Saturday, January 21, 2017

"Something basically wrong....."--2


"జీవ హింసానందోన్మాదం....."

తూర్పు గోదావరి "ప్రభల" తీర్థాలనీ, కోటప్ప కొండ "ప్రభల" నీ కూడా, కోడి పందాల తో కలిపి మాట్లాడుతున్నారు కొందరు మూర్ఖులు!

దేవరగట్టు కర్రల యుధ్ధాలని కూడా వాళ్ల సంప్రదాయం అంటున్నారు, ఒప్పుకుందామా? అంటున్నారు కొంతమంది.

పురాతన రోమన్ సామ్రాజ్యం లో, ఆకలితో ఉన్న సింహాలకీ, బానిసలకీ యుధ్ధం ఏర్పాటు చేసి, కొన్ని వేలమంది ఆనందించేవారట!

మన పురాణాల ప్రకారం, అనేక యాగాలు చేసి, పశువులని వధించినవాళ్లు నరకానికి పోయి, ఇనుప కొమ్ములూ, గిట్టలూ ఉన్న అవే జంతువులచే హింసింపబడినట్టు వ్రాశారు!

కొంచెం వెరైటీగా, "కట్టు జల్లి" పేరుతో, స్టేడియాల్లో మధ్యన జనాలని నిలబెట్టి, అన్ని ప్రక్కలనుంచీ కొన్ని వేల ఆబోతులనీ, దున్నలనీ రెచ్చగొట్టి వాళ్లమీదకి వదిలేస్తే, చూసేవాళ్లకి వినోదమే వినోదం! 

జల్లికట్టు జంతువులని పట్టుకోడానికి సాహసించే లాంటి వాళ్ల దగ్గరనుంచి డబ్బు వసూలు చెయ్యచ్చు.....మధ్యలో నిలబడే ఛాన్స్ ఇచ్చినందుకు! చూడ్డానికి వచ్చే వాళ్ల దగ్గరనుంచి, ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చేసుకోవచ్చు!

అలాగే, కత్తులు కట్టిన కోళ్లతోటీ......!

ఏమంటారు? 

అవి సంప్రదాయాలు కాదంటారా?! యెవరో ఒకరు ప్రారంభించకపోతే, సంప్రదాయాలు ఎలా ఏర్పడతాయి? 

కమ్మీనిష్టులు ముగ్గుల పోటీలు నిర్వహించడం యెప్పుడో ప్రారంభించి, సంప్రదాయాన్ని నెలకొల్పలేదూ?

ఆలోచించండి!


2 comments:

Anonymous said...

జల్లికట్టు జరిపించడం తన ప్రతిష్టగా భావించిన రాష్ట్రప్రభుత్వం, అది జరిపించినందువల్ల వచ్చేమద్దత్తేగానీ, పోయేదేమీ లేదని గ్రహించిన గోతికాడ నక్క కేంద్రప్రభుత్వం, సంస్కృతీ, సాంప్రాదాయలను అనూహ్యంగా నెత్తినమోసిన మన సాఫ్టువేరు psuedo-మేధావులు. వెరసి జల్లికట్టు ఆర్డినెన్సు.

రేప్పొద్దున సుప్రీంకోర్టు చేసిన ఏ నిర్ణయాన్నైనా extra-judisగా కేంద్రం override చెయ్యొచ్చన్నమాట. చివరకి ఏది రైటు అన్నది massrule మీద ఆధారపడుతుంది. భారత్ తన లౌకిక ముసుగు విసిరిపారేసే సమయం ఆసన్నమయ్యిందోచ్!

A K Sastry said...

పై అన్నోన్!

మీ అభిప్రాయం కొంతవరకూ కరెక్టే!