హేతువాదులు—4శ్రీ యెక్కిరాల వేద వ్యాస్--అంతటి మేధావి—‘యుగాంతం’ వ్రాసి, 1999 డిసెంబరు 31న ‘కలియుగాంతం’ అయిపోతుందని చెప్పి—నవ్వులపాలయ్యాడు!
ఇంకొంతమంది వున్నారు—‘కోతి నుంచి మానవుడు పుట్టాట్ట! మీరు (అంటే మనుషులు) యెవరైనా, యెప్పుడైనా, ఇప్పటివరకూ ఒక్క కోతైనా మనిషిగా మారడం చూశారా?’—ఇలాంటి విమర్శలు చేస్తూ వుంటారు!
డార్విన్ చెప్పిన ‘జీవపరిణామ సిద్ధాంతం’ కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన నిజమనీ, యేక కణజీవి నించీ పరిణామం మొదలయ్యింది అనీ వీళ్ళని యెవరు నమ్మించగలరు!
అబ్రహాం టి కోవూర్ అని ఒక డాక్టరు—40 యేళ్ళ క్రితం ఓ బ్యాంకులో ఒక లక్ష డిపాజిట్ చేసి, బహిరంగ సవాలు విసిరారు—యెవరైనా సరే, యేవైనా సరే మహిమలు మా ముందు చూపిస్తే, ఆ లక్ష వెంటనే బహుమతిగా ఇచ్చేస్తాను—అని!
వూరారా ప్రదర్శనలు ఇస్తూ, ‘మహిమలు’ అని అప్పటికి చెప్పుకొనే—విభూతి ప్రసాదించడం, పువ్వులు సృష్టించి ఇవ్వడం, వుంగరాలూ, గొలుసులూ తెప్పించి ఇవ్వడం, ఆత్మలింగం కడుపులోంచి నోట్లోకి తెప్పించి ఇవ్వడం, నాడి కొట్టుకోకుండా ఆపెయ్యడం, భజన చేస్తూ వుంటే దేవుడు కనిపించాడని చెప్పడం, దెయ్యాలూ, భూతాలూ, శకునాలూ—ఇలాంటి వాటి గురించి వివరించి, చేసి చూపించేవారు!
మరి ఇప్పటివరకూ యెవరూ ఆ బహుమతి సొమ్ముని చేజిక్కించుకోలేకపోయారు! ఇంకెక్కడి మహిమలు?
విజయవాడాలోనైతే, ప్రత్యక్షం గా ఓ పాతిక మంది చేత ‘కోకా కోలా—కోకా కోలా’ అంటూ భజన చేయించి, తెల్లవారుఝామయ్యేసరికి అందరూ ఒక రకమైన పూనకం తో వూగుతున్నట్టు వుండగా—వారిని ప్రశ్నిస్తే, ‘నాకు రాముడు కనిపించాడు’ అని కొందరూ, ‘వెంకటేశ్వరడు కనిపించాడు’ అని కొందరూ, ‘సాయి బాబా కనిపించాడు’ అని కొందరూ—ఇలా వాళ్ళకి నచ్చిన దైవాలందరూ తలొకళ్ళూ చెపితే, మేము స్థబ్దం గా విని, తరవాత హాయిగా నవ్వుకున్నాము!
దాదాపు అదే రోజుల్లో డాక్తర్ సమరం ‘మూఢనమ్మకాలు—అసలు నిజాలు’ అనో, ఇంకేదో అలాంటి అర్థం వచ్చే పేరుతో పుస్తకం వ్రాశారు! ఇంకా రోగాలూ, చికిత్సలూ, పథ్యాలూ—ఇలాంటివాటి మీద కూడా పుస్తకాలు వ్రాశారు!
ఇక స్త్రీవాద, హేతువాద రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ యేకం గా ‘రామాయణ విష వృక్షం’ వ్రాసి, రామాయణం లో ఒక్క శ్లోకం కూడా హేతువాదానికి నిలబడదు అని నిరూపించింది!
ఈ తరం వాళ్ళకి ఇవేవీ తెలియవు! ఆ పుస్తకాలు కూడా ఇప్పుడు దొరకడం లేదు!
కనీసం ఆ రోజుల్లో ఆ పుస్తకాల ద్వారా ‘మూర్ఖత్వం’ మరింత ప్రబలకుండా తగ్గింది!
ఇప్పుడో! ఇంకా, ఇంకా, ఇంకా—ఇంతింతై, వటుడింతై—అన్నట్టు పెరుగుతోంది!
పెంచుతున్నవారుకూడా—మొహమాటం లేకుండా చెపుతున్నాను—ఓ 30 శాతం మూర్ఖత్వాన్ని బ్రాహ్మణులూ, ఇంకో 30 శాతాన్ని—సినిమావాళ్ళూ, ఇంకో 30 శాతన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళూ, ఇంకో 5 శాతాన్ని పత్రికలవాళ్ళూ, మిగిలిన 5 శాతాన్ని ఇతరులూ—పెంచుతున్నారు!
మరి ఇంకో ‘కోవూర్’ యెవరైనా, ఇంకో సమరం యెవరైనా, ఇంకో రంగనాయకమ్మ యెవరైనా బయలుదేరితే బాగుండును!
కదా!
24 comments:
meere bayalderandi mari!
పెద్దవారు క్షమించాలి...మీ వయసుకి మీ బ్లాగు పేరుకి కాస్తైనా నప్పిందా? అందరూ మీఅంత మేధావులై ఉండరు కదా. మతం అనేది ఏదైనా మనుషులని ఒక కట్టుబాటులో ఉంచే ఒక పరికరంలా ఉపయోగపడుతోంది కదా. మీరు మీ సమరంగారూ చెప్పినట్టు పట్టపగలు కూడా సెక్స్ చేసుకోవచ్చు అని ప్రజలని వారి వారి పనులు చేసుకోకుండా పక్క దారి పట్టించడం దేనికి. మన పూర్వీకులు వెర్రి వెధవలై ఈ నియమం పెట్టలేదు. పగలు పొట్టకూటికోసం పనులు మానేసి ఇవే పనుల్లో ఉంటారని పెట్టిఉంటారు. మీరు హుందాగా ఉండాలని, మీ రాతలు కూడా హుందాగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....మీ అభిమాని
miirilaa oka mulaaniki ippuDunna muudha nammakaalamu 30% baadhyata aapaadincadam sOcaniiyam. migilina 65% vividha rangaalakuu, 5% unknown aniceppaDi sababu gaalEdu.
dayacEsi miiru aa vaakyaanni venakki tiisukOvaalsinadigaa kOrutunnaanu
మన బ్లాగర్ల శాతం ఎంతో చెప్పనేలేదు మీరు?
వేద కాలం నుండి రెండు వాదాలు సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. అప్పటి చార్వాకులు నుండే వుంది. కాని పాలక వర్గం దీనిని నాటి నుండే అణచివేయడం సాగిస్తూంది. హేతువాద దృక్పధం లేకపోతే నేటి మన సమాజం ఇంత అభివృద్ధి చెందేదా? కావున దీనిని ముందుకు తీసుకుపోయే బాధ్యత అందరిదీను.
బ్లింకర్లు కట్టుకుని "చదువులు"మాత్రమే పూర్తిచేసిన చాలా మందికి ఆ "జ్ఞానం" గురించి తెలీదు లెండి. ఇక బ్లాగరలంటారా...అదింకా చిన్న లోకం.
మంచి వ్యాసం.
విశాఖపట్నం నగరానికి దగ్గరలోనే ఒక మహిళకి జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టారు. మేనరిక వివాహం వల్ల జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ అని చెపితే ఆమె నమ్మలేదు. ఆమెకి తన దగ్గరి బంధువుతోనే పెళ్ళి అయ్యింది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యించుకోమని డాక్టర్లు సలహా ఇచ్చినా వినలేదు. సిటీకి దగ్గరలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇక మారుమూల పల్లెటూర్ల గురించి ఊహించడం కష్టం కాదు.
తెలుగు వికీపీడియాలో రహంతుల్లా అనే ఒక పెద్ద మనిషి ఇస్లాంకీ, హేతువాదానికీ మధ్య పొంతన కుదురుతుందని hype ప్రచారం చేస్తున్నాడు.
డియర్ Dr. నరహరి!
నేను పుస్తకాలు వ్రాస్తే చదవడం సంగతి అటుంచి, ప్రచురించేవాళ్ళు కూడా యెవరూ వుండరనే భయంతోనే బ్లాగుల్ని ఆశ్రయించాను. ఒకవిధంగా బయలుదేరినట్లే కదా!
ధన్యవాదాలు!
డియర్ viswamitra!
ముందుగా నామీద మీరు చూపించిన అభిమానానికి కృతఙ్ఞతలు!
ఇక నా వయసువాళ్ళు ‘రాడికల్’ గా అలోచించకూడదు—వుండకూడదు అంటారా? యెందుకలాగ!
నా టపాలో యెక్కడైనా ‘మతం’ ప్రసక్తి వుందా?
ఇక సమరం గారు చెప్పినా, నేను చెప్పినా—యే సమయం లో సెక్స్ చేసుకోవచ్చనిగానీ, యే సమయం లో చేసుకోకూడదని--యెప్పుడూ కాదు! అలా చేసుకున్నవాళ్ళెవరైనా ఆ తరవాత ‘చాలా పాపం చేసేశామనో’, ‘దాని వల్లనే ఫలానా చెడు జరిగింది’ – అనో అనుకొంటూ కృంగిపోయేవాళ్ళకి—అదేమీ అంత క్షమించరాని నేరం కాదు అని ఓ ఓదార్పు మాట—అది ఓ మూఢ నమ్మకం అనే మాట చెప్పి వుండచ్చు! అంతే!
సరే! ఇంకా ‘హుందా’గా వ్రాయడానికి ప్రత్నిస్తాను!
ధన్యవాదాలు!
బైబిల్ భక్తుల గర్వ భంగం గురించి నా ఫ్రెండ్ వ్రాసిన రియల్ స్టోరీ చదవండి http://sahityaavalokanam.net/?p=136
డియర్ imagenatin8work!
మీరు కష్టపడి, తెలింగ్లీషు లో వ్రాసినందువలన, ‘ములానికి’ అని వ్రాసినా, అది ‘కులానికి’ అనే అర్థం చేసుకున్నాను!
బ్రాహ్మణ్ణైవుండీ, ఇలా అనడం నాకు ‘ముదావహం’ అనుకుంటున్నారా?
అసలు టపాలో 90% అని వ్రాసి, నాకులపోళ్ళు మరీ యేడుస్తారని, దాన్ని మూడు భాగాలు చేసి, 30% అన్నాను!
ఇదే బ్లాగు లో నా తరవాత టపాలు చదివి, ఇంకా ‘వెనక్కి తీసుకోమని’ కోరగలరేమో ఆలోచించండి!
ధన్యవాదాలు!
డియర్ శరత్ ‘కాలం’!
నాకున్న తక్కువ సమయం లో చాలా కొద్ది బ్లాగులని మాత్రమే చూడగలుగుతున్నాను! అవి కూడా ఇతరులు ‘చాలా బాగున్నాయి ’ అని సూచించినవి! అందుచేత చెప్పలేను!
కానీ మీ ప్రశ్న చదువుతూంటే, అది చాలా ‘పెద్ద శాతమేమో!’ అని నా అనుమానం!
అవునా?
ధన్యవాదాలు!
డియర్ వర్మ! కత్తి మహేష్ కుమార్! oremuna! Nadendla!
మీ వ్యాఖ్యలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు!
మీలాంటివాళ్ళే సమాజానికి అవసరం!
డియర్ Marxist-Leninist-Feminist-Revolutionary!
మీరు ఇచ్చిన మద్దతుకి నా ధన్యవాదాలు!
మీరు, ఇంత చిన్న వయసులో ఇలా ఆలోచిస్తున్నారంటే, మీ మీద యెవరి ప్రభావం వుందా అని నా ఉత్సుకత! వీలైతే మీగురించి చెప్పండి!
మీరు పంపించిన లింక్ ని బుక్ మార్క్ చేసుకున్నాను! చాలా బాగుంది!
మరోసారి ధన్యవాదాలు!
లేటుగా చదివాను ఈ వ్యాసం. అక్షర సత్యాలు చెప్పారు. కానీ ఇలాంటివి మెదళ్లలో ప్రవేశించకుండా తాళాలు వేసేసుకుని కూచుంటే ఏం చేస్తాం?
మంచి టపా రాశారు.
నా వయసు 26 ఏళ్ళు. 16 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు కూడా దేవుడు, దెయ్యాలు లాంటి వాటిని నమ్మలేదు. 2005లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ప్రముఖ నాస్తికుడు పెన్మెత్స సుబ్బరాజు గారు పరిచయమైన తరువాత నాలో హేతువాద ఆలోచనలు బలపడ్డాయి.
డియర్ సుజాత!
చెవిటివాళ్ళకైనా చెవి దగ్గరగా శంఖం వూదితే వినపడే చాన్స్ వుందేమోగానీ, మీరన్నట్టు 'తాళాలు ' వేసుకొన్నం అనే వాళ్ళకి వినిపించడం చాలా కష్టం కదూ!
ధన్యవాదాలు!
Dear Marxist-Leninist-Revolutionary!
చాలా సంతోషం!
శ్రీ సుబ్బరాజు గారిని (పేరైనా) బ్లాగర్లకి పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు!
మీ కృషి కొనసాగించండి!
ధన్యవాదాలు!
సుబ్బరాజు గారు నాకు మరి కొంత మంది నాస్తికులని కూడా పరిచయం చేశారు. ఈ లింక్ వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=147
కొంత కాలం క్రితం సుబ్బరాజు గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నన్ను పిలిచారు. నేను వెళ్ళలేదు. మా అమ్మానాన్నలు వాళ్ళ ఊరికి సమీప ప్రాంతంలో బ్యాంక్ ఉద్యోగం చేసే రోజుల్లో అతను నాకు పరిచయమయ్యారు. అమ్మానాన్నల ట్రాన్స్ఫర్ వల్ల నేను సుబ్బరాజు గారికి వ్యక్తిగతంగా దూరమైనా అతను నన్ను మరచిపోలేదు. మా నాన్న గారు చనిపోయినప్పుడు నేను కర్మకాండ చెయ్యలేదు. మా పెదనాన్న గారి చేత కర్మకాండ చెయ్యించారు. నేను నాస్తికుడినైనా కర్మకాండ చెయ్యడానికి ఒప్పుకోకపోతే మా బంధువులు నన్ను తిడతారని నేను ఊహించాను. ఊహించినట్టుగానే నన్ను తిట్టారు. ఎలాగూ నా నాస్తిక నిజాయితీ వాళ్ళకి అర్థమైపోయి మా పెదనాన్న గారి చేత కర్మకాండ చెయ్యించారు.
Dear Marxist-Leninist-Feminist-Revolutionary!
మీరిచ్చిన లింకు యెందుకో ఇవాళ ఓపెన్ అవలేదు--కానీ, మరింతమంది 'నాస్తికుల ' పేర్లు బ్లాగర్లకి పరిచయం చెయ్యాలనే మీ తపన కి నా జోహార్లు!
ఇక్కడొక చిన్న సలహా!
నేనుకూడా 16 యేళ్ళప్పుడూ, 26 యేళ్ళప్పుడూ మీలాగే వుండేవాడిని! కానీ ఆ తరవాత 36 యేళ్ళప్పుడు కొంత ఙ్ఞానోదయం అయ్యింది నాకు!
'నాస్తికత్వం' దేవుడు వున్నాడా, లేడా అనే విషయం గురించి మాట్లాడదు! దేవుడి పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దు--అంటుంది--అంతే!
ఇక యఙ్ఞోపవీతాలు ధరించడం, సంధ్యావందనాలు చెయ్యడం, కర్మకాండల్లో పాల్గొనడం వంటివి--మన సంస్కృతిలో భాగం!
ఓ ముసల్మానుని గానీ, ఓ క్రిస్టియన్ ని గానీ, చనిపోయిన వాళ్ళని 'దహనం' చెయ్యమంటే చేస్తారా?
పార్సీలు, శవాలని కొండమీద వదిలెయ్యొద్దు--ఖననమో, దహనమో చెయ్యండి--అంటే చేస్తారా?
ముసల్మానులని, జ్యూలని, 'సుంతీ' చేయించొద్దు అంటే, వింటారా?
అవన్నీ వాళ్ళ 'సాంప్రదాయం' 'ఆచారం' 'సంస్కృతి ' లో భాగాలు!
అలాగే, మన సంస్కృతిలో భాగాలని మనం కూడా ఆచరించాలి--మనకి ఇష్టం వున్నా, లేకపోయినా!
ఆలోచించండి!
నిన్న సర్వర్ ప్రోబ్లం వచ్చింది. అందుకే ఓపెన్ అవ్వలేదు.
Post a Comment