సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
రేడికల్ గా ఆలోచించే ఓ తెలుగోడు. ఇంతకీ రేడికల్ అంటే యేమిటి?
దడిగాడువానసిరా!ఇది తెలియనివాళ్ళెవరూ వుండరు—సాధారణంగా! ఓ పెద్దాయన వ్రాసినది ఓ సమీక్షకుడికి నచ్చలేదు! అయినా సమీక్ష రాయాలి! చూస్తే చాలా పెద్దాయన! ఇంకేమీ వ్రాయలేక, ఇలా వ్రాశాడట—తన కసితీరేలా! తరవాతేమయ్యింది అని నన్నడక్కండి! ఇంతకీ గమ్మత్తు యేమిటంటే— మేము హైస్కూల్ లో వుండగా, ఈ ప్రయోగం మాకు తెలిసి, మేము కూడా దీని మీద ప్రయోగాలు చేసేవాళ్ళం! నేను ఒకరోజు, క్లాసులో పాఠం జరుగుతూ వుండగా, ఓ పుస్తకం మీద ‘దడిగాడువానవిదిచసిగేరతి’ అని వ్రాసి, నా పక్కవాణ్ణి చదవమన్నాను. వాడు మామూలుగా తిరగేసి చదివి, ఉడుక్కున్నాడు. సరే, అయిపోయిందనుకుంటున్నారా! తరవాత తెలుగు క్లాసులో మేష్టారు ‘అందరూ కాంపోజిషన్ వ్రాశారా? పుస్తకాలు తెచ్చి నా టేబులు మీద పెట్టండి’ అనగానే, అందరూ అలాగే చేసేశాము! వ్రాతా! వీపునకు తేకే! అని సామెత లేదుగానీ, ఆ తరవాత తెలిసింది—నేను నా పక్కవాణ్ణి ఉడికించడానికి వ్రాసింది నా తెలుగు కాంపొజిషన్ పుస్తకం మీద అని! యేమి జరిగిందో వేరే చెప్పాలా!
పరాకాష్ఠ!శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, మన ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా కొన్నేళ్ళు వున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వాళ్ళల్లో ఆయన అగ్రగణ్యుడు! ఆయన ‘అనుభవాలూ, జ్ఞ్యాపకాలూను ’ చదివితే, ఆ రోజుల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పరిస్థితులు కళ్ళకు కడతాయి! ఇక ఆయన చిన్న కధలకి వస్తే, ‘వడ్లగింజలు’ ఈ నాటికీ, యేనాటికీ, ఓ మిస్టరీ! మన కంప్యూటర్లు లెక్క కట్టవలసిన దాన్ని, ఆయన అప్పుడే చెప్పారు! శ్రీ కృష్ణ దేవరాయలుకి తన ముద్దుల భార్యతో అరణపు కవిగా వచ్చాడుట—నంది తిమ్మన—అదే—‘నానా సూన వితాన…….’ అంటూ ముక్కు మీద పద్యం చెప్పిన మన ‘ముక్కు తిమ్మన’! ఆయన బాధ్యత—అప్పటి రాజకీయ పరిస్థితులనిబట్టి, అమ్మాయికి యే కష్టం కలుగకుండా, మొగుడితో కాపురం చేసుకునేలా చూసుకోవడం. అంతే! దానికి ఆయన యెంత కష్ట పడ్డాడు! అమూల్యమైన ‘పారిజాతాపహరణం’ కావ్యాన్నే వ్రాశాడు! అది యెలా అన్నది శ్రీ శాస్త్రి గారి చిన్న కధల్లో చదవండి! (ఇంకా వుంది)
అన్నమయ్యకి తెలుగు రాదా?నా సమాధానం—ఖచ్చితం గా వచ్చు! ఆయన మాతృ భాషే తెలుగు! ఆయన పదకవితలు వ్రాసింది జాను తెలుగులో! కాని—ఈ జానుతెలుగుని వక్రీకరించారు మన పండితులు. శ్రీగిరి శ్రీపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య పీఠం స్థాపించి ఆయన తాటాకుల మీద వ్రాసిన, వాళ్ళ కొడుకు రాజుగారి సహాయం తో రాగి రేకుల మీద చెక్కించిన పదకవితలని పరిష్కరించమంటే, వాళ్ళు చేసిన నిర్వాకమది! ‘అదివో అల్లదివో….’ పాటనే తీసుకోండి—‘పదివేల శేషులు’ యెక్కడనించి వచ్చారు? వున్నది ఒక్కడే ఆది శేషుడు, వాడికున్నది పదివేల పడగలూ! అసలు ఆయన వ్రాసిన ‘పదివేలు శేషుని’ ని ఇలా పరిష్కరించారన్నమాట! ‘పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్య!’ అట! అన్నమయ్య కాలంలో దోమలు వున్నాయో లేదో తెలియదుగాని, దోమ తెరలు మాత్రం ఖచ్చితం గా లేవు! మగవాళ్ళూ ఆడవాళ్ళూ కూడా మొలచుట్టూ పంచెలూ, చీరలూ ధరించేవాళ్ళు! శ్రీ కృష్ణ దేవరాయలంతటివాడే, మట్టులాగూలు వేసుకునేవాడు లేదా పంచెని ఆ ఆకారం లో కట్టుకునే వాడు. కావాలంటే తన భార్యలతో సహా ఆయన చెక్కించుకున్న విగ్రహాలని హంపీలోనూ, శ్రీపతి లోనూ చూడచ్చు! యెప్పుడో విదేశీయులు వచ్చినప్పుడు మాత్రం, పారశీకం నించి వర్తకులు తెచ్చిన పొడవాటి అంగీనీ, రంగు పంచెనీ ధరించి, తలపాగా మీద తురాయితో కనిపించేవాడట. మరి అలాంటి రోజుల్లో, దోమతెరలెక్కడనించి వచ్చాయి? పైగా పన్నగానికి, దోమతెరకి సంబంధం యేమిటి? ఆయన వ్రాసినది—‘పగడంపుదౌను తెర’ అనీ. ఇలాంటివి చాలా వున్నాయి. విజ్ఞులు మార్పులు చేయిస్తే, తెలుగు భాషకి యెంతో సేవ చేసినవారవుతారు. ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు—ఆ పదకవితలకి విస్తృత ప్రచారం తెచ్చింది మాత్రం వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వెయ్యో సంవత్సరం ఉత్సవాలో యేవో చేస్తారట! శుభం!
మన బ్యూరాక్రసీఇంకో గమ్మత్తేమిటంటే, నీ ముక్కెక్కడుందీ అని అడిగితే—మీకు తెలుసుగా?—అలా చూపిస్తుంది! ఒక నగరం లో, ఒక ‘బ్రతికిన కాలేజీ’ (అదేనండీ—జూ పార్క్) స్థాపిస్తున్నారట! సంబంధిత శాఖల్లో ఓ దాంట్లో, ఒక అధికారి తమ గుమస్తాని అక్కడ పెట్టడానికో బోర్డు తయారు చెయ్యాలి, దాని మీద యేమి వ్రాయాలో మేటరు డ్రాఫ్ట్ రాసి పంపించు! అన్నాడట. ఆ గుమాస్తా వెంటనే, చిన్న నోట్ వ్రాసి పంపించాడట—‘మనుషులకి ప్రవేశం నిషేధం’ అని! అధికారి ముక్క చీవాట్లు పెట్టాడు—‘అసలు నీకు డ్రాఫ్ట్ వ్రాయడం నేర్పింది యెవరు? యెన్నేళ్ళ సర్వీసు నీకు?’ వగైరా వగైరాలతో! అని కొన్ని సూచనలు ఇచ్చి, ‘ఇలా డ్రాఫ్ట్ పెట్టు’ అన్నాడట! మనవాడు బాగా ఆలోచించి, ఇలా తయారు చేశాడు—‘మెడకాయమీద తలకాయ వున్న మనుషులెవరైనా లోనికి ప్రవేశిస్తే, మాచే తీసుకొనబడు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురు’! అని. “మళ్ళీ ఈ ‘మాచే’ యెవరూ? యేమిటి?” “……ప్రవేశిస్తే, ఫలానా ఫలానా ప్రభుత్వం యొక్క అటవీ శాఖ; వన్య మృగ సం రక్షణ శాఖ; పర్యావరణ శాఖ; సామాన్య పరిపాలన శాఖ లేదా ఇతర సంబంధిత శాఖలచే తీసుకొనబడే………….” “బాగుంది! నోటు అంగీకరించడమైనది.” టెండర్లు పిలిచి బోర్డు వ్రాయించి, తగిలించడానికైన ఖర్చు—అక్షరాలా ఎనభై మూడు వేల ఆరువందల నలభై యేడు రూపాయలు! అప్పుడే తమాషా మొదలయ్యింది! రూల్సు వున్నది బ్రేక్ చెయ్యడానికే కదా? ఒక రోజు, ఓ మనిషి—వున్నాడు, తలకాయ వుంది—కానీ మెడకాయ కనిపించడంలేదు (పాపం ఓ రకం వికలాంగుడు!) దర్జాగా లోపలికి వెళ్ళిపోయాడు! తెల్లమొహం వేసిన కాపలా వాళ్ళు మళ్ళీ తమ శాఖకి మొర పెట్టుకున్నారు! వెంటనే, బోర్డులో మేటరు మారింది—‘మెడకాయ వున్నా లేకపోయినా, రెండు చెవుల మధ్యా తలకాయ…….” ఆని! మళ్ళీ మర్నాడు, ఒకటే చెవి వున్నవాడు దర్జాగా…………..! మర్నాడు, బోర్డు మారింది—“మెడకాయ వున్నా లేక పోయినా……రెండు చెవులూ వున్నా లేక పోయినా…….కళ్ళున్న మనిషి…..”! ఆని. ఒకే కన్నున్న మనిషి వెళ్ళిపోయాడు! “…..కళ్ళు రెండు వున్నా, లేకపోయినా, రెండుకాళ్ళు వున్న………..” మీకు తెలిసిపోయిందిగా! మరి ఈ రోజుకి, ఆ బోర్డు సరిపోక, చుట్టూ వున్న కాంపౌండ్ గోడ మీద, వ్రాయడం, చెరిపించడం, మళ్ళీ తెల్ల రంగు వేసి, మళ్ళీ వ్రాయించడం….ఇలా ఇప్పటికైన ఖర్చు—అక్షరాలా ఎనభైమూడు లక్షల అరవై నాలుగు వేల యేడు వందల యాభై రెండు! ఇదెక్కడ అంటారా? యేమో! నాకూ తెలియదు—రాశ్శేఖర్రెడ్డినో, చంద్రబాబునో అడగండి! చిరంజీవికి అంత అనుభవం లేదుగా!