........యెవరికి లాభం? యెంత శాతం?
హిరణ్యకశిపుడు (జయ విజయుల్లో రెండోవాడు) పేట్రేగిపోయినప్పుడు, సకల మునులూ, దేవతల కోరికపై
"నరసింహావతారం" యెత్తాడు ఆయన.
బలి చక్రవర్తి భరతం పట్టడానికి, మళ్లీ వాళ్లందరి కోరికపై, వామనావతారం యెత్తవలసి వచ్చింది.
అప్పటికి విష్ణువు సర్వసమర్థుడిగా, సర్వాధికారిగా ఎస్టాబ్లిష్ అయ్యేసరికి, మొదలయ్యాయి "యాగాలు". (ఆప్పుడుకూడా యజ్ఞాలు కొనసాగేవి--కొంతమంది చేత.)
కృతయుగాంతంలో, సప్తర్షులూ ఆకాశంలో వుండిపోతే, వాళ్ల వారసులు భూమ్మీదకి వచ్చి, ప్రజోత్పత్తికి పాటుపడ్డారు.
"స్వాయంభువ" మనువు వల్ల "బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర" కులాలు యేర్పడ్డాయి.
త్రేతాయుగం ప్రారంభంలో, "క్షత్రియుల" విజృంభణతో, మరోసారి పరశురామావతారం యెత్తి, 21 సార్లు భూమంతా తిరిగి, క్షత్రియుడు అనేవాడు లేకుండా నరికేశాడు. (ఒక్క దశరథుడే, గాజులు తొడుక్కొని, బ్రతికిపోయాడు!)
తరవాత, రామావతారం.
ఇక్కణ్నించీ అన్నీ ప్రాచుర్యంలో వున్న కథలే. ఆ కాలంలో, యజ్ఞాలూ, యాగాలూ కూడా జరిగేవి.
విశ్వామిత్రుడు "యజ్ఞం" చేస్తుంటే, రాక్షసులు ఆటంకాలు కల్పిస్తున్నారనే రాముణ్ని తనతో పంపమన్నాడు.
మరి, దశరథుడు "పుత్రకామేష్టి" "యాగం" చేశాక కదా సంతానం పొందాడు?
యాగం అంటే, "ప్రతిఫలాపేక్ష" తో కూడింది. ఆశ్వమేధ, నరమేధ, రాజసూయ వగైరా యాగాలన్నీ అందుకే!
యాగానికి "యజమాని" (యాగం చేసేవాడు) వుంటాడు. (ఆయనకి భార్య వుండడం కూడా కంపల్సరీ--యెందుకో.....తరవాత.) "యూప స్థంభం" వుంటుంది. దానికి "బలిపశువు"ని కట్టేస్తారు. "ఋత్విక్కులు", ఆయన కోరికని తెలియజేస్తూ, యజమానిచేత "హోమం" చేయిస్తారు. ఆయన తరఫున "హోత"లు హోమం చేస్తారు. "ఉద్గాతలు" సహకరిస్తారు.
"యజ్ఞానికి" శాలలు వుండవు. "యాగాలకి" వుంటాయి. యజ్ఞం బహిః ప్రదేశంలో నిర్వహించడం వల్లే, మారీచ సుబాహులు రక్త మాంసాలతో యజ్ఞ కుండాన్ని అపవిత్రం చేసి, అగ్నిని ఆర్పగలిగారు.
యాగం తంతు యాగశాలలోనే జరుగుతుంది. ఒక్కో యాగానికీ ఒక్కో రకం శాలలూ, వేదికలూ యేర్పాటు చేస్తారు.
యాగ ప్రక్రియ, స్థూలంగా, యజమానిని యాగ పశువులోకి ఆవాహన చేసి, ఆ పశువు ద్వారా యజమాని కోరిక నెరవేరేందుకు దోహదం చేసి, చివరికి ఆ పశువుని నవరంధ్రాలూ మూసి హత్యచేసి, ఖండఖండాలుగా నరికి, ప్రతీ అవయవానికి సంబంధించిన మంత్రాలతో అగ్నికి ఆహుతి చేయడంతో ముగుస్తుంది యాగం. అంటే, యజమానే అత్మార్పణ చేసుకున్న ఫలం సిధ్ధించి, "యజ్ఞ" పురుషుడు అగ్నిలోంచి ఆవిర్భవించి, యజమాని కోరికతీరేలా "ఫలం" అనుగ్రహించి వెళ్లిపోతాడు.
త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతారం యెత్తి, పరశురాముడి అవతరానికి పరిసమాప్తి చేస్తాడు విష్ణువు. రావణవధ జరిగి, సీతని అడవిలో వదిలేశాక "అశ్వమేధ యాగం" చేశాడంటారు. (రావణ, కుంభకర్ణుల--జయ విజయుల రెండో జన్మ--వధ జరిపాడు విష్ణువు).
ద్వాపర యుగంలో, ధర్మరాజు "రాజసూయ యాగం" చేశాడు. అప్పుడే శిశుపాల (జయ విజయుల్లో ఒకడు--మూడో జన్మ) వధ జరిగి, కురుపాండవుల మధ్య మచ్చరం రగిలి, కురుక్షేత్ర యుధ్ధానికి దారి తీసింది. ఇందులో "బలరామావతారం" పాత్ర చెప్పుకోతగ్గది.
(మన సినిమావాళ్లు ఆయన్ని తీసేసి, కృష్ణావతారం ప్రవేశపెట్టారు! అలాగే విజయుడి మూడో జన్మ "దంతవక్తృడు" కథకి అంత ప్రాచుర్యం రాలేదు!)
......మిగతా మరోసారి.
2 comments:
కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్" gaaru,
మీరిలా సీరియల్ టపాలు రాయడానికి దారితీసిన వైనంబెట్టిది?
"ఎవరిపైన మీ వైరం? ఏలనో ఈ ఘోరం...
మధురమైన జీవితాల కథ ఇంతేనా?
ప్రేమికులకు విధి ఒసగిన వరమింతేనా? ...
టరడై... టరడై ... టరడై....
డియర్ SNKR!
అంతపాట అఖ్ఖర్లేదనుకుంటా. సీరియల్ గా రాయడానికి కారణం, సమయాభావమే. యెవరిమీదా వైరం పూనవలసిన అగత్యం నాకు లేదు. "కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్" అనేదే యెప్పుడూ నా విధానం.
నిజంగా చదువుకునికూడా మేము మూర్ఖులుగానే వుంటాము అనే వాళ్ల "గల్లిబులిటీ" చూస్తే మాత్రం నాకు (ముళ్లపూడి భాషలో) జాలీ, ఇంకోటీ కలుగుతాయి.
అందుకే ఈ టపాలు. అర్థం చేసుకుంటారుగా?
ధన్యవాదాలు.
Post a Comment