Tuesday, February 2, 2010

జాతీయ (వగైరా) గీతాలు!

జనగణమన

జాన్ ఎఫ్ కెన్నెడీ, అదేదో మీటింగులో సీరియస్ గా ఇతరులతో మాట్లాడుతూండగా, అకస్మాత్తుగా లేచి అటెన్షన్ లో నిలబడి కొంతసేపు వుండిపోయాడట--మిగిలినవాళ్ళు కూడా ఆయన్ని అనుసరించగా! తరవాత ఆ సమావేశాం మామూలుగా కొనసాగిందట!

దీనికి కారణమేమి అని ఆరా తీస్తే, పక్కనెక్కడో వున్న స్కూల్లో వాళ్ళ జాతీయ గీతాన్ని పాడారట పిల్లలు!

ఈ సంఘటనని మళ్ళీ మళ్ళీ మాకు మా స్కూలు అసెంబ్లీలో వినిపించేవారు--మా హెడ్మాష్టారు!

యెప్పుడైనా మా స్కూలు గ్రామఫోను రిపేరుకి వస్తే, మా 'డబల్ జీరో' మేష్టారు దాన్ని టెస్ట్ చెయ్యడానికి, పొరపాటున 'జనగణమన ' రికార్డు వేస్తుంటే, మా క్లాసుల్లో టీచర్లూ, విద్యార్థులూ అందరూ పాఠాలు మానేసి లేచి నిలబడి అటెన్షన్ లో నిలబడడం, మధ్యలో ఆ గీతం ఆగి పోగానే కూర్చోవడం, మళ్ళీ మొదలవగానే అటెన్షన్ లో నిలబడడం--ఈ మధ్యలో మా హెడ్మాష్టారు వెళ్ళి, 'అది తీసేసి వేరే రికార్దు పెట్టరా' అని ఆ మేష్టార్ని తిట్టడం--ఇవన్నీ మధుర స్మృతులు!

సినిమా హాళ్ళలో చిత్రం పూర్తవగానే జాతీయగీతం వేసేవారు--పరువు దక్కించుకోడానికి కోర్టులు వద్దనేదాకా!

శ్రీ గజేంద్ర గఢ్కర్ ప్రవేశ పెట్టిన 'ప్రతిఙ్ఞ ' ప్రతీ పాఠ్య పుస్తకం లో వుండేది, ప్రతీ స్కూల్లో అసెంబ్లీ లో ఖచ్చితం గా చదివేవారు--'భారతదేశము నా మాతృభూమి--భారతీయులందరూ నా సహోదరులు..........' ఇలా సాగేది ఆ 'ప్రార్థన '!

ఇవన్నీ 'ఇందిరమ్మ ' తన రాజ్యాంగ సవరణ ద్వారా 'మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యాంగం' అనకుండా 'సర్వమత సమభావనగల రాజ్యంగం' అని యిరికించగానే, చంకనాకిపోయాయి! యెందుకో యెవరూ పట్టించుకోలేదు!

ఇప్పుడు మన దేశ భక్తి యెలా యేడుస్తోందంటే, దేశ భక్తి గీతాలంటూ పాడడం యెప్పుడో మానేశాం. ఇక రాష్ట్రగీతం అనదగ్గ 'మా తెలుగు తల్లికి ' పాడడం మానేశాం--పైగా, కే సీ ఆర్, 'యెవరికి తల్లి? యెక్కడి తెలుగు తల్లి?' అంటూ యేదేదో పేలాడు! (మళ్ళీ తెలంగాణా తల్లి అంటూ విగ్రహం చేయించాడు!--అది యెవడి తల్లో!)

మరి మన తెలుగువాళ్ళు వీడిని 'తెలుగు మాట్లాడితే నాలుక కోస్తాం!' అని యెందుకు హెచ్చరించలేదో తెలియదు. ప్రస్తుతం వాడు మాట్లాడే భాష యేమిటో మరి! (ఖచ్చితం గా పాకీ భాష కాదు!) (నేనెవర్నీ కులం పేరుతో దూషించడం లేదండోయ్!)

ఇక జాతీయ గీతాల విషయానికొస్తే, వందే మాతరం పాడకూడదని మన హోం మంత్రి సమక్షంలోనే ఫత్వా ఇచ్చేవాళ్ళున్న దేశం మనది.

ఇక మిగిలినది--జనగణమన.

అది వ్రాయబడ్డప్పుడు, పాడబడ్డప్పుడు వివాదాలకి అతీతం కాకపోయినా, ఇప్పుడు యే వివాదాలూ లేని గీతం ఇది.

మరిప్పుడు, దీన్ని కూడా భ్రష్టుపట్టించడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు--మన రాజకీయులు!

మొన్న ఈ గీతం జయంతో యేదో జరిపించి, కాలేజి పిల్లల్ని యెండలో గ్రవుండులో నిలబెట్టి జాతీయగీతం పాడించారు--రాజకీయులు స్టేజి మీద నీడలో నిలబడి (వీళ్ళలో పురం'ధ 'రేశ్వరి కూడా వున్నారు!)!

టీవీల్లో లైవ్ లూ, రిపీట్ లూ, దుమ్మెత్తించారు!

కానీ, ఆ రాజకీయుల భంగిమల్ని గమనించారా?

ప్రపంచం లో యే రెండువాచీలూ ఒకే టైము చూపించవంటారు!  యేదైనా మిలటరీనో, గూఢచారి ఆపరేషన్ అయినా, అందరూ 'సింక్రనైజ్ అవర్ వాచెస్ ' అని ఒకేసారి, ఒకే టైము అందరూ--సెకెండ్లతో సహా పెట్టుకున్నా, యెక్కడో తేడాలు వస్తూ వుంటాయి! ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసులు కూడా వున్నాయి!

అలా, ఆ స్టేజి మీద వున్న రాజకీయులు--ఒకడు చేతులు కట్టుకొనీ, ఒకడు చేతులు ముందు 'ప్రార్థనా స్థాన్ ' లో పెట్టుకొనీ, ఒకడు వెనకాల పెట్టుకొనీ, ఒకడు పొట్ట ముందు పెట్టి, తలెగరేస్తూనూ, కాళ్ళు జాచుకొని కొంతమందీ, కాళ్ళతో తాళం వేస్తూ కొంతమందీ, ఆడాళ్ళు మూతికి అరచెయ్యి అడ్డు పెట్టుకొనీ, మధ్యలో కొంగుని నిండుగా కప్పుకొంటూ--ఇలా రకరకాల భంగిమల్లో--"ఆ గీతాన్ని భ్రష్టు పట్టించడమే మా ధ్యేయం" అన్నట్టు నిలబడ్డారు!


బై ది వే, ఇలాంటి వాళ్ళకి 'సూ మోటో' గా, సుప్రీం కోర్టు, 'అదే భంగిమలో' ఓ రోజంతా నిలబడేలా శిక్ష వేస్తే యెంతబాగుంటుంది?

మీ దేశా భక్తి తగలెయ్యా! ఇలాంటి ప్రదర్శనలు వద్దురా రా(జకీయ)బందులారా!

దేశానికి మిగిలిన ఆ ఒక్క వారసత్వాన్నీ కనీసం మిగల్చండ్రా!

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

బాగా చెప్పారు.

Goutham Navayan said...

ఇక రాష్ట్రగీతం అనదగ్గ 'మా తెలుగు తల్లికి ' పాడడం మానేశాం--పైగా, కే సీ ఆర్, 'యెవరికి తల్లి? యెక్కడి తెలుగు తల్లి?' అంటూ యేదేదో పేలాడు! (మళ్ళీ తెలంగాణా తల్లి అంటూ విగ్రహం చేయించాడు!--అది యెవడి తల్లో!)
మరి మన తెలుగువాళ్ళు వీడిని 'తెలుగు మాట్లాడితే నాలుక కోస్తాం!' అని యెందుకు హెచ్చరించలేదో తెలియదు. ప్రస్తుతం వాడు మాట్లాడే భాష యేమిటో మరి! (ఖచ్చితం గా పాకీ భాష కాదు!) (నేనెవర్నీ కులం పేరుతో దూషించడం లేదండోయ్!)<<<<<<<<<<

అదేదో సినిమాలో " నేను చవటాయిని అంటే ... కాదు నీకంటే నేను పెద్ద చవటాయిని" అని వాదించుకున్నట్టుంది. ...!!
"వాడు" .. "వీడు"... "ఎవడి తల్లి "... "నాలుక కోస్తాం... పాకీ భాష ...కులం పేరు కాదండోయ్" అని పతివ్రతా మాటలు ... వినలేక - చదవలేక చస్తున్నాం.
విజ్ఞత లేని వాదనలు.
మనలోని వెధవాయిత్వాన్ని, అసమర్ధతను ఇంకొకరికి ఆపాదించి మన వీపును మనమే చరచుకునే ఆత్మ వంచనాత్మక మాటలు.
తెలంగాణా వాదం తెరమీదకు వచ్చినప్పుడు మాత్రమే తెలుగు తల్లి ని "బాంకు లాకర్" లోంచి బయటకు తీసే పాలకుల దగుల్భాజీ తనం మీకు కనిపించదు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ...తెలుగు భాషా అంటూ తేనే పూసిన కట్టి లాంటి మాటలతో తెలంగాణాను వంచించడం తప్పితే 53 సంవత్సరాలైనా మన రాష్ట్రం లో తెలుగు ను అధికార భాష గా అమలు చేయలేని తెలుగు పాలకుల అసమర్ధత... మీకు చీమ కుట్టినట్టు అయినా అనిపించదు.
తెలంగాణా- ఆంద్ర వేరు వేరు రాష్ట్రాలు గా అయినప్పుడు తప్ప ఈ దరిద్రం, ఈ ఆత్మ వంచన - పరస్పర వంచన అంతరించదు.
తెలుగు కు పట్టిన మాయదారి హిపో క్రాట్ తెగులు వదలదు.

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

చాలా సంతోషం!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ Goutham!

ముందు మీ ముక్కూ ముఖమూ (ప్రొఫైల్) చూపించండి!

'పాలకుల దగుల్బాజీతనం' అన్నారు బాగుంది!

ఆ పాలకులతోనే చేరి, 'అదుగో తెలంగాణా

వచ్చేస్తోంది' అంటూ జనాలని వంచిస్తూ, ఒకసారి

రాజీనామా, ఇంకోసారి అందరి రాజీనామా, మరోసారి

రాజీనామా, ఇంకోసారి రాజీనామా--చివరికి

లగడపాటి పరిహసించిన 'ఆమరణ దీక్షా'

అని, ఈ రోజు మళ్ళీ 'అదుగో కమిటీ యేర్పడింది'

అంటున్న కే సీ ఆర్ మీకు నాయకుడంటే--మిమ్మల్ని

చూసి జాలి పడతారు--తెలుగు వాళ్ళు!

(భాషా ప్రయుక్త రాష్ట్రాలు యేర్పడినప్పుడు,

మన భాష--'ఆన్ధ్రము'--తెలుగు కాదు!

అందుకే మనది 'ఆన్ధ్ర ప్రదేశ్' అయ్యింది-

-'తెలుగునాడు' కాలేదు!)

మరి 'దరిద్రాలూ' 'వంచనలూ' 'హిపోక్రాట్'

తెగులు యెలా వదలాలో మీరే ఆలోచించండి!

ధన్యవాదాలు!

P.S.:- అసలు విషయం 'జాతీయ.....' గురించి

యేమీ మాట్లాడరేం?

Goutham Navayan said...

ఆలోచనల సంఘర్షణకు ముక్కూ మొహాలతో పనేమిటి మిత్రమా?
బీలో ది బెల్ట్ దెబ్బల మీదేనా మీ ధ్యాసంతా? జాతీయ గీతం గురించి చర్చిస్తూ అనవసరంగా తెలుగు తల్లి , తెలంగాణా తల్లి ప్రస్తావన తెచ్చింది మీరు. తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేసేప్రయత్నం చేసింది మీరు. జాతీయ గీతం గురించి న మీ బాధతో మాకేం విభేదం లేదు.
గొడవల్లా తెలంగాణా గురించే.

"అదిగో తెలంగాణా.." అని కే సి ఆర్ ఏదో అన్నాడని అవేమీ నెరవేరలేదని అవహేళన చేసే ముందు " కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికలలో చేసిన వాగ్దానాలు, పెట్టుకున్న పొత్తులు, సి ఎం పీ తీర్మానాలు, ప్రైం మినిస్టర్, రాష్ట్ర పతి పార్లమెంట్ లో తెలంగాణాపై చేసిన ప్రకటనలు, ప్రణబ్ ముకర్జీ కమిటీ ప్రహసనం, రోశయ్య కమిటీ ప్రహసనం, తెలుగు దేశం తెలంగాణాకు అనుకూలంగా చేసిన తీర్మానం, ప్రజారాజ్యం సామాజిక తెలంగాణా ఉద్ఘాటనలు మొదలైన వాటిని గురించి కూడా నిజాయితీగా ఆలోచిస్తే బాగుండేది. తప్పంతా కే సి ఆర్ డి ఒక్కడిదే కాదు, వీల్లందరిడీ కూడా. అట్లాగే తెలంగాణా అంటే కే సి ఆర్ ఒక్కడే కాదు. తెలంగాణా ప్రజలందరికీ ఆయనొక్కడే ఏకైక నేత కాదు. కే సి ఆర్ ని అడ్డం పెట్టుకుని అస్తమాను అరిగిపోయిన రికార్డు లా తెలంగాణా ఉద్యమం పై బురద చాల్లే ప్రయత్నం చేయకుండా కాస్త న్యాయంగా ఉద్యమం గురించి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.

>>> మన భాష--'ఆన్ధ్రము'--తెలుగు కాదు! అందుకే మనది 'ఆన్ధ్ర ప్రదేశ్' అయ్యింది--'తెలుగునాడు' కాలేదు! <<< అన్నారు.
మరి చక్కగా "ఆంధ్ర తల్లి" అనకుండా "తెలుగు తల్లి" అని ఎందుకన్నారు. అంటా మీ ఇష్టమేనా?
జై ఆంద్ర అంటే ఏమిటి? జై తెలుగు అనా? ఆంధ్ర రాష్ట్రం, సీమాంధ్ర, సమైక్యాంధ్ర ఈ పదాలను కూడా కాస్త వివరించి చెబుదురూ.
అట్లాగే నేను మాట్లాడేది తెలుగు కాదు ఆంధ్రము అని ఓ పది మంది చేత అనిపించే ప్రయత్నం చేసి చూడండి.

>>> లగడపాటి పరిహసించిన 'ఆమరణ దీక్షా' <<< కే సి ఆర్ ని తన మానాన తను నిరాహార్ దీక్ష చేసుకోకుండా అడ్డుకున్నాడేవారు? బలవంతం గా ఆసుపత్రికి తరలించింది ఎవరు? అప్రజాస్వామికంగా వ్యవహరించింది ఎవరు? మళ్ళీ ఎదురు దాడి చేయడం ...
లగడపాటి కే సి ఆర్ ఆమరణ దీక్షను పరిహసిమ్చేందుకే అంత గొప్ప నాటకం ఆడారని,
ఆ నాటకాన్ని రక్తి కట్టిమ్చెందుకే పోలీసు సుపరిం టెన్ డెంట్ , పోలీస్ కమిషనర్ అంతటి అధికార్లను కూడా సస్పెండ్ చేశారని
భ్రమ పడే మీ ... .... .... ఎందుకు లెండి అన్ని తెలిసిన అబద్ధాలాడే వాళ్ళతో ఎం మాట్లాడతాం, దొంగ నిద్ర నటించే వాళ్ళని ఎట్లా నిద్ర లేపుతాం !

A K Sastry said...

డియర్ Goutham!

ముక్కూ మొహం తెలియనివాళ్ళని 'మిత్రమా'అనడానికి నాకు కాస్త ఇబ్బంది! అందుకని!

భావాల ఘర్షణ....యేదో అంటున్నారు! మీ భావాల్లో మీకే స్పష్టతలేదు అని కనిపిస్తూనేవుంది.

నేను వ్రాసిన టపా లో 'వుద్యమం' గురించి ఒక్క మాటైనా వుందా?

మరెందుకు భుజాలు తడుముకున్నారు?

'పతివ్రతా మాటలు వినలేక చస్తున్నాం.... విఙ్ఞతలేనివాదనలు...' అన్నారు.

తెలుగు తల్లి అంటే, తెలుగు భూమి--మాతృమూర్తి--అందుకని అన్నారుగానీ, భాషని తల్లి అనలేదు అని ఆ మూర్ఖుడికి యెవరు చెప్పినా వినడు మరి!

దీనికి ఒప్పుకొనే, తెలంగాణా తల్లి విగ్రహం చేయించాడు గానీ, తెలంగాణా ఒక భాష కాదు
అని వాడికి తెలియదా?

ముందు 'నాలుక కోస్తాం' అన్నిది వాడు కాదా? వాడు మాట్లాడేది తెలుగు కాదా? తెలుగు మాట్లాడేవాళ్ళు యెక్కువగా వున్న ప్రాంతాన్ని, భాషా ప్రయుక్తం గా విడదీసి, ఆంధ్ర ప్రదేశ్ యేర్పాటు చేశారు!

ఆంధ్రము, తెలుగు, తెనుగు, తమిళము, అరవము--ఇలా భాషల గురించి మీకు వివరించే ఓపిక నాకు లేదు!

ఇక మీకు పొడుచుకొచ్చింది, వాడు, వీడు అన్నందుకేనేమో! మేమిద్దరం ఒకే ఏజ్ గ్రూప్ లో వున్నందువల్ల అది తప్పులేదు (వాడు, నేను యెదురుపడితే, ఒరే అంటే ఒరే అనుకొని, వెధవాయ్, ఎల్ కే (అద్వానీ) అని కూడా అనుకుంటాం అన్నది వేరే సంగతి!)

కేసీఆర్ ఒక్కడే నాయకుడుకాదు అన్నారు బాగుంది--

మరి ఇంకెవరు? కోదండరామి రెడ్డా? దామోదర్ రెడ్డా? జానా రెడ్డా? నాగం జనార్దన రెడ్డా? దేవేంద్ర గౌడా?

నేనన్నది కూడా పాలకమా, ప్రతిపక్షమా అనికాకుండా 'రాజకీయులనే'! (వాళ్ళలో పురం'ధ'రేశ్వరి కూడా వుంది!)

వీళ్ళు భ్రష్టు పట్టించకుండా వుంటే అన్నీ బాగుంటాయి--మీ కోపాన్ని, ఆవేశాన్నీ వీళ్ళమీదకి మళ్ళీంచండి!

కాదు--ఇంకా వాదిస్తానంటాఋఆ....మీకో నమస్కారం!