Tuesday, February 25, 2014

ఆత్మలూ.....


............సాక్షాత్కారం

12-08-2010 న వేరెవరిదో బ్లాగ్ లో నేను వ్రాసిన కామెంట్ మీద, TEJA-M అనే ఆయన నన్ను మెయిల్ ద్వారా 31-08-2013 న సంప్రదించారు. ఆయన సందేహాలు ఆయన మాటల్లోనే--".......ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నదే నా లక్ష్యం. నేను ప్రస్తుతం సద్గురువు అన్వేషణలో వున్నాను............1. మీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? 2. నాకు ఈ విషయంలో (ఆత్మ సాక్షాత్కారం) ఏమైనా సహాయం చేయగలరా?......." 

అప్పటినుంచీ, అనేక కారణాలవల్ల, సమాధానం వ్రాయాలని వున్నా, వీలుకాలేదు. ఆయనకి వ్యక్తిగతంగా మెయిల్ లో సమాధానం ఇచ్చేకన్నా, ఓ టపా వ్రాస్తే అందరూ చూస్తారు కదా అని అలోచన రావడంతో, ఆగి ఆగి, ఇప్పటికి వీలు చిక్కింది.

ముందుగా కొన్ని విషయాలు స్పష్టం చెయ్య్దలుచుకున్నాను. 

1. ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పే కబుర్లు అన్నీ వఠ్ఠి ట్రాష్. 
2. కుండలిని ని జాగృతం చెయ్యడానికి సాధన అవసరం--అంటే అదేదో ఘోరమైనా తపస్సు అని భయపడవలసిన అవసరం లేదు.
3. యోగ సాధన, యోగం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, పిరమిడ్ ధ్యానం లాంటి వాటి గురించి గాభరా పడనక్కర్లేదు.
4. సద్గురువులు వేరే యెక్కడో వుండరు. మీ తండ్రో, అన్నదమ్ములో, స్నేహితులో, కొలీగో కావచ్చు. కాషాయ బట్టలూ, గడ్డాలూ, మీసాలూ, దండ కమండలలూ చూసి మోసపోవద్దు.
5. పత్రికలలో వచ్చే కాలక్షేపం ఆధ్యాత్మిక రాతలు అసలు నమ్మద్దు. పట్టించుకోవద్దు.

నేను 1992 లో హైదరాబాదు లోని ప్రఖ్యాత హిప్నాటిస్ట్ డాక్టర్ నగేష్ దగ్గర 'సెల్ఫ్ హిప్నాటిజం' నేర్చుకొన్నాను. అది చాలా దోహదం చేసింది. ఇతరులని కూడా హిప్నటైజ్ చెయ్యగల సామర్ధ్యం స్వయం సాధన ద్వారా నేర్చుకొన్నాను. నా పిల్లలకీ, కొలీగ్స్ కీ కొన్ని చిన్న చిన్న సమస్యలని అధిగమించడానికి సహాయం చేశాను.

మరి ఈ సెల్ఫ్ హిప్నాటిజం అంటే యేమిటి? అంటే, మనని మనం హిప్నాటిక్ ట్రాన్స్   అనే ఓ నిద్ర లాంటి స్థితిలోకి తీసుకెళ్లి, యేకాగ్రతతనీ, టెన్షన్ లకి  దూరంగా మానసిక ప్రశాంతతనీ పొందడానికి వీలవుతుంది. ఆ సమయం లో మనకి మనం ఇచ్చుకొనే సూచనలు, తరువాత మనమే ఆచరణలో పెట్టడానికి దోహదం అవుతుంది. ముఖ్యంగా మంచి నిద్ర పడుతుంది, యేకాగ్రత్త పెరుగుతుంది.

దీనికీ, కుండలినికీ సంబంధం వుందా అంటే వుంది, లేదు అంటే లేదు. 

సరే........మనం చెయ్యవలసింది........ఉదయం సూర్యోదయానికి కనీసం ఓ గంట ముందు నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని, సిధ్ధం కావడం. అంటే సుమారు 4-30 కి లేస్తే, 5-00 కల్లా సిధ్ధం కావచ్చు. ఇదేదో పవిత్రతకోసం కాదు. అవశిష్టాలవల్ల అంతరాయం కలగకుండా. 

ఇలా లేవడం అలవాటైనవాళ్లకి పెద్ద విషయం కాదు. దీనికి సెల్ఫ్ హిప్నాటిజం లో రాత్రి నిద్రపోయే ముందే సూచన ఇచ్చుకోవచ్చు. అలవాటులేనివాళ్లు కొంచెం కష్టపడక తప్పదు మరి. 

తరువాత...........

(మరోసారి)

2 comments:

TVS SASTRY said...

శాస్త్రి గారూ!మంచి విషయాన్ని ఎన్నుకున్నందుకు అభినందనలు!ఈ దేశంలో ప్రస్తుతం,మీరు ఉదహరించిన విషయాలమీద కొన్ని కోట్లరూపాయాల ఆధ్యాత్మిక వ్యాపారం జరుగుతుంది.ఎంతమందో మోసపోతున్నారు!
ఈ విషయాల మీద దాదాపుగా నా భావాలు కూడా మీకున్న భావాలకు దగ్గరలోనే ఉన్నాయి!అయితే,ఏ యోగానికైనా ,సాధనే గురువు!కుహనా స్వాముల వేషాలను బట్టబయలు చేసే వ్యాసాన్ని నేనుకూడా ఒకటి వ్రాసాను.ప్రచురుణకు,అనువైన సమయం కోసం వేచి చూస్తున్నాను!మంచి విషయాన్ని ఎన్నుకున్నందుకు మరొకసారి అభినందనలు!

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

మీ అభినందనలకు చాలా సంతోషం. నేను కుహనా స్వాములని గురించి వ్రాయడం లేదు. అసలు విషయం ప్రక్కదారి పడుతుందని. యెన్ని టపాలైనా చాలవు అని.
మీరు తప్పకుండా వ్రాయండి.

మీ భావాలు నా భావాలకి దగ్గరగా వుంటాయనే మన కోటేశ్వరరావు గరు మీ మెయి అడ్రెస్ నాకిచ్చి, మళ్లీ మన పరిచయాన్ని పునరుధ్ధరించారు.

ధన్యవాదాలు.