Sunday, May 6, 2012

యజ్ఞమా? యాగమా?.........




........యెవరికి లాభం? యెంత శాతం?

"అతిరాత్ర ఉత్కృష్ట మహా సోమయాగం" శాలా దహనం తో పూర్తయ్యిందట. ఫలితమేమిటో అందరూ చూశారు. (అతిమూత్రం కూడా యెవరికీ రాలేదు అని కొక్కిరించారెవరో!) 

ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టారట. దేవాదాయ శాఖవాళ్లు ఇవ్వము అంటే, ప్రభుత్వం వారు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఓ 50 లక్షలు చదివించారట. (దానికి బాధ్యులెవరో మరి!) 6 లక్షలమందికి "అన్న (అపాత్ర) దానం" చేశారట. (ఆఖర్రోజున యెందుకో ఆపేశారట!). ఇంకా ఓ 70 లక్షల "లోటు" మిగిలిందట. (రావలసిన చందాలు ఇంకా వున్నాయనుకోండి.....ట). 

శాలాదహనం అయిన మరుక్షణం "కుంభ వృష్టి" కురుస్తుందన్నారుగా? అంటే, "ముందురోజే కురిసేసింది కదా?" అని జవాబు!

నిన్న (05-05-2012న) యాగ నిర్వాహకులు పీవీఆర్ కే ప్రసాద్ వగైరాలు, గవర్నరుగారిని దర్శించి, యాగం ప్రసాదాన్ని, విభూతిని ఆయనకి అందజేసి, "యజ్ఞ వైభవం" అనే ప్రత్యేక, విశిష్ట సంచికని ఆయనచే ఆవిష్కరింపచేశారట. ఆయన ఇంకా ఇలాంటివి చాలా జరగాలని అభిలషించారట. (ఈ గవర్నరుగారు, 'మళ్లీ' నియమింపబడినప్పటినుంచే భక్తీ వగైరాలు యెక్కువైపోయాయి. రోజూ పేపర్లో కనిపిస్తున్నాడు. ఉపయెన్నికలు అయిపోయాక రాష్ట్రం మొత్తం పర్యటిస్తాడట! మరి రాజకీయ అజెండా యేమైనా వుందేమో......అంటున్నారు. పాపం ఆయన పదవీకాలం ముగిసినప్పటినుంచీ, మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేవరకూ మనది గరర్నరు లేని రాష్ట్రం అయిపోయింది!).

ఇంతకీ అది యజ్ఞమా? యాగమా? (ఆ రెండింటికీ తేడా వుందా?)

నాకున్న పరిజ్ఞానం మేరకు వ్రాస్తున్నాను. 

పెద్దలు యవరైనా నన్ను ఖండించదలుచుకున్నా, కొన్ని విషయాలు సరిదిద్దదలుచుకున్నా అందరికీ ఆహ్వానం.

......మిగతా మరోసారి.

10 comments:

Anonymous said...

అతిమూత్రం కూడా యెవరికీ రాలేదు
silly coment

Anonymous said...

ee devadaya sakha ki balupentanta ivvadaniki

- Krsna

Anonymous said...

@krsna..
u r right, it should have spent its moneys for the haz pilgrims and izraeli tourists. :(
the program is a religious one, so there is no need to bother how amount is given from CGF.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

మీ అతిమూత్ర వ్యాధి నయమయ్యిందంటారా?! :))

Anonymous said...

పనీపాటలేని వాళ్ళకు రానూపోనూ ఖర్చులు పెట్టి హాజ్ యాత్రలకు ప్రతి ఏడూ పంపుతుంటారు, గవర్నమెంట్ వాళ్ళు. మరి దాంతో మీకెప్పుడైనా అతిమూత్రం బంద్ అయ్యినట్టు అనిపించలేదా, తెలుగు రాడికల్ గారు?

A K Sastry said...

పై మొదటి అన్నోన్!

"సిల్లీ" కాబట్టేకదా "కొక్కిరింత" అన్నాను! (ప్రాసకోసం వాడానంతే).

A K Sastry said...

పై రెండో అన్నోన్ (Krsna)!

దేవాదాయ శాఖవారికి బలుపున్నా లేకపోయినా యెవరేమంటారో అని ఇవ్వననేస్తే, "ప్రభుత్వం" వారు ఇచ్చారు. ప్రభుత్వం బలుపు మన బలుపేగా?

A K Sastry said...

డియర్ puranapandaphani!

అది "మత" లేదా "ధార్మిక" కార్యక్రమం అని నిర్ణయించిందెవరో?

A K Sastry said...

డియర్ SNKR!

నిజం చెప్పొద్దూ, అతి మూత్రాన్ని "రాడికల్" కి ఆపాదిస్తున్నవాళ్లు ఇప్పటికీ A U T చేసుకొంటున్న మొరార్జీ అనుయాయులేమో అనుకున్నాను!