విచారణలు
కొన్ని చిన్న చిన్న విషయాలని గమనించండి.
పొద్దున్నే 6-00 గంటలకి ఓ సీబీఐ చప్రాసీనో, గుమాస్తానో, ఇంకెవరో తలుపుకొట్టి, తలుపు తెరిచినవాళ్లని "జనార్దనరెడ్డి గారున్నారా?" అని అడిగి, వాళ్లు లోపలికి వెళ్లి యెవరో వచ్చారు అని చెప్పగానే, అయన లుంగీ బనీనుతో బయటికి వచ్చి "యెవడ్రా ఈ టైములో...." అంటూండగానే, తలుపు కొట్టినవాడు "మా జేడీ గారుకూడా వచ్చారండి" అంటే, ఆయన జేడీ గారిని "రండి రండి! ఇంత పొద్దున్నే......" అంటూండగానే ఆయన ముందుకు వచ్చి, "మీ ఇల్లు సోదా చెయ్యడానికొచ్చాం!" అంటే, ఈయన "అందుకు మీకు అధికారం యెవరిచ్చారు? అసలు వారంటు వుందా?" అని ఇంకా యేదో అనబోతే, ఆ "స్పర్ ఆఫ్ ది మూమెంట్"లో జేడీ "మీరు సహకరించకపోతే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను" అన్నాడు.
ఈయన "వుండండి. మా ఆవిడకోమాట చెప్పి, డ్రెస్స్ వేసుకొని వస్తాను" అని లోపలికి వెళ్లి, వచ్చి, "సరే పదండి!" అన్నాడంటే......అది ఆయన అమాయకత్వం అనుకోను. చట్టం మీద ఆయనకున్న గౌరవం, తన పవర్ మీదా, డబ్బు మీదా వున్న నమ్మకం తో కూడిన అహంకారం మాత్రమే అయ్యుండాలి.
(నిజానికి ఆయన అంత కొంపలో, అన్ని గదుల్లో, అంత ఆవరణలో యెక్కడైనా దాక్కోవచ్చు, యెలాగైనా తప్పించుకొని బయటికి చెక్కేయచ్చు! ఆవూరు వాళ్లదీ, చుట్టూ మనుషులు వాళ్లవాళ్లు! కానీ యెందుకు పారిపోవాలి? వూరూ, ఆస్థులూ, అయినవాళ్లూ అందరినీ వదిలేసి?)
ఆయనకే గనక "మిరండా" హక్కులు చెప్పివుంటే, వాళ్లు హైదరాబాదు చేరేలోపల హైకోర్టులో బెయిల్ పిటిషన్ల వెల్లువ దాఖలైవుండేది!
(ఓ ప్రక్క డిసెంబరు 9 ప్రకటన వెలువడ్డాక, సీమాంధ్రలు భగ్గుమనగానే, హైకోర్టులో స్టే వెకేట్ అయ్యి, ఇనుప ఖనిజాన్ని పూర్తిగా తరలించగలిగాడని గుర్తు తెచ్చుకోండి!)
ఇంక, అంతకు కొన్నిరోజులు ముందే ఖాన్ బళ్లారి వెళ్లి దర్యాపు చేసి, వాళ్ల పనివాళ్ల జాతకాలతోసహా వివరాలు సేకరించారుకదా?
కోర్టులో ముద్దాయిని ప్రేశపెట్టేముందు, ఆ దర్యాప్తు వివరాలూ, పంచనామాలూ వగైరాలతో "పార్ట్-1 కేసు డైరీ" ని సమర్పించాలి. ఈ పార్ట్-1 సీడీ చాలా రహస్యమైనది. కోర్టు వారి పరిశీలన, రికార్డులకి మాత్రమే. పెద్ద పెద్ద లాయర్లు కూడా, కోర్టు సిబ్బందిని మంచి చేసుకొని దాన్ని పరిశీలించగలరు కానీ, నోట్సు కూడా తీసుకోలేరు! ఆ సీడీ లోని అంశాలపైనే అథారపడి డిఫెన్సు వాదనలూ, బెయిల్ కోసం వాదనలూ సిధ్ధం చేసుకొంటారు. (అవసరమైన వారికి ఆ సీడీల జెరాక్స్ కాపీలు కూడా యెలాగో అందుతూనే వుంటాయి అన్నది బహిరంగ రహస్యం!)
మరి ఈయన కేసులో సీడీ నే ఫైలు చెయ్యలేదు అని డిఫెన్సు వాదన! పంచనామా మీద యెవరూ సంతకాలు పెట్టలేదు అని కూడా సీబీఐ వాళ్లు చెప్పిందే! మరి ఇన్నాళ్లుగా ఆయన బందీగానే వున్నాడు అంటే.....అంతా "చట్టబధ్ధంగానే" జరుగుతోంది అని నమ్ముతారా?
ఇంకో వైపు, ఆండిముత్తు రాజా మీద దర్యాప్తు పూర్తి అయ్యింది అనీ, ఛార్జ్ షీటు దాఖలు చేశాము అనీ చెప్పారు. మళ్లీ కొన్ని కొత్త సెక్షన్లు కేసులో కలుపుతున్నాం కాబట్టి బెయిలు ఇవ్వద్దు అని సీబీఐ అంటే, "అసలు దర్యాప్తు పూర్తి అయ్యిందా, లేదా అనే విషయంలో వాళ్లని అఫిడవిట్ దాఖలు చెయ్యమనండి. అప్పటివరకూ నేను వాదించదలుచుకోలేదు!" అన్నాడట ఆయన లాయరు. యెంత బాగుందో చూశారా?
మా జిల్లాలో (ప గో జి) గత నాలుగురోజులుగా, జిల్లా కలెక్టరూ, అసిస్టెంట్ కలెక్టరూ, జాయింటు కలెక్టరూ--ఇలా ఆరు పోస్టుల బాధ్యతని ఎడిషనల్ జాయింట్ కలెక్టరు మిరియాల శేషగిరిబాబుకి మొత్తం బాధ్యతలు అప్పగించారు. నిన్న (30-09-2011 న) ఆయన ఆరోగ్యం లోపించి, ఇవాళ పొద్దుణ్నించీ సెలవులో వెళ్లిపోయారుట. దాంతో, మొత్తం యేడు బాధ్యతలూ, ఓ మామూలు రెవెన్యూ అధికారికి అప్పగించారుట. ఆయన మొత్తం 8 బాధ్యతలూ నా శాయశక్తులా నిర్వహిస్తాను అని చెప్పాడు. (రాబోయే నాలుగు రోజులలో రెండురోజులు సెలవులు పోయినా, కనీసం రెండురోజులు ఆయన 8 బాధ్యతలూ వహించవలసిందే!
మరి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు పదికేసులు (అన్నీ కోట్ల రూపాయలూ, పెద్దపెద్దవాళ్లకి సంబంధించినవీ) ఒంటిచేత్తో నిర్వహిస్తున్నాడంటున్నారు! (ఆయనని మించిన మగాళ్లెవరూ సీబీఐలో లేరనుకోవాలా?) అయినా ఆయనకిమాత్రం అంత గాడిదల బరువు మోస్తూ, చాకిరీ చెయ్యవలసిన అవసరం యేమి/యెందుకు వచ్చింది? రేప్పొద్దున్న ఆయనకి యే బ్రెయిన్ హెమరేజో (పాపం శమించుగాక!) జరిగితే, సీబీఐకి దిక్కెవరో?
......మరోసారి.
2 comments:
This is not about your post, please see below link and poll your opinion.
http://malakpetrowdy.blogspot.com/2011/10/email-from-niharika.html
నా వోటాల్రెడీ నాలుగురోజులక్రితమే వేశానమ్మా!
Post a Comment