Saturday, February 27, 2010

ప్రజల సొమ్ము


'ఫలభా' యంత్రం

'ఫలభా' యంత్రం పేరెప్పుడైనా విన్నారా?

ఒక గుండ్రని వృత్తం గీసి, అందులో కేంద్రం గుండా వ్యాసం పొడవునా ఒక చిన్న గోడ కడతారు. ఆ గోడ కట్టిన దిశా, యెత్తూ బట్టి సూర్య కాంతి వల్ల నీడ పడే విధానం వల్ల 'టైం' తెలుస్తుంది.

దీన్నే 'సన్ డయల్ ' అంటారు.

దీని ఖరీదు--మనం ఖర్చు పెట్టినంత.

దీన్ని ఇసుకా సిమెంటుతో కట్టచ్చు, రాయితో కట్టచ్చు, గ్రానైట్ తోనూ, పాల రాయితోనూ కూడా కట్టచ్చు, బంగారంతోనూ, వజ్రాలతోనూ కూడా కట్టచ్చు.

రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్న సామెత యెలాగూ వుంది--ఇప్పుడు దేవుడి సొమ్ము కూడా రాళ్ళూ, అవి కట్టించేవాళ్ళ పాలు అవుతున్నాయి!

ఇలాంటి ఫలభా యంత్రమొకటి మన అన్నవరం కొండమీద గుడి దగ్గర వుంది. నిర్మించి చాలా యేళ్ళయ్యింది. మీరు గమనించి వుండరులెండి. 

నిజానికి అక్కడికి వచ్చే భక్తులెవరూ సాధారణం గా గమనించరు--యెవరో పరిసరాలన్నీ ఇంటరెస్ట్ గా పరిశీలించేవాళ్ళు తప్ప.

ఇప్పుడు అలాంటి ఫలభా యంత్రాన్నే, ఓ పది లక్షల ఖర్చుతో, గ్రానైట్ రాయితో, మన ద్వారకా తిరుమల కొండమీద నిర్మించారట.

అదీ సంగతి.




2 comments:

Unknown said...

హెల్లొ సారు మన పూర్వీకుల గొప్పతనము ఈ ఫలభయన యన్త్రమ్ ద్వారా అన్దరికి తెలియదానికి దానికి ఎన్త ఖర్చుపెట్టబదిన్ది అనెది లెఖ వెయకూదదు.మనకి కాలము లెక్కిచదమ్ తెలియని రొజుల్లొ మన పూర్వీకులు రూపొన్దిన్చిన ఈపద్ధతి ఈ నాతికి సెకనుల్తొ సహా లెఖకతదమ్ మనకి అస్చరయమ్ కలిగిన్చక మానదు.మనము ఎక్కదొ వున్న రకరకాల క్లాక్ లు మెచ్హుకొనీ ఆనదిన్చెకన్న దీని విశయమ్ అన్దరికి తెలియపర్చతమ్ ఉత్తమమ్.

A K Sastry said...

డియర్ msmurty!

ఫలభా యంత్రం--సెకనుల్తో సహా లెఖ్ఖ కట్టదు--అది చూపించిన సమయానికి ఒక యెనిమిది నిమిషాలు కలపడం గానీ, తీసెయ్యడం గానీ చెయ్యవలసి వుంటుంది. దానికోసం ఒక మూల ఎలా చెయ్యాలో వివరిస్తూ ఇంకో రాయి వుంటుంది.

ఇక మన పూర్వీకుల గొప్పతనం గానీ, యంత్రం గొప్పతనం గానీ విమర్శించబడలేదు అని గ్రహించండి.

దాన్ని అంత ఖర్చుతో అక్కడ అర్జెంటుగా ప్రతిష్టించడం మాత్రమే ప్రశ్నించబడింది!

ధన్యవాదాలు.