(తె)‘లంగా’(ణా) వాదులుతొలి విడత పోలింగు ముగిసింది—తెలంగాణాలో హస్తం తిరగబడిందంటున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి ‘ప్రాంతీయ విభేదాలని’ రెచ్చగొట్టడానికి పూనుకున్నాడనీ అంటున్నారు! నిజంగా తెలంగాణా ఇస్తే మంచిదా, రాష్ట్రం మూడుగానో, నాలుగ్గానో విడిపోతే మంచిదా—అన్న విషయం పక్కన పెడితే, అసలు గొడవంతా ఈ ‘లంగా’ వాదులతోనే వస్తోంది…..యెప్పుడు వచ్చినా! అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, ఓ (దుర్)రాజ(కీయ) శేఖర రెడ్డి ప్రవేశిస్తాడు. తెలంగాణా మంత్రులూ, ఎంపీలతో సంతకాలు పెట్టించి, ప్రత్యేక తెలంగాణా కావాలని అధిష్టానానికి పంపిస్తాడు. వాడి వ్యక్తిగత కారణాలతో వేరే కుంపటి పెట్టుకున్న కేసీఆర్ ని రెచ్చగొట్టి, పొత్తు పెట్టుకొని, యెన్నికల్లో గెలిచి, తెప్ప తగలేసి, ‘యేకాభిప్రాయం’…….ఇంకా మాట్లాడితే 6 కోట్ల మంది యేకాభిప్రాయం’ అన్నాడు. ఇప్పుడు మూడు ప్రాంతాలూ ఆరు యెడారులుగా మారతాయని హెచ్చరిస్తున్నాడు! నాయకుల మీద చెప్పులు వేయించిందీ, ముఖ్య మంత్రిని దించడానికి హైదరాబులో మత కలహాలు రేపిందీ యెవరూ—అన్నది ‘వేయి రామ మాడల’ ప్రశ్న! ఓ పక్కన అసలు తెలంగాణా ‘ఉద్యమం’ యేదీ? హోల్ ఆంధ్రాయే కాదు—భారద్దేశం మొత్తంలో—ఇంకా మాట్లాడితే ప్రపంచంలో యే ఉద్యమం నడిచినా, దానికి వెన్నెముక—యువతరం! అంటే విద్యార్ధులతో, మహిళలతో కలుపుకుని! శ్రీలంకలో ఎల్ టీ టీ యీ ఈ రోజు మట్టి కరుస్తోందంటే కారణం—యువత వికర్షితులు అవడంవల్లే! యెందుకు జరుగుతోందిలా? యువతమాట—‘పెద్దవాళ్ళున్నారుగా…..చూసుకోడానికి!’ అని. ఇంకా—నేనూ, నా ర్యాంక్, నా కెరీర్, నా పెళ్ళీ, నా ఇల్లూ, నా పిల్లలూ, భవిష్యత్తూ, వీటన్నింటి తరవాత……..తరవాతే……ఇంకేదైనా! అందుకే రాజ్యమేలుతున్నది—డెభ్భై యేళ్ళూ, ఎనభై యేళ్ళూ దాటిన వాళ్ళూ. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అన్నట్టు, ఈ లంగా గాళ్ళని ఓ పట్టు పట్టాలంటే కావలసినది……. “పావన నవజీవన బృందావన నిర్మాతలు” కదా!
సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
9 comments:
1948 లో నిజాముకు , వాడి తాబెదార్లైన దొరలకూ , రాజాకార్లకూ వ్యతిరేకంగా తెలంగాణా వీరోచిత సాయుధ పోరాటం చేసింది. వేలాది మంది తెలంగాణా యోధులు ఆ పోరాటం లో అమరులయ్యారు. ఆ పోరాటాన్ని రివిజనిస్టులు, కాంగ్రేసు సేనలు కలసి కాల రాసాయి.
1969 లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపింది. అందులో 360 మంది పోలీస్లు కాల్పుల్లో అసువులు బాసారు. ఇరు ప్రాంతాల దగుల్బాజీ కాంగ్రెస్ నేతలు ఆ ఉద్యమాన్నీ అణిచి వేసారు.
ఇప్పుడు ఇక్కడి జనం ఎవ్వరినీ పూర్తిగా నమ్మడం లేదు.
అట్లా అని వారి ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ఏమాత్రం బలహీన పడలేదు. అందుకు సాక్ష్యమే తెలుగు దేశం , ప్రజా రాజ్యం , బీ జే పీ , సి పీ ఐ .... అన్ని పార్టీలూ తెలంగాణా వాదానికి జై కొట్టడం
ఇప్పటికీ ఇంకా ఎట్లాగైనా ఈ వాదాన్ని వాడుకుంటూనే దీన్ని కాల రాయాలని కాంగ్రెస్స్ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
నీటికీ నిజాయితీకి మారుపేరైన రాజసేఖరుదేమో హైదరాబాదులో ఆంధ్ర రాయలసీమ వాసులంతా విదేశీయులుగా బతకాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త . కే సి ఆర్ మనల్ని అక్కడ బతక నివ్వడు అని అమాయకంగా వాపోతుంటాడు.
అదే సమయంలో లాంకో రాజ గోపాలేమో హైదరాబాద్ కే సి ఆర్ అయ్య జాగీరా వాడి పప్పులు మనదగ్గర వుదకవు అంటూ హూంకరిస్తుంటాడు.
నీతి మాలిన రాజకీయాలు సరే మీ బోటి తటస్థ మేధావులు కూడా
వాళ్ళని ఒక పక్క అసహ్యించు కుంటూనే తెలంగాణా వాదం లో లంగా లని వెతకడం ఏమీ బాగాలేదు.
ప్రతీ వోటు ఎంత విలువైనదో ప్రతి అభిప్రాయం ప్రతి మాట అంత విలువైనదే .... ముఖ్యం గా ప్రజా ఉద్యమాల విషయంలో ...
1956 కి ముందులాగా మనం విడి విడి గా రెండు రాష్ట్రాలుగా వున్నంత మాత్రాన సామాన్య జనానికి కలిగే కష్టనష్టాలు ఏమీ వుండవు. ప్రజల సొమ్ము దిగమింగి .... హైదరాబాద్ చుట్టూ కబ్జాలు చేసి తెగ బలసిన నయా దొరలకే ఎ నష్టమైనా జరిగేది .
జై తెలంగాణా
ఏ విషయాన్ని అయినా ప్రశాంతంగా, నిర్మ'లంగా' ఆలోచించాలి. ఆవేశ పడి పోకూడదు.
ప్రత్యేక తెలంగాణా వళ్ళ వచ్చే లాభం ఎంటో ఇంత వరకు నాకు అర్థం కాలేదు. కే.సీ.ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం లాభం అని మీరంటే ఇంక నేను చెప్పేది ఏముంది? ఆంధ్ర రాష్ట్రాన్ని మూడూ గా క్షమించాలి నాలుగు గా (హైదరబాదు కేంద్ర ప్రభుత్వ పరిపాలిత ప్రాంతం ఔతుంది) విభజించినా రాజకీయనాయకులు వాళ్ళే ఉంటారు కద.. 1969 లో ఉద్యమం శ్రీ శ్రీ శ్రీ మర్రి చెన్నా రెడ్డి స్వార్థానికే రెచ్చగొట్టాడు అని చాలా మంది భావిస్తారు. ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టి వేరు కాపురం పెట్టడం తో ఒరిగేది ఏమి లేదనే నా అభిప్రాయం. యే ముఖ్యమంత్రి వచ్చినా (ప్రకాశం పంతులని మినహాయిద్దం) మిగిలిన వళ్ళు ఎవ్వరు యే ప్రాంతాన్ని అభివృద్ది పరచలేదు. రాయలసీమ ఇంకా అలనే 1700 సతాబ్ధం లో ఉండిపోయింది. ప్రజలని దోచుకు తినే నాయకులే తప్ప ప్రజలకోసం ఎమైఅన్ చెద్దం అని భావించేవారే తక్కువ. అలాంటిది తెలంగాణా వస్తె వాటి నయకులు రెచ్చిపోయి అభివృద్ది చేస్తరని మీ నమ్మకమా?
చంపే ముందు పిచ్చి కుక్క అని పేరు పెట్టు అన్నాడు తెల్లోడు.
అట్లాగే ఏ ఉద్యమాన్నైనా, ఏ ప్రజా డిమాండ్ నైనా అణిచేందుకు గందరగోళం సృష్టించు అంటాడు నల్లోడు.
అందుకే తెలంగాణా డిమాండ్ రాగానే ...
రాయల సీమ , హైదరాబాద్ అనే కృత్రిమ , కుట్ర పూరిత డిమాండ్ లను, ముస్లింలకు భద్రత వుండదు, ఆంద్ర రాయలసీమ వాళ్ళంతా హైదరాబాద్ లో విదేశీయుల్లా వుండాల్సి వస్తుంది అనే గోబెల్ ప్రచారాలు ముందుకు వస్తున్నాయి.
1956 కు ముందు ఆంధ్ర రాయల సీమ కలసి ఆంధ్ర రాష్ట్రం గా , హైదరాబాద్ ఇతర తెలంగాణా జిల్లాలు కలసి హైదరాబాద్ రాష్ట్రం గా వుండేవి .
ఆ రెండు రాష్ట్రాలను బలవంతం గా కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పరిచారు.
వాటిని విడదీస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు
ఈ రాయలసీమ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చింది , హైదరాబాద్ కేంద్ర ప్రాంతం ఏమిటి?
తమిళనాడు నుంచి ఆంద్ర విడిపోయినప్పుడు మద్రాస్ ను కేంద్ర ప్రాంతం గా చేసారా?
మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు బొంబాయిని కేంద్ర ప్రాంతం గా చేసారా?
తెలంగాణా రాగానే ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ది జరుగుతుందని ఎవరూ భావించడం లేదు.
నీళ్ళు, ఉద్యోగాలు మొదలైన వాటిలో జరుగుతున్నా అన్యాయం మాత్రం కచ్చితంగా ఆగిపోతుంది.
తెలంగాణా ఇక్కడి ప్రజల ఆత్మాభిమాన సమస్య.
ఆ మాట కొస్తే ఆంధ్ర మాత్రం తమిళనాడు నుంచి ఎందుకు విడిపోవాలని పోరాడింది?
ఇది కే సి ఆర్ ఒక్కడి సమస్య కానే కాదు.
అతడిని మేనేజ్ చేసినంత మాత్రాన ఇది ఆగిపోదు.
ఈ సమస్యను ఇంకా సాగ దీయకుండా
ఆంధ్ర తెలంగాణా లు సామరస్యంగా విడిపోయేందుకు అందరూ తమవంతు కృషి చేస్తే అందరికీ మంచిది.
మరి అంతక ముందు అంటే నీజాం రాక పూర్వం శ్రీ కృష్ణ దేవరాయా టైం లో, రుద్రమ్మ టైంలో వందల వందల సంవత్సరాలు ఇప్పటి తెలంగాణా, కోస్త ప్రాంతాలు కలిసి లేవా? అప్పుడు సామరస్యంగా ప్రజలు లేరా? అప్పుడు మరి "ఆత్మాభిమానాం" ఏమైంది? ఇవ్వన్ని విడిపోయేదానికి చెప్పే reasons అంతే. ఒక మనిషితో కలిసి ఉండకూడదు అనుకున్నప్పుడు ఎప్పుడూ ఆ ఎడుతి వాళ్ళలో ని తప్పులే, ఉన్న కల్పితంవైన అవే కనిపిస్తాయి. ఇదే అంతే.
మద్రాస్ రాష్ట్రానికి ఇప్పటి ఆంధ్ర రాష్ట్రానికి మీ ఉద్దేశం లో ఏతువంటీ తేడా లేదా? అరవానికి తెలుగు కి ఉన్నంత తేడ.
నిజమే ....
కాకతీయ రుద్రమ దేవి పెళ్లి చేసుకున్నది నిడదవోలు వ్యక్తిని.
దేశ భాష లందు తెలుగు లెస్స అని చాటిన శ్రీ కృష్ణ దేవరాయలు కన్నడ వ్యక్తి.
చెన్నై ఏర్పడింది, అలనాడు చెన్నయ్ ప్రాంతాన్ని పాలించిన తెలుగు రాజు చెన్నడి పేరు మీద (చెన్న పట్నం).
ఒకప్పుడు ....
పాకిస్తాన్ ఏం ఖర్మ ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, బర్మా, బాంగ్లా దేశ్, శ్రీలంక , కాంబోడియా అన్నీ
భారత దేశం లో అంతర్భాగం గా వుండేవి.
ఇప్పుడవన్నీ అనుకుని ఏం లాభం ?
గతజల సేతు బంధనం !!
ఆంధ్ర తెలంగాణా విడిపోతేనే అలనాటి ఆత్మీయతలు , అనుబంధాలు మళ్లీ చిగురిస్తాయి.
డియర్ కృష్ణారావ్!
చాలా సంతోషం!
ఇంతకీ 'నిర్మలంగా' అలోచించాలన్నది నన్నా?
షషాంక్ & ప్రతాప్ లనా?
నేను వ్రాసిందాంట్లో ఆవేశం కనిపించిందా?
యేమైనా ధన్యవాదాలు!
డియర్ ప్రతాప్!
మీ చర్చకి చాలా సంతోషం!
ఇంతకీ మీరు తెలంగాణా వాళ్ళయితే, 'తెలంగాణా వాదం' లో 'లంగా' లని వెతకడం అనే ప్రసక్తి రాకూడదే!
తెలంగాణా లో 'లంగా గాళ్ళు ' అని జిత్తులమారి (కన్నింగ్) వాళ్ళని అంటారు అని మరిచి పోయారా?
ఇక నేను ముందే వ్రాశాను--కలిసుండడం, విడిపోవడం లో లాభ నష్టాలని పక్కన పెట్టి--అని!
నా పాయింటు అల్లా, ఉద్యమం యెందుకు విస్తరించలేదు అని! అందుకు విద్యార్థులూ, యువతే కారణం అని!
పాపం కేసీఆర్ కాలేజీల్లో మీటింగులు పెట్టి విద్యార్థుల మద్దతు కోరితే, ఆయన ఆటోగ్రాఫులు తీసుకున్నారు గానీ, కాలేజీలు వదిలి ఉద్యమం లోకి రాలేదు కదా?
యేమైనా ధన్యవాదాలు!
Dear Shashank!
మీ చర్చకి చాలా సంతోషం!
ప్రతాప్ చూశారా! మీరు చెప్పిన వాటిని కాదనకుండానే, విడిపోతేనే ఆత్మీయతలు చిగురిస్తాయి అంటున్నాడు!
మీరొప్పుకుంటారా?
యేమైనా మీకు నా ధన్యవాదాలు!
Post a Comment