Wednesday, October 12, 2011

తెలుగోళ్లూ..........!



......యెన్నాళ్లీ 'అరవ' వూడిగం?

"తిరు" అని వింటేనే, నా చెవుల్లో యెవరో "తిరి" పెట్టినట్టవుతుంది నాకు! 

అరవ వైష్ణవులు, తెలుగు వైష్ణవులకన్నా యేవిషయంలో గొప్ప? అని ఇదివరకే క్రొశ్నించాను నేను. యెవరూ సమాధానం చెప్పలేదు. 

మా నరసాపురంలోని "ఆదికేశవ యెంబెరుమన్నారు" కోవెలని, ".........యెంబెరుమనార్" అని యెందుకు మార్చారు అనీ, ఈనాడువారు "యెంబెరుమానార్" అని యెందుకు అంటున్నారు అనికూడా క్రొశ్నించాను. సమాధానం లేదు! 

చక్కగా తెలుగులో యేకాక్షర పదం "శ్రీ" వుండగా, ఆ "తిరు" దౌర్భాగ్యం యేమిటో నాకు అర్థం కాదు! 

"స్నపన తిరుమంజనం"ట! ఇదేభాషో? తెలుగులో స్నపనం అంటే, స్నానం చేయించడం అని అర్థం అయివుండొచ్చు. మరి "మంజనం" యేమిటి? అంజనం, భంజనం లా? సరే. 

అదేదో 'తొక్కలో' వాహనం అన్నట్టు ఒకడు "తొక్కళం వాహనం" అంటాడు. ఇంకోడు "తొళక్కం వాహనం" అంటాడు! 

ఇంక "ఇస్తెకఫాల్ స్వాగతం"; "మేల్ చాట్ వస్త్రం" లాంటి మాటలు యేభాషవో తెలీదు అని ఇదివరకే వ్రాశాను. యెవరూ తెలియజెప్పలేదు. 

ఇంకా, "చక్రత్తాళ్వారు"ట! అరవ్వాళ్ల "పన్నిద్దరాళ్వారు"ల్లోనే ఈ ఆళ్వారు లేడేమో! 

తిరుమలలో అంటే, అది తమిళనాడుకి దగ్గరగా వుంది కాబట్టో, కొన్నేళ్లక్రితం వరకూ అరవ పూజారులే వుండేవారు కాబట్టో ఆ వ్యవహారపదాల వాడకం ప్రసిధ్ధికెక్కిందనుకుందాం. (ఇప్పుడు రమణదీక్షితులూ, జీయంగార్లూ, శేషాద్రులూ అరవ్వాళ్లు కాదనుకుంటా). 

మరి రాష్ట్రవ్యాప్తంగా వున్న (ద్వారకా తిరుమలతోసహా) వేంకటేశ్వరాలయాల్లోనూ ఈ అరవ పడికట్టు పదాలనే వాడడం ఓ గొప్ప అనుకుంటున్నారా? మీడియావాళ్లు అలా ప్రచారం చేస్తున్నారా? యేమో. 

ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా......తెలుగు వైష్ణవులు అరవ వైష్ణవులకి యెందుకు బానిసలుగా కొనసాగుతున్నారు? 

బాపిరాజూ! మీకు మహాభక్తీ, పరమభక్తీ అన్నీ వుండొచ్చు. బ్రహ్మోత్సవాల్లో "చిందులు" వేసుకో, "డోళ్లు" కొట్టుకో, "కోలాటాలు" ఆడుకో, ఇంకా భక్తి యెక్కువైతే, యేడుకొండలూ పొర్లుదండాలు పెడుతూ పైకెక్కి, దిగు--అంతేగానీ--యెప్పుడో 1970 ల్లో రిజిస్టర్ అయిన "అన్నదానం ట్రస్టు" ని కాదని, "అన్నప్రసాదం" అని మార్చడానికి మీకేమి అధికారం వుంది? 

మీకు చేతనయితే, తిరుమల తిరుపతిని "శ్రీగిరి శ్రీపతి" గా మార్చు! తెలుగువాళ్లు వచ్చే వెయ్యి సంవత్సరాలవరకూ మీకు కృతజ్ఞులై పడి వుంటారు! 

నేను పైన వ్రాసిన పేర్లన్నీ, యెవరైనా "తెలుగుమాటలే" అంటే, వాటి "వ్యుత్పత్యర్థాలని" తెలుగులో వివరిస్తే, నా ఈ బ్లాగుముఖంగనే, క్షమాపణలు వేడుతాను! 

ఇంక మీ ఇష్టం! 

వాకే???


9 comments:

jnani said...

తమిళనాడులొ అరవ వాళ్ళకి భయపడి అసలు తెలుగె మర్చిపొయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.వాళ్ళ పిల్లలు కూడా తెలుగు మాట్లాడరు

కొత్త పాళీ said...

good question(s)!

Anonymous said...

ఇదే మనకున్న దరిద్రం. ఆఖరికి మన గుంటూర్లో ఉంటూన్న జీయార్ స్వామిగారు కూడా "తిరు నక్షత్రం" అంటూ ఉంటారు. తిరుప్పావై గొప్పదే కానీ తెలుగులో ఇంకేమీ లేవు ఇదే వాడి తీరాలి అనడం అంత బావోదు మరి. తమిళ వాళ్ళకి తెలుగు గురించి చెప్పండి. తీసి ఒక తాపు తంతారు. అదే మనం అయితే తెలుగు ని తొక్కలో తొక్కేసి తమిళాన్ని నెత్తిన పెట్టుకోడానికీ రడీ.

ప్రపంచంలో అందరికీ తెల్సిన విషయమే ఇది. తెలుగోడ్ని ఒకడ్ని దగ్గిరకి తీసి జబ్బలు చరిస్తే వాడు హోలుమొత్తం ఆంధ్రానే తన్నేస్తాడు. ఇప్పుడొచ్చే ఈ కిరస్తానం అంతా ఈ దారిలోనే వస్తున్నారు. దరిద్రం మన దగ్గిర పెట్టుకుని తమిళవాళ్ళని అనడం ఎందుకు లెండి.

Anonymous said...

"మీకు చేతనయితే, తిరుమల తిరుపతిని "శ్రీగిరి శ్రీపతి" గా మార్చు!"

ముందు మీ పేరుని నలుపులక్ష్మి (కృష్ణ = నలుపు, శ్రీ=లక్ష్మి) గా మార్చుకోండి :-)

A K Sastry said...

డియర్ jnani!

వాళ్ల స్థానబలం అలాంటిది మరి! అంతేకాకుండా, మన "ఇతరభాషా గుల" కూడా అలాంటిదే!

A K Sastry said...

డియర్ కొత్త పాళీ!

ప్రశ్నలు మంచివే అన్నందుకు సంతోషం.

యెటొచ్చీ, సమాధానాలు చెప్పేవాళ్లు, కనీసం అలోచించేవాళ్లకే కొరత!

ధన్యవాదాలు.

A K Sastry said...

పై మొదటి అన్నోన్!

తిరుప్పావై ని ప్రచారం చేస్తూ, ప్రతీ పోలేరమ్మ గుళ్లోనూ కూడా రుద్దుతున్న వ్యవహారాన్ని గురించి ఇదివరకే వ్రాశాను.

నేను తమిళ సోదరులని యేమీ అనలేదు అని గమనించండి!

ధన్యవాదాలు.

A K Sastry said...

పై రెండో అన్నోన్!

మీ చచ్చుతెలివికి జోహార్ చెయ్యడం తప్ప ఇంకేమి చెయ్యగలను!

Unknown said...

భాష ఏదైనా కానీ.... హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని తర్వాత తరాలకు అందిస్తున్నారు కదా...! అందుకే వారికి మా నమస్కారాలు