Tuesday, December 7, 2010

గుడీ-గుంపా

అవేవో యాగాలు

ద్వారకా తిరుమల లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ "త్రిషోడశ కుండాత్మక మహా సుదర్శన యాగం" నిర్వహిస్తున్నారట.

3 X 16 = 48 హోమగుండాలు సిధ్ధం అయ్యాయట. అందులో 4 ప్రధాన హోమగుండాలుంటాయట.

ప్రతీరోజూ "వైఖానస శాస్త్ర సమ్మతమైన" శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సుదర్శన 'మహామంత్రి పురశ్చరణాలూ', అద్భుత శాంతి హోమాలూ, 'మహామంత్రి హోమాలూ' నిర్వహిస్తారట.

ఇవన్నీ యేమిటో యెవరైనా చెప్పగలరా?

6 comments:

కొత్త పాళీ said...

అమ్మో కుండాత్మక యాగమే? :)

A K Sastry said...

డియర్ కొత్తపాళీ!

మరే! కదండీ! భలే భయపెట్టేస్తున్నారు వీళ్లు!

వాడెవడో 'రమణ మహర్షి'ట బాగా మేపి, సాయంత్రం వేట వెయ్యబోయే సీమపంది లా వుంటాడు (క్షమించండి నాకు తోచిన వుపమానాన్ని చెప్పకుండా వుండలేను), సాయిబాబా పేరుతో అదేదో 'శక్తిపాతం' లాంటివి నిర్వహిస్తాడట. 308 ఓ 380 యో కుండాల్లో, ఆహుతో యేదో చేస్తాడట! కోటి కుంకుమార్చన, కోటి పుష్పార్చన, లక్ష బిల్వార్చన.....ఇంకా యేవో చేస్తాడట! (ఆహార పదార్థాలు వాడటంలేదు.....సంతోషం!)

పట్టాభి భాగవతార్ అన్నట్టు ".....మన దైనందిన జీవితంలో స్పీడు యెలా అయితే వచ్చిందో, మన సంగీతంలో కూడా అలా రావాలి....". అలాగే....

".....మన స్కాములెలా లక్షల కోట్లకి చేరాయో, అలాగే, మన అర్చనల్లోనూ కోట్లకి చేరాలి!" అని వొప్పుకోవాలేమో!

ధన్యవాదాలు!

మిస్సన్న said...

బ్రహ్మ పదార్థాన్ని వివరించడం ఆ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదేమో!!!!!!!!!!!!!!!

A K Sastry said...

డియర్ మిస్సన్న!

మీరేమిటో......మధ్యలో ఓ 'పదార్థా'న్ని తీసుకొచ్చారు!

'మహామంత్రి' లూ అవీ ఆ పదార్థంలో భాగాలేనంటారా?

కొంచెం వివరించరూ?

ధన్యవాదాలు!

మిస్సన్న said...

అయ్యా బహుశా ఏ మహామంత్రి గారికో వారికనువైన శాఖ రాలేదేమో, అందుకని వారి యశస్సు కోరి జరుగుతున్న యాగాలేమో, అసలు సంగతి అదేమో!

A K Sastry said...

డియర్ మిస్సన్న!

మీరన్నదే......డొచ్చేమో!

వివరణకి సంతోషం.

ధన్యవాదాలు.