యేర్పాటు.<<<<<

అగ్ని కుల క్షత్రియులు (మత్స్యకారులు) కూడా జంధ్యం ధరిస్తారు అని మీకు తెలుసా. తెలిస్తే వారిని అగ్రవర్ణాలలో చేరుస్తారా మీరు? చరిత్రలోకి వెళితే, పూర్వం నుండి ఇప్పటి వరకూ కూడా అగ్ని కుల క్షత్రియులని అగ్రవర్ణాలని ఎవరైనా అన్నారా? మీరు ఆలోచించగా చించగా మీకు ఈ కారణం జీరో కాండిల్ బల్బులా వెలిగింది. చరిత్ర పేరు చెప్పి అది రాసేశారు.

దయచేసి తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చి ఇప్పటికే ఉన్న విద్వేషాలని రెచ్చగొట్టకండి. మీకు తెలియక పోతే విషయం తెలిసిన పెద్దలనెవరినైనా అడిగి తెలుసుకోండి. మీకు వివరంగా చెప్పగలిగేంత వయసు నాకు లేదు. అందుకే చెప్పడం లేదు.

మీకు ఇష్టమైతే ఈ వ్యాఖ్య ఉంచండి. లేకపోతే తీసేయండి. ఉంచినా, తీసేసినా మీరు వ్యాఖ్య చదువుతారు కదా. అది చాలు నాకు.

Anonymous said...

మీరు రాయని ఆ గ్యాప్ రోజులే బాగున్నాయి అవే కంటిన్యూ చేయండి మాష్టారు.

Anonymous said...

" అనుకోకుండా చిన్న పని మీదా........"
ఆ పని ఏమయి ఉంటుంది ?
కేరళ నంబూద్రిల దగ్గర నాడీ జాతకం చెప్పించు కోవటమా?
లేక ఇంకేమైనా ...
రాడికల్ గారూ మీ పోస్ట్ భలే ఉంది.

Anonymous said...

మసీదుల్లోకి ఆడవాళ్ళని ఎందుకు అనుమతించరని అడగరు, క్రైస్తవములోనికి మారినా రిజర్వేషనులు ఎందుకు అని అడుగరు. హిందూ ఆచారాలు మాత్రం ప్రతీవారికీ అలుసే. సవాలక్ష లాజిక్కులు లాగుడు, హేతువాదం ముసుగులు!! లౌకికవాదం అంటే హిందూవ్యతిరేకవాదం అని భవిష్యత్తరాలు నిఘంటువుల్లో చదువుకున్నా ఆశ్చర్యమేమీ లేదేమో?!!

Indian Minerva said...

ఈ చొక్కాతీత అచారాన్ని ధర్మస్థళలో(కర్ణాటక) కూడ చూశానండీ. నాకంత భక్తిలేదుగాబట్టి లైట్‌తీసుకున్నాను.

A K Sastry said...

డియర్ ఆత్రేయ!

మీ పరిచయ భాగ్యానికి చాలా సంతోషం. మీ బ్లాగులూ, టపాలూ బావున్నాయి. బుక్ మార్క్ చేసుకున్నాను. మీలాంటివాళ్లు బ్లాగు లోకానికి చాలా అవసరం.

పోతే, ఆ సాంప్రదాయం అక్కడే మొదలైనట్టు ధ్వనిస్తే పొరపాటే. మీరన్నట్టు దక్షిణాదిలో ఇంకా చాలా గుళ్లలో ఆ ఆచారం వుంది. దానికి కారణం మాత్రం, నేను విన్న, చదివిన, తెలుసుకున్నంతవరకూ అగ్ర వర్ణాలని గుర్తించడానికే.

మీకు ఇంకా యేమైనా తెలిస్తే వ్రాయండి. నా టపాలకి మీకెప్పుడూ స్వాగతం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Indian Minerva!

ఈ ఆచారం దక్షిణాదిలో చాలా గుళ్లలో వుంది. యెటొచ్చీ, ఒకళ్లని చూసి ఒకళ్లు మొదలెట్టారు అంతే. అలాగే ఫోటోలు తియ్యనివ్వకపోవడమూ!

ధన్యవాదాలు.

A K Sastry said...

పై మొదటి అన్నోన్!

నాకు తెలిసినదీ, విన్నదీ, చదివినదీ మాత్రమే నేను వ్రాయడాన్ని 'ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం' అనరు గానీ, మీరు వ్రాసినట్లు వ్రాయడాన్ని మాత్రం 'నోరు పారేసుకోవడం' అంటారు.

మీ వూళ్లో అగ్నికుల క్షత్రియులు జంధ్యం వేసుకొంటారేమో--మా వూళ్లో వేసుకోరు.

విషయం తెలిసిన పెద్దలనడిగి మీరే ఓ బ్లాగు వ్రాసి మాకు అందించచ్చుగా?

బూతులు వ్రాస్తే తప్ప, కామెంట్లు తొలగించే అలవాటు నాకు లేదు. పినాకొ లకి కూడా సమాధానాలు ఇచ్చినవాణ్ని నేను! అన్నోన్లు చాలామందిని 'ఇగ్నోర్' చేస్తానంతే.

ఆత్రేయ said...

ధన్యవాదములు కృష్ణశ్రీ గారు.
మీకూ నా బ్లాగ్ లోకి ఆహ్వానము.

Unknown said...

అగ్నికుల క్షత్రియులు మన ఆంధ్రలో అంత ప్రసిద్ధులు కారు గాని... ఉత్తర భారత దేశం లో వారు ఒక రాజపుత్ వంశం వారు. ప్రుద్విరాజ్ చౌహాన్ అగ్నికుల క్షత్రియుడే... శ్రీ భోజ మహారాజు, విక్రమాదిత్యుడు అగ్నికుల క్షత్రియులే. ఇక మన ఆంద్ర లో ప్రసిద్ధి చెందినా లక్ష్మి నరసింహ స్వామి ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియుడే. జంద్యం వుంది అంటే అగ్ర వర్ణమే... కొత్తగా చేర్పించాల్సిన అవసరం లేదు.

Anonymous said...

Agnikula kshatriyas are not fishermen caste!