'.....సిత్రాలు'
దాదాపు ఓ నలభై యేళ్ళ క్రితం, మన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 'కాలం మారింది' అనే ఓ సందేశాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు.
దాన్ని నిన్ననే (13-04-2010) ఈటీవీ వారు ప్రసారం చెయ్యడంతో మళ్ళీ చూశాను.
గాంధీ, నెహ్రూలకి కూడా 'విగ్రహాలు' పెట్టొద్దు--వారి బాటని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి అని అర్ధం వచ్చేలా, హీరో (శోభన్ బాబు) చేత పాట పాడించారు!
నిజం గా అలాంటి చిత్రం చెయ్యడం తో ఆయన జీవితం ధన్యమయినట్టే! (ఆ సినిమాకి డబ్బులు రాలేదనుకోండి--అది వేరే విషయం)
అలాంటి సినిమాలు మరిన్ని తీస్తే, ఇప్పుడు కోట్లు వసూలు చెయ్యచ్చు.
యెందుకొచ్చిన శంకరాభరణాలూ, సాగర సంగమాలూ, సిరి వెన్నెలలూ!
'.....తపస్వి' గారూ! ప్రయత్నిస్తారా?
2 comments:
అదేంటి గురువుగారూ!
అందరూ చాలా మంచి సినిమాలనుకొన్న వాటిని దిక్కుమాలిన సినిమాలన్నట్టు కొట్టేసారు.
ఎందుకలగ?
డియర్ Ekalavya!
'మంచి సినిమాలు' అన్న విషయం లో నేను విభేదించడం లేదు.
యెటొచ్చీ--మన తపస్వి గారు తీసే పధ్ధతి మీదే నా వ్యాఖ్య.
యెవరైనా ఆసక్తి కనబరిస్తే, ఈ విషయం లో ఓ టపా వ్రాస్తాను.
ధన్యవాదాలు.
Post a Comment