Friday, September 4, 2009

హేతువాదం…..


హేతువాదులు-11


కళ్యాణాలు : --  


కళ్యాణ చక్రవర్తి అని పేరున్న శ్రీ వేఙ్కటేశ్వరుడు--నిత్య పెళ్ళికొడుకు--ప్రతిరోజూ కళ్యాణాలు జరుగుతూనే వుంటాయి--కళ్యాణం జరిపించినవారికి మంచి జరుగుతుందని ఓ నమ్మకం!  


ఇక శ్రీ రాముడికి ప్రతీ శ్రీరామనవమకీ కళ్యాణం జరిపిస్తారు. అన్నవరం సత్యదేవుడికీ, సిం హాద్రి అప్పన్నకీ, ఇలా వైష్ణవాలయాలన్నింటిలో శ్రీవారికి ఆయా ముహూర్తాలకి కళ్యాణాలు జరుగుతూంటాయి.  


ఇక ఇప్పుడు శివుడికీ, గణపతికీ, ఆంజనేయుడికీ, గరుత్మంతుడికీ కూడా కళ్యాణాలు జరిపిస్తున్నారనుకోండి.  


మా చిన్నప్పటి నించీ, భద్రాద్రిలో శ్రీరాముడికి ప్రతీ యేటా జరిగే కళ్యాణాన్ని--అప్పట్లో టీవీలు లేవుకాబట్టి రేడియో లో ప్రసారమయ్యే, మహామహులు చేసే ప్రత్యక్ష వ్యాఖ్యానాలని వినడం, టీవీలు వచ్చాక, చూడడం యే సంవత్సరం మానలేదు!  


సీతమ్మవారికి స్వామి మంగళసూత్ర ధారణ చేసే సమయం లో మామూలుగానే 'మాంగల్యం తంతునానేన, మమ జీవన హేతునాం, కంఠే బధ్నామి, సుభగే--త్వంజీవ శరదాం శతం!' అనే చదివేవారు!  


తరవాత్తరవాత '..............శరదశ్శతం!' అని మారిపోయింది--దానికీ దీనికీ తేడా వుందో లేదో నాకు తెలియదు.  


ఇంక యెప్పుడు ప్రవేశపెట్టారో '........లోక కళ్యాణ హేతవే' అని మార్చారు--మమ జీవన హేతునాం స్థానం లో!  


ఇంకా తరవాత, నేను చూసిన ఆఖరి ప్రత్యక్ష ప్రసారం లో, '.........త్రైలోక్యం మంగళం కురు ' అని మార్చారు--త్వంజీవ శరదాం శతం కు బదులుగా! అలా చదివి, పక్కనున్న అర్చక స్వామి వంక చూసేసరికి, ఆయనకూడా, 'అవును--త్రైలోక్యం మంగళం కురు '. అన్నాడు.  


ఇక టీవీలు వచ్చాక, తలంబ్రాలు అయ్యాక, ఇద్దరు అర్చక స్వాములు ఓ కొబ్బరి కాయ తీసుకొని, వేదిక మీద యెదురుబదురుగా కూర్చొని, ఒకళ్ళవేపు ఒకళ్ళు దాన్ని దొర్లిస్తూండడం, దానికి వ్యాఖ్యాతలు 'స్వామివారూ, అమ్మవారూ బంతులాట ఆడుతున్నారు--తిలకించండి ' అని చెపుతున్నారు!  


గత కొన్నేళ్ళుగా ఇవన్నీ చూడడం మానేశాను! (వాటిని ఆపలేం కదా మరి?)  


ఇవన్నీ యెందుకు? జనం లో మూర్ఖత్వాన్ని పెంచడానికా?  


మా చిన్నప్పుడు, కాస్త కలిగినవాళ్ళ ఇళ్ళల్లో పిల్లల పుట్టిన రోజులకి కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళకి నమస్కరించి, ఫోటో స్టూడియోలకి పరిగెత్తేవారు!  


ఇప్పుడు మన సినిమాలు--హీరోయిన్ హీరోతో ప్రేమలో పడడానికి వీలుగా--'పుట్టినరోజు కదా, అలా గుడికి వెళ్ళిరామ్మా' అని ఆమె తల్లి డైలాగు! ఇది అందరికీ నేర్పించింది--పుట్టినరోజు గుడికి వెళ్ళడం!  


గ్రహణాలు వచ్చినప్పుడు, ఆలయాలని మూసెయ్యడం--హేతువాద సంఘాలవాళ్ళు--దేవాలయాలన్నీ తెరిచి వుంచండి, యేమీ కాదు అనడం!  


అసలు గ్రహణాలు 'రాహు కేతువుల ' వల్ల యేర్పడతాయని నమ్మితే, వాటిని 'అమృతం తాగుతున్న ' రాక్షసుణ్ణి మెడ నరికి గ్రహాలుగా యేర్పాటు చేసింది శ్రీ మహావిష్ణువేకదా? ఇక వాడికి వాళ్ళంటే భయం యెందుకు?  


సూర్య కిరణాలు నేరుగా మూలబేరం దగ్గరకి చేరే అవకాశం వున్న ఆలయాలని ఆ సమయం లో మూసేసి, గ్రహణం విడిచాక--సంప్రోక్షణ చేసి, మళ్ళీ దర్శనానికి అనుమతిస్తారు! యెందుకంటే, గ్రహణ సమయం లో కొన్ని జీవ, రసాయన క్రియల్లో మార్పులు చోటు చేసుకుంటాయి--వాటివల్ల భక్తులకి చెడు జరగకుండా ఈ ఆచారం ప్రవేశపెట్టారు!  


ఇక గ్రహణం విడవగానే, కొబ్బరికాయలు పట్టుకెళ్ళి--లైన్లో మూసివున్న గుడి తలుపులముందు గబగబా పగులకొట్టడం కూడా యెక్కువైపోయింది ఈ మధ్య--ఇదెవరు ప్రవేశపెట్టారో!  


ఇక గుడిముందునించి సైకిలుమీదో, మోటర్ సైకిలుమీదో వెళుతూ, చేతిని గుండెలమీదో, పొట్టమీదో వేసుకొని, గుడివంకే చూస్తూ--ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది, రోడ్డుమీదే చెప్పులు విడిచేసి, అదేదో సినిమాలో బ్రహ్మానందం లా చప్పట్లు చరుస్తూ, అరచేతులు ముద్దులు పెట్టుకుంటూ మళ్ళీ వాటిని కళ్ళకి తాకించుకుంటూ, రకరకాల భంగిమల్లో భక్తిని అనుభవిస్తున్నారు!  


ఒక్కసారి ఆలోచించండి--ఇవన్నీ అవసరమా? యెందుకు?



8 comments:

Anonymous said...

*అసలు గ్రహణాలు 'రాహు కేతువుల ' వల్ల యేర్పడతాయని నమ్మితే, వాటిని 'అమృతం తాగుతున్న ' రాక్షసుణ్ణి మెడ నరికి గ్రహాలుగా యేర్పాటు చేసింది శ్రీ మహావిష్ణువేకదా? ఇక వాడికి వాళ్ళంటే భయం యెందుకు?*
మీరు రోజు ఇలా ఒక టపా రాస్తారే అసలికి మీకు ఇంట్లో టైం ఎలా దోరుకుతుంది. మీకు ఎక్కడైనా మహావిష్ణువు ఈ 50 సం || కాలం లో కనిపించాడా? ఒక్కసారి ఆలోచించండి--ఇవన్నీ అవసరమా? యెందుకు? అసలికి ఆలోచించ వలసింది మీరు ఈ వయసులో హాయి గా , సరదాగా గడపకుండా 5వ తరగతి పిల్లలా ప్రశ్నలు వేస్తూ జీవితం లో జీవించటం మానేశారు మీరు. మీ ఆవిడ ఎంతో భాద పడుతూ ఉంటుంది మీకు చెప్పలేక. ఈ పిచ్చి హేతువాదం గురించి రోజుకొక టపా రాస్తు జీవితాన్ని గందరగోళం చేసుకుంట్టున్నారు. గన్నయ అయితే బాగా మార్కేటింగ్ చేసుకోని అమేరికా లో కూడా సన్మానం చేయించు కొచ్చాడు. మీరు చూడబొతే బ్రహ్మ్మలా ఉన్నారు మీరు ఎంత హేతువాదం గురించి రాసినా అమేరికా లో మీకు ఎవ్వరు సన్మానం చేయరు . అక్కడ ఒక వర్గానికి చెందిన వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఆంధ్రా లో హెతువాదులు బ్లగులో తమ రాతలు రాసి గులానoదం తీర్చుకోవటం తప్ప మీ గురించి ప్రజలు ఎప్పుడో మరచి పోయారు. ఇందుమూలం గాతెలియ చేయునది ఏమనగా మీరు హేతువాదం రాయటం మాని హాయిగా పెళ్ళం నమవలతో కాలక్షెపం చేయండి.
ఒక మేధావి రాజ్యాదికారం కొరకు మీరు చదివిన పుస్తకాల పై రీసర్చ్ చేసి చాలా విషయాలు బట్ట బయలు చేసాడు అని ఆయన ప్రస్తుత అనుచరులు ఇప్పటికి ఆయన అడుగుజాడలలో నడుస్తు నేను హిందువు నేందుకు అవుతా అని రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు . మీ కు అలాంటి ఉదేశం ఉంటె
go ahead.

Krishna K said...

Dummy గారు, మీరు ఏదో ఆవేశం లో కామెంట్ వ్రాసినట్లున్నారు. క్రిష్ణశ్రీ గారు మూఢ నమ్మకాలు వద్దు అంటున్నారు కాని, దేముణ్ని నమ్మవద్దు అని ఎక్కడా చెబ్తున్నట్లు నాకు అనిపించటం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. దేముడు ఉన్నాడు అన్నా, లేడంటే లేడు అన్నా, రెంటికి పునాది నమ్మకమే. కాదంటరా?

ఇక మంత్రాలు మార్చటం అదీ ఏమాత్రం ఆలోచించకుండా మంచిదేనంటారా? మంత్రాల మీద కాస్తో కూస్తో నమ్మకమున్న వారుగా వాటిని ఇష్టం వచ్చినట్లు చదవటం మంచిదేనంటారా? ఆ విషయమే నేను చాలా సార్లు అనుకొనేవాడిని, దానిగురించి క్రిష్ణశ్రీ గారు గాయత్రి మంత్రం మీద వ్రాసిన టపా చదవండి. ఈ మధ్యకాలం లో నావరకు నేను చదివిన టపాలలో చాలా చాలా నచ్చిన టపా అది. ఎంత balanced గా వ్రాసారో ఓ సారి చదివి చూడండి.

మీరనే కుందేలుకు ఒక కాలే అనే మేతావులు, నేను హిందువెందుకు కాదు అనుకొనే తోలు మందపు, మంద మతుల జాబితాలో మాత్రం దయచేసి కాస్త లాజికల్ గా వ్రాస్తున్న ఈ బ్లాగ్ స్వంతదారుని ఆడిపోసుకోకండి. అలా ఆడి పోసుకొంటే ఆ మందమతులకు మనకు తేడా లేకుండా పోతుంది.

పునర్వసు said...

పెళ్ళిళ్ళ లోను, పూజల లోను, చదివేవి మంత్రాలు కావు. అవి సంస్కృతంలో దేవుని కీర్తించే మాటలు మాత్రమే. మంత్రలనేవి వేరేగా ఉంటాయి. దేవుని కీర్తించడానికి పరిమితులేవీ ఉండవు. అవి మారుతూ ఉండొచ్చు.

పుట్టిన ప్రతివాడు జ్ఞానన్వేషి కావాలి. జ్ఞానన్వేషణకు భగవంతుడు ఒక పరమావధి (గోల్). మనము భగవంతుని దిశగా ఎదగాలి. కానీ అందరు భగవంతుని మన స్థాయికి దిగాలగుతున్నారు. మనము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము కాబట్టి, దేవుళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, పుట్టిన రోజులు చేయాలి వగైరా, వగైరా..

వ్యసనాలకు ఖర్చు పెట్టే ధనము, కాలము దేవునికై ఖర్చు పెట్టడం మంచి ఖర్చౌతుంది. దేవుని సాటి మనినిషిలో చూడడం భక్తియొక్క పరమావధి.

పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేని వారికి, ధన సహాయము చేయడము, మంగళసూత్రాలు ఇవ్వడము చేస్తుంటారు కొందరు పుణ్యం కోసము. అలాగే దేవుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తుంటారు ఇన్కొందరు పుణ్యంకోసము.
మానవత్వము లేని దైవ భక్తి గాని, హేతువాదము గాని ఒకటే (ఉపయోగము లేనివి).

A K Sastry said...

డియర్ Dummy!

వోరి డమ్మీ! నీవేమి వ్రాసినావో మరొకసారి చదువుకొమ్ము!

నేను నా జీవితం 'హాయిగా'నే గడుపుతున్నానుకాబట్టే, రోజుకో రెండుగంటలు నా బ్లాగులు వ్రాయడానికి కేటాయిస్తున్నాను!

'అమెరికాలో సన్మానం' గొడవేమిటో నాకు తెలియదు!

'ఒక మేధావి రాజ్యాధికారం...............' మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తోందా?

నేను వ్రాసిన విషయాలకి మీకు తోచితే సమాధానం వ్రాయండి....అంతేగానీ, నోరు పారేసుకోవద్దు!

మీకు బ్లాగులు చదవడానికీ, కామెంట్లు వ్రాయడానికీ సమయం వుంటుంది గానీ (మీ వయసులో) నాకు బ్లాగు వ్రాయడానికి సమయం వుండదా--నా వయసులో?

(మీ భార్యా బిడ్డల్ని దేవుడు చల్లగా చూడుగాక!)

A K Sastry said...

డియర్ Krishna!

చాలా సంతోషం! 'బ్యాలెన్స్ డ్' గా అలోచిస్తున్నందుకూ, అలాగే వ్రాస్తున్నందుకూ!

'తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు!'--ప్రయత్నిస్తే, 'చేరి మూర్ఖుల మనసు రంజింపచేయ '--వచ్చూ!

ప్రయత్నిద్దాం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ పునర్వసు!

ఆహా!

'.......మంత్రాలు కావు...........మాటలు మాత్రమే......వేరేగావుంటాయి '...........వుండవు........వుండొచ్చు!

"యెవరు చెప్పారు మీకివి?"

'మనము పెళ్ళిళ్ళు.........వగైరా, వగైరా....'.....యెందుకు?

'.......పుణ్యం కోసము.' 'మంగళసూత్రాలు ఇవ్వడమే', (పసుపుకొమ్ములు ఇవ్వచ్చుగా?) 'దేవుడి పెళ్ళిళ్ళు చెయ్యడమే'--పుణ్యమా?

మానవత్వం అంటే యేమిటి? ఇదా భక్తి?

ధన్యవాదాలు!

పునర్వసు said...

శ్రీయుత కృష్ణ శ్రీ గారు,
నేను వ్రాసినది మీకు అర్థం కాలేదు అనేకంటే, నేను మీకు అర్థం అయ్యేటట్లు చెప్పలేదు అనుకుంటాను.
>>'.......పుణ్యం కోసము.' 'మంగళసూత్రాలు ఇవ్వడమే', (పసుపుకొమ్ములు ఇవ్వచ్చుగా?) 'దేవుడి పెళ్ళిళ్ళు చెయ్యడమే'--పుణ్యమా?

దేవుని పెళ్ళిళ్ళు చేయటం కంటే, సాటి మనిషి పెళ్ళికి సాయం చేయడం ఉత్తమం అంటాను.

మీ లాజిక్ నే కొంచెం పొడిగిస్తే, అసలు పసుపు కొమ్ము మాత్రం ఎందుకు?
ఇంటికి ఎవరైనా వస్తే, తమకు ఉన్నంతలో మంచి కప్పులో, మంచి కాఫీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది వచ్చినవారి పట్ల గౌరవం చూపించడం, తమ హోదాను వ్యక్త పరచుకోవడం.
అలాగే స్థోమత లేని వారు పసుపు కొమ్ములు కట్టుకుంటే (ఇస్తే), స్థోమత ఉన్నవారు బంగారం వేసుకుంటారు (ఇస్తారు).

>>'.......మంత్రాలు కావు...........మాటలు మాత్రమే......వేరేగావుంటాయి '...........వుండవు........వుండొచ్చు! "యెవరు చెప్పారు మీకివి?"
మీకు ఎవరు చెప్పారు మీరు వ్రాసినవన్నీ?
మీరు మంత్రాలని అనుకుంటున్న సంస్కృత పదాలకు నాకు అర్థం తెలుసు. కానీ మీకు వివరించెంత పాండిత్యం నాకు లేదు. త్యరలో తెలుసుకుని వివరంగా వ్రాస్తాను.

>>మానవత్వం అంటే యేమిటి? ఇదా భక్తి?

గుళ్ళో కొబ్బరికాయ కొట్టే బదులు ఆ డబ్బులు ఆకలిగొన్న వాని ఆకలి తీర్చడానికి ఉపయోగ పెట్టడం మానవత్వమంటాను. (ఇంకా వివరంగా తెలుపడానికి ప్రయత్నిస్తాను).

భక్తి అని చెప్పడానికి మీ స్టాండర్డ్ ఏమిటో నాకు తెలియదు. దేవునికి కళ్యాణం చేయడం కూడా ఒక రకమైన భక్తి, కాని అది ఉత్తమమైన భక్తి మాత్రం కాదు.

kodali srinivas said...

డియర్ కృష్నశ్రీ
మీ ఆస్తిక హేతువాదం ఆస్తికులకు నచ్చేలా లేదే !
నిద్రించే మనసును తట్టి లేపే విషయాలు ఇలానే ఉంటాయి. మీ కృషిని కొనసాగించండి.