తెలుగు ని ఖూనీ చెయ్యకండి!
ఓ బ్లాగరు ఓ టపా వ్రాశారు......శీర్షిక "వివేకానాందుడు యేమి చెప్పారు?"(ట).
వివేకానందుడు యేకవచనం. యేమి చెప్పాడు? అని అడగాలి.
ఇంక, ఆయనమీద గౌరవం పొంగి పొర్లి కారిపోతుంటే, బహువచనంగా "వివేకానందులు" యేమి చెప్పారు? అని ప్రయోగించాలి!
(దయచేసి దీన్ని 'కు'విమర్శగాతీసుకొని, రాధ్ధాంతం చెయ్యకండి!)
తెలుగు భాషని సంకరం చేసేసి, ఖూనీ చెయ్యకండి!
వేయ్యీ 11 యేళ్ల తెలుగుభాషా! జిందాబాద్!
11 comments:
Swaami Vivekaananda Yemi chepaaru!? anaali kadaa!? bhaasha aanavaLLu thappi thappu vraayavacchu. vraase prayathnam ni swaagathisthe.. baaguntundandee!
వివేకానందుడు యేకవచనం. యేమి చెప్పాడు? అని అడగాలి. ?
ఓ బ్లాగరు ఓ టపా వ్రాశారు......శీర్షిక "వివేకానాందుడు యేమి చెప్పారు?"(ట).
వివేకానందుడు యేకవచనం. యేమి చెప్పాడు? అని అడగాలి. ????
ఏకవచనం లేక యేక వచనము .
వేయ్యి లేక వేయీ , ( వేయి ) ఏది సరైనదో తెలియటం లేదండి.
నాకు వ్యాకరణం గురించి అంతగా తెలియదండి. మీరు వ్రాసిన విషయాలు చదివిన తరువాత నేను వ్రాస్తున్న తెలుగులో చాలా తప్పులు ఉన్నాయని తెలుసుకున్నాను. నాది వాడుక భాష అని సరిపెట్టుకుంటున్నాను.
ఇక్కడ నాకు చాలా సందేహాలు వచ్చాయి. " వివేకానందుడు ఏమి చెప్పారు " ? అన్నా " వివేకానందులు యేమి చెప్పారు " అన్నా వివేకానంద అన్న వ్యక్తి ఒక్కరే కదా ! అంటే ఏకవచనము. అందుకని , ఏమి చెప్పారు ? అని బహువచనం వాడవచ్చా ?
ఇక్కడ ఆ వ్యక్తి ఒక్కరే అయినా " చెప్పారు " ? అని వాడితేనే వారిని గౌరవించినట్లుగా ఉంటుంది.
అలాగే " గాంధీ అలా చెప్పాడు " అనటం కన్నా " గాంధీ అలా చెప్పారు " అనటమే బాగుంటుందండి.
ఇలాంటి విషయాల్లో ఏకవచనం బహువచనం కోణాల్లో చూడటం కన్నా " రు " అని చివర వచ్చినందువల్ల ఆ వ్యక్తిని గౌరవించినట్లుగా ఉంటుంది.
"గాంధీ గారు అలా చెప్పారు " అని కూడా అనవచ్చు కానీ, ఎక్కువసార్లు " గారు " అని వాడాలంటే కొంచెము కష్టంగా ఉంటుంది.
డియర్ వనజ వనమాలి!
మీ పరిచయం చాలా సంతోషం.
ఆయన అసలుపేరు నరేంద్రుడు. సన్యసించాక, వివేకానందుడు అయ్యాడు. సన్యాసి కాబట్టి, స్వామి అన్నారందరూ. అందుకని, "స్వామి వివేకానంద యేమి చెప్పారు?" అనఖ్ఖర్లేదు.
భాష ఆనవాళ్లు తప్పి, తప్పు వ్రాయడం గురించి నేను అనలేదు. నిజానికి ఆ టపా వ్రాసినాయన్ని నేను యెద్దేవా చెయ్యలేదుకదా? కొంతమంది వెర్రి 'తెలుగు 'వాళ్లని మాత్రమే విమర్శించాను. వ్రాసే ప్రయత్నాన్ని యెప్పూడూ స్వాగతిస్తాను.
మీరుకూడా చక్కగా "లేఖిని" వాడచ్చుగా? ఈ తెలింగ్లీషు యెందుకు మనకి?
ధన్యవాదాలు.
పై నలుగురు అన్నోన్లూ!
అందరూ వొకటే అయితే, ఇప్పటికి కాస్త స్పష్టత వచ్చినందుకు సంతోషం. ఒకవేళ అందరూ వేరువేరు అయినా, నా సమాధానం వొక్కటే.
వివేకానందుడు ఒకడే. అందుకని, యేమి చెప్పాడు? అనే అడగాలి.
ఇంకా ఆయనమీద గౌరవం పొంగి పొర్లి కారిపోతూంటే, బానిస తెలుగు వ్రాస్తే, "మహారాజరాజశ్రీ స్వాములు వివేకానందుల వారు యేమి సెలవిచ్చారు?" అని కూడా వ్రాయవచ్చు. దీనికి వ్యాకరణం తో నిమిత్తం లేదు. వున్నదల్లా మన మూర్ఖత్వంతోనే!
"వేయి పడగలు" అని విశ్వనాథవారు నవల వ్రాశారు. అది "సరళ" గ్రాంధికంలో వుంది కాబట్టి, ఆ శీర్షిక వుంచారు.
మేము చదివేటప్పుడు--మా నాన్నగారుగానీ, అమ్మగారుగానీ, నేనుగానీ, అందరూ దాన్ని "వెయ్యి పడగలు"గానే వ్యవహరించా/స్తాము. దానికి "సరిపెట్టుకొనే" అవసరంలేదు.
నేను చెప్పేదల్లా--"చెప్పాడు" అంటే ఆయన గౌరవనికేమీ లోపం రాదు అని.
మీరన్నట్టు, "గారు"లు యెక్కువైనా, వెగటుగానే వుంటుంది కదా?.
"నల్లనివాడు"; "పద్మనయనంబులవాడు"...... ఇలా వ్రాసినవాడికి, "వాడి"మీద గౌరవం లేనట్టా?
అలాగే, "బొర్రముక్కోడు"; "మిడిగుడ్లోడు".....అంటే వారిమీద గౌరవం లేనట్టా?
భాషని గురించిన మన మూర్ఖత్వాలు తగ్గించుకొంటేనే మన భాష మనగలుగుతుంది.
ఇదివరకే వ్రాశాను.....కన్నడ టీవీలో వాళ్లు చక్కగా "గోడె గుద్దాట" అంటున్నారని. ఇంకా నా పాత టపాలు......
http://teluguradical.blogspot.com/2011/06/blog-post_28.html
ఈ లింకుతో సహా చదవండి.
అందరికీ వందనములు.
ఓ వెయ్యీ పదకొండో యెన్నో యేళ్ల తెలుగుభాషా! జిందాబాద్!
కృష్ణశ్రీ గారు, తెలుగు భాష గురి౦చి వ్యాఖ్యాని౦చను కాని బ్లాగులు వ్రాసేప్పుడు కొ౦దరికి ఎదురయ్యే ఇబ్బ౦ది కావచ్చు. వివెకాన౦దుడు 'చెప్పాడు' అ౦టే చదివేవారికి నచ్చదేమో అని స౦కోచమ్ ఉ౦టు౦ది కదా. ఎక్కడో వివెకాన౦దుడు మాత్రమె కాదు. అమ్మ, నాన్న గురి౦చి కూడా వ్రాసేప్పుడు చివర 'రు' అని వ్రాస్తాము.
డియర్ Mauli!
".....భాష గురించి......" అని "మాడెస్టీ" యెందుకు? "......వారికి నచ్చదేమో....." అన్న "ఫాల్స్ ప్రెస్టీజ్" యెందుకు?
"అమ్మ చెప్పిందీ" అన్న సినిమా, పాటా సూపర్ హిట్లు అయ్యాయికదా? నాన్న చెప్పాడు అన్నా, గౌరవలోపమేమీ లేదుకదా?
ఇలాంటి "ఫాల్స్" మోడెస్టీలూ, ప్రెస్టీజ్ లూ వల్లే భాష భ్రష్టుపడుతోందంటే, కోపగించకండేం!
పై అన్నోన్లకి ఇచ్చిన సమాధానాలు కూడా చదవండి.
ధన్యవాదాలు.
@ఇలాంటి "ఫాల్స్" మోడెస్టీలూ, ప్రెస్టీజ్ లూ వల్లే భాష భ్రష్టుపడుతోందంటే, కోపగించకండేం!
భలేవారు, కోపం మాట అటు౦చ౦డి..'గారు' అని చెప్పకపోతే అనాగరికులం అయిపోమూ . ఈ గు౦టూరోల్లకి పెద్దలని గౌరవి౦చడమే రాదనేస్తు౦టారు. అలా అనెయ్యడం ఏదో పద్దతి అయినట్లు. చెప్పుకు౦టే ఇ౦కో తెల౦గాణ కతవ్వుద్ది :)
వీటికన్నా భాష గురి౦చి ఎవరికి లెక్క !
డియర్ Mauli!
నా తరువాతి టపా చదవండి.
http://teluguradical.blogspot.com/2011/10/blog-post_11.html
ధన్యవాదాలు.
Post a Comment