మన బ్యూరాక్రసీఇంకో గమ్మత్తేమిటంటే, నీ ముక్కెక్కడుందీ అని అడిగితే—మీకు తెలుసుగా?—అలా చూపిస్తుంది! ఒక నగరం లో, ఒక ‘బ్రతికిన కాలేజీ’ (అదేనండీ—జూ పార్క్) స్థాపిస్తున్నారట! సంబంధిత శాఖల్లో ఓ దాంట్లో, ఒక అధికారి తమ గుమస్తాని అక్కడ పెట్టడానికో బోర్డు తయారు చెయ్యాలి, దాని మీద యేమి వ్రాయాలో మేటరు డ్రాఫ్ట్ రాసి పంపించు! అన్నాడట. ఆ గుమాస్తా వెంటనే, చిన్న నోట్ వ్రాసి పంపించాడట—‘మనుషులకి ప్రవేశం నిషేధం’ అని! అధికారి ముక్క చీవాట్లు పెట్టాడు—‘అసలు నీకు డ్రాఫ్ట్ వ్రాయడం నేర్పింది యెవరు? యెన్నేళ్ళ సర్వీసు నీకు?’ వగైరా వగైరాలతో! అని కొన్ని సూచనలు ఇచ్చి, ‘ఇలా డ్రాఫ్ట్ పెట్టు’ అన్నాడట! మనవాడు బాగా ఆలోచించి, ఇలా తయారు చేశాడు—‘మెడకాయమీద తలకాయ వున్న మనుషులెవరైనా లోనికి ప్రవేశిస్తే, మాచే తీసుకొనబడు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురు’! అని. “మళ్ళీ ఈ ‘మాచే’ యెవరూ? యేమిటి?” “……ప్రవేశిస్తే, ఫలానా ఫలానా ప్రభుత్వం యొక్క అటవీ శాఖ; వన్య మృగ సం రక్షణ శాఖ; పర్యావరణ శాఖ; సామాన్య పరిపాలన శాఖ లేదా ఇతర సంబంధిత శాఖలచే తీసుకొనబడే………….” “బాగుంది! నోటు అంగీకరించడమైనది.” టెండర్లు పిలిచి బోర్డు వ్రాయించి, తగిలించడానికైన ఖర్చు—అక్షరాలా ఎనభై మూడు వేల ఆరువందల నలభై యేడు రూపాయలు! అప్పుడే తమాషా మొదలయ్యింది! రూల్సు వున్నది బ్రేక్ చెయ్యడానికే కదా? ఒక రోజు, ఓ మనిషి—వున్నాడు, తలకాయ వుంది—కానీ మెడకాయ కనిపించడంలేదు (పాపం ఓ రకం వికలాంగుడు!) దర్జాగా లోపలికి వెళ్ళిపోయాడు! తెల్లమొహం వేసిన కాపలా వాళ్ళు మళ్ళీ తమ శాఖకి మొర పెట్టుకున్నారు! వెంటనే, బోర్డులో మేటరు మారింది—‘మెడకాయ వున్నా లేకపోయినా, రెండు చెవుల మధ్యా తలకాయ…….” ఆని! మళ్ళీ మర్నాడు, ఒకటే చెవి వున్నవాడు దర్జాగా…………..! మర్నాడు, బోర్డు మారింది—“మెడకాయ వున్నా లేక పోయినా……రెండు చెవులూ వున్నా లేక పోయినా…….కళ్ళున్న మనిషి…..”! ఆని. ఒకే కన్నున్న మనిషి వెళ్ళిపోయాడు! “…..కళ్ళు రెండు వున్నా, లేకపోయినా, రెండుకాళ్ళు వున్న………..” మీకు తెలిసిపోయిందిగా! మరి ఈ రోజుకి, ఆ బోర్డు సరిపోక, చుట్టూ వున్న కాంపౌండ్ గోడ మీద, వ్రాయడం, చెరిపించడం, మళ్ళీ తెల్ల రంగు వేసి, మళ్ళీ వ్రాయించడం….ఇలా ఇప్పటికైన ఖర్చు—అక్షరాలా ఎనభైమూడు లక్షల అరవై నాలుగు వేల యేడు వందల యాభై రెండు! ఇదెక్కడ అంటారా? యేమో! నాకూ తెలియదు—రాశ్శేఖర్రెడ్డినో, చంద్రబాబునో అడగండి! చిరంజీవికి అంత అనుభవం లేదుగా!
సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
No comments:
Post a Comment