Monday, October 22, 2012

పురాణేతిహాసాలూ.....



.....పుక్కిటి పురాణాలూ

"ఆఁ! ఇవన్నీ పుక్కిటిపురాణాలు....." అంటూ చప్పరించేసేవాళ్లెప్పుడూ వున్నారు. 

నాకు తెలిసిన ఓ పెద్దాయన భారతంలో "భగవద్గీత" మొత్తం "ప్రక్షిప్తం" అంటాడు. అలా అనడానికి అనేక సమర్థనలు చూపిస్తూ వుంటాడు. 

ఆయన వాదనలో--"భగవద్గీతలో "యదా యదాహి ధర్మస్య........." అనే శ్లోకం చెప్పాడుగదా?

మామూలుగా నారాయణుడు "దశావతారాలు" యెత్తాడంటారు. భాగవతంలో పోతన అయితే, ఇప్పటికి 21 అవతారాలు యెత్తాడనీ, 22వ అవతారంగా "కల్కి" వస్తాడనీ అంటాడు.

కృతయుగం కొన్ని లక్షల సంవత్సరాలు కదా? త్రేతా యుగం దానికి రెట్టింపు. ద్వాపర యుగం మూడురెట్లు, కలియుగం నాలుగు రెట్లు కదా?

మరి దశావతారాల్లోని మొదటి ఐదు అవతారాలూ కృతయుగంలోనే యెత్తేశాడు. ఆరోది పరశురామావతారం కూడా ఆ యుగంలోనే యెత్తి, దుష్ట శిక్షణ చేసేశాడు. త్రేతాయుగంలో ఒక్క రామావతారమే యెత్తాడు. ద్వాపరంలో బలరామావతారం ఒక్కటే! ఇంక కలియుగంలో ఇప్పటివరకూ బుధ్ధావతారం ఒక్కటే. 

భాగవతం ప్రకారం అయితే, యేకంగా 17 అవతారాలు కృతంలోనూ; ఒకటి త్రేతాలోనూ; రెండుమాత్రం ద్వాపరంలోనూ; ఇరవైఒకటోదైన బుధ్ధావతారం కలిలో ఇప్పటివరకూ యెత్తాడు. 

అంటే, పురాణాల్లో చెప్పినట్టు "ధర్మ దేవత" కృతయుగంలో నాలుగుపాదాలతోనూ, త్రేతాయుగంలో మూడూ, ద్వాపరంలో రెండూ, కలిలో ఓకే పాదంతో నడుస్తుందంటారుకదా? 

మరి అవతారాలు చూస్తే, "దుష్టులు" కృతయుగంలోనే యెక్కువ అనీ, మిగిలిన యుగాల్లో బాగా తగ్గుతూ వస్తున్నారనీ అనుకోవాలా?"

.......ఇలా ఇంకా చాలా వాదిస్తారు!

(మళ్లీ మరోసారి)

6 comments:

శశి కుమార్ said...

కృతయుగం కొన్ని లక్షల సంవత్సరాలు కదా? త్రేతా యుగం దానికి రెట్టింపు. ద్వాపర యుగం మూడురెట్లు, కలియుగం నాలుగు రెట్లు కదా?

your statement is wrong, kRta Yuga has more years, then trEta Yuga is half of the years of kRta, dwApara is half of trEta and finally kaliyuga is the half of dwapara

http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%A4%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

శ్యామలీయం said...

కృతయుగం: 17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం: 12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం; 8,64,000 సంవత్సరాలు
కలియుగం: 4,32,000 సంవత్సరాలు
అన్నీకలిపి ఒక్ మహాయుగం: 43,20,000 సంవత్సరాలు.

శ్యామలీయం said...

>కలియుగంలో ఇప్పటివరకూ బుధ్ధావతారం ఒక్కటే.
మీరు బహుశః గౌతమబుధ్ధుడిని మహావిష్ణువు అవతారమైన బుధ్ధూడు అనుకుంటున్నారు. అది తప్పు భావన.

>మరి అవతారాలు చూస్తే, "దుష్టులు" కృతయుగంలోనే యెక్కువ అనీ, మిగిలిన యుగాల్లో బాగా తగ్గుతూ వస్తున్నారనీ అనుకోవాలా?"

ఇక్కడ కూడా మీ అవగహన తప్పు. ఈ అవతారాలన్నీ ప్రస్తుత మహాయుగంలోనివే కావు. వేరే వేరే కాలాల్లోనివి.

తగినంత అవగాహన లేకపోయినా నెట్ సౌకర్యం‌పుణ్యమా అని యెవరైనా‌ యేదైనా వ్రాసి అచ్చు వేసుకునే రోజులు మరి!

శశి కుమార్ said...

yes shyaamaleeyam gaaru, you are correct. In bhaagavatam clearly mentioned about the time, yugas etc.
All the 10 avataras are not appeared in same mahayuga, lord appeared in different kalpas.

శశి కుమార్ said...
This comment has been removed by a blog administrator.
A K Sastry said...


డియర్ శశి! & డియర్ శ్యామలీయం!

ఈ యుగాల లెఖ్ఖల గురించి ఇంకో టపా వ్రాస్తున్నాను. ప్రచురించాక చదివి మీ అమూల్యాభిప్రాయాలు చెప్పండి.

మీరన్నట్టు పత్రికల్లోనూ, నెట్ లోనూ యెవరికి తోచింది వాళ్లు వ్రాస్తున్నారన్నది నిజం.

కారణేతరాలవల్ల మీ వ్యాఖ్యలకి వెంటనే స్పందించలేకపోయాను. క్షంతవ్యుణ్ని.

ధన్యవాదాలు.