Saturday, August 8, 2009

హేతువాదం…..

హేతువాదులు-7
వాస్తు :—
పూర్వకాలం లో జనావాసాలు యేర్పరచడానికి అన్నివిధాలా అనువైన ప్రాంతాలని యెన్నిక చేసి, ఫలానా చోటైతే అన్నివిధాలా సురక్షితం గా వుంటుంది కాబట్టి అక్కడ నివసించండి—అని చెప్పేవారు—పండితులు—అంటే మేధావులు!
రాను రాను, ఈ విధంగా సురక్షితం గా వుండడానికి కావలసిన ‘అవసరాలని’ కొన్ని నియమాలుగా తీర్చిదిద్ది, ‘ఇవన్నీ ఇలా వుంటే—ఇక చూడక్కర్లేదు—క్షేమం గా, లాభం గా అక్కడ వుండచ్చు అని చెప్పి--ఆ నియమాలనే ‘వాస్తు’ అన్నారు.
ముఖ్యం గా మన భారత దేశానికి తగ్గట్టు ఈ వాస్తుని రూపొందించారు—ఉత్తరం నించి తూర్పుగా ప్రవహించే జలవనరు ఈశాన్యం లో వుండాలి; ఉత్తరాన్ని యెత్తైన ప్రదేశం (కొండలు) వుంటే మంచిది (ఉత్తరాన్నించేకదా శత్రువులు వచ్చేది!); వాయవ్యం నించి మంచిగాలి వచ్చేలాగ లోయలు వుండాలి; నైఋతి మూల దట్టమైన అరణ్యాలు వుండాలి; ఆగ్నేయం లో నీటి నిలవలు వుండాలి—ఇలా!
పూర్వులు యేర్పరిచిన వూళ్ళు, నగరాలే కాదు, నిర్మించిన కోటలు కూడా దాదాపు ఇవే నియమాలతో కట్టారు—యెలాంటి దండయాత్రలకైనా తట్టుకునేలాగ.
మరి ఈ రోజున, ఈ శాస్త్రాన్ని అన్నివిధాలా భ్రష్టు పట్టించి, వాస్తు బాగోలేదు అంటూ ప్రతి నిర్మాణానికీ తనకి తోచిన మార్పులు సూచిస్తూ, అవి చేసేదాకా మానసిక క్షోభ, చేశాక ఆర్థిక క్షోభ జనాలకి కల్పిస్తున్న వాస్తు శిల్పులూ, అపర మయ బ్రహ్మలూ, వాస్తు సర్వఙ్ఞులూ యెంతోమంది!
వూరికి వాస్తు, వూరిలో వీధికి వాస్తు, వీధిలో ఇంటికి వాస్తు, ఇంటిలో గది కి వాస్తు, గదిలో మంచాలకీ, టేబుళ్ళకీ వాస్తు—ఈ అన్నిట్లోనూ ఈశాన్యం తేలికగా వుండాలి, నైఋతిలో బరువు వుండాలి, కొంచెం పైకి లేవాలి, ఆగ్నేయం లో అగ్ని వుండాలి, వాయవ్యం లో వాయువుండాలి—ఇలా!
మునుపు దూలాలతో నిర్మించిన ఇళ్ళల్లో యెప్పటికైనా అవి కూలే ప్రమాదం వుందని, వాటి క్రింద కూర్చోవద్దు, పడుకోవద్దు అన్నారు! ఇప్పుడు ఆఫీసుల్లో కూడా, ‘బీం’ క్రింద సీటు వస్తే, అక్కడ కూచోడానికి తిరస్కరించేవారెందరో!
వాస్తుపురుషుడంటూ కాళ్ళు చేతులూ వంచేసి, ఓ చతురస్రం లో వాణ్ణి ఇరకబెట్టేసి, యేవేవో సిద్ధాంతాలు చెపుతారు!
ఇవన్నీ బ్రాహ్మణుల్లోనే పుట్టి, పెరిగి, ఇప్పుడు ఇతర కులాలకి కూడా వ్యాపించాయి!
దారిలో యెదురుదెబ్బ తగిలినా, ఓ పదిరూపాయలు పారేసుకున్నా, కాస్త వొళ్ళు వెచ్చబడినా, వుద్యోగం లో యేదైనా చిన్న కష్టం కలిగినా—వీటన్నిటికీ వాస్తే కారణం అని దాదాపు అందరూ నమ్మే స్థాయికొచ్చేశారు!
మరి వీటికి విరుగుడెప్పుడో!

16 comments:

Malakpet Rowdy said...

Yeh hui naa baat! Excellent one!!

మీరిదివరకూ వ్రాసినదానికీ దీనికీ ఎంత తేడా ఉందో గమనించారా? "వాస్తు అనేది ఆకాలానికి సరిపోయింది గానీ ఈ కాలానికి సరిపోదు, పనికిరాదు. ఇది ఫలానా కులంలో పుట్టి ఇతరకులాలకి కూడ వ్యాపించింది" అన్న మీమాటకీ - "వాస్తు అనేది బూటకం - మిగాతా కులాలని వంచించడానికి ఒక కులం వాళ్ళు పుట్టించింది" అనే HATE-వాదుల మాటలకీ చాలా తేడా ఉంది!

A said...
This comment has been removed by the author.
A said...

ఆకులో ఆకు అనే సామెత విన్నారా౟. అసలు కంచెం అయితే ఈ బ్రామ్మలు తమకు అనుకూలంగా మార్చుకుంది కొండంత. పన్నెండువేలున్న పద్యాలున్న భారతాన్ని లక్ష పద్యాలకు పొడిగించారు. అంతకన్నా తక్కువున్న రామాయణాన్ని ఇరవైనాలుగు వేలకు పెంచారు. అంతా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నవే. దేవుడు వాళ్ళసొత్తు. దేవుడి దయ కావాలంటే ముందు వీడికి డబ్బులివ్వాలి. యుద్దం చేసేది రాజు, సైనికులు, ప్రజలైతే గెలుపు క్రెడిట్ మాత్రం వీళ్ళు కూర్చుని చేసే యాగానిదే. గజనీ దాడి చేసినప్పుడు వీళ్ళ మాటలు నమ్మి జనం తిరగబడకుండా ఉండిపోయేసరికి గజని మహమ్మద్ కు ఉన్న రిస్కల్లా కేవలం నరకడానికి పట్టిన సమయం మాత్రమే. ఇంకాచాలా ఉంది. త్వరలో దీని గురించి వ్రాయబోతున్నా. pls see http://public-court.blogspot.com

Malakpet Rowdy said...

పన్నెండువేలున్న పద్యాలున్న భారతాన్ని లక్ష పద్యాలకు పొడిగించారు. అంతకన్నా తక్కువున్న రామాయణాన్ని ఇరవైనాలుగు వేలకు పెంచారు. అంతా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నవే.
___________________________________

మూడూ పద్యాల్లో మహాభారతం మిగతావాళ్ళూ వ్రాయాల్సింది. ఎందుకు వ్రాయలేదు మరి?యుద్దం చేసేది రాజు, సైనికులు, ప్రజలైతే గెలుపు క్రెడిట్ మాత్రం వీళ్ళు కూర్చుని చేసే యాగానిదే.
___________________________________

So you want the people who participated in the war to take the credit. I agree with you - fair enough. Look below ..


గజనీ దాడి చేసినప్పుడు వీళ్ళ మాటలు నమ్మి జనం తిరగబడకుండా ఉండిపోయేసరికి
__________________________________

Now why are you blaming them? Aint this a Paradox?

In the previous sentence you perhaps implied that the credit shoudl go to the people who participated, not the people who were behind them in case of a victory.Now, in case of a defeat, you want to blame the people who were behind LOL

Praveen Sarma said...

Read this link http://hetuvaadi.blogspot.com/2009/07/blog-post_13.html

Prof. Kodali Srinivas said...

గృహ విలాపం
పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు

రంగు రంగుల వలువలతో తోడున్నా నీనెచ్చెలిగా !

రోగాల -రో స్తులు చావు బ్రతుకుల పోరాటంలో ...

కష్టాల కన్నీళ్లను మోనంగా దిగామింగా నీ ప్రాణ నేస్తంగా !

కంటికి రెప్పలా ,కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా

శైశవం నుండి నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా !

నీచేతిలో దగాపడి ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ...

నీ అసమర్ధ జీవనయానంలో తగిలే ప్రతి రాయికి
జన్మనిచ్చిన రాకాసి తల్లిగా !

నేరం నీదైతే ... వాస్తు ముద్దాయిగా నాకెందుకు ఈ మరణ శిక్ష ?
Read this link http://vaasthuvidya.blogspot.com

Praveen Sarma said...

వాస్తు వల్ల వడ్డీ వ్యాపారులకి కూడా లభమే. గోడలూ, గదులూ కూల్చి మళ్ళీ కట్టడానికి అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారుల దగ్గరకి వెళ్ళాలి కదా.

Krishna Sree said...

డియర్ Malakpet Rowdy!

ఆకాలానికే కాదు—ఈకాలానికి కూడా వర్తిస్తుంది—కాకపోతే ఇంటికీ, ఇంటిలో గదికీ, గదిలో టేబుళ్ళూ, మంచాలకీ కాదు!

ఇప్పటికీ, ఓ టౌన్ షిప్ నిర్మించాలంటే, వాస్తు పాటించక తప్పదు!

ఇక ….వ్యాపించడం కాదు—ఇతరకులాల నెత్తిన స్వారీ చేస్తోంది! దేనికైనా ‘అమావాస్య ముందు యెందుకు—అది పోయాక చూద్దాం’ అనీ, ‘ద్వితీయ విఘ్నం వుండకూడదు’ అనీ, యెవరింటికైనా వెళ్ళగానే ‘ఈశాన్యం లో ఆ ఇటికలు తీయించెయ్యండి—జోళ్ళ గూడు ఈశాన్యం లో తీసెయ్యండి’ ఇలా వ్యవహరిస్తున్న వాళ్ళు ఇతరకులాల వాళ్ళే! వీళ్ళని చూసే ముఖ్యం గా ఇవి వ్రాస్తున్నది.

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ A!

రామాయణ భారతాలలో మొదట యెన్ని శ్లోకాలు వుండేవి అని యెవరూ చెప్పలేరు—యెందుకంటే అవి ‘అనుశృతంగా’ వస్తున్నవి!

కొన్ని వేల సంవత్సరాలక్రితం ముద్రణా యంత్రాలు లేక పోబట్టి, అప్పటికి ఇంకా తాటాకుల మీద గంటం తో వ్రాయచ్చు అని కూడా తెలియదు కాబట్టి—ఒకళ్ళు చెప్పినది విని, దాన్ని మననం చేసుకొంటూ, తరవాతివాళ్ళకి చెప్పడం వల్లనే వ్యాప్తి చెందాయి!

అంతేకాదు—ఆ రోజుల్లో అన్ని కులాలవాళ్ళూ—పామరులు కూడా సంస్కృతం మాట్లాడేవారు—శ్లోకాలు అల్లేవారు—గణికలూ, వాళ్ళని తార్చేవారితో సహా!

సంగతేమిటంటే, తాము మంచి అనుకొని చెప్పదలుచుకున్నవి కూడా, యేదో సందర్భం లో (అది అతికినా అతకకపోయినా) వీటిలో చొప్పించేవారు! వీటినే ‘ప్రక్షిప్తాలు’ అంటారు!

మొన్న మళ్ళీ యెవరో అన్నారు—దశరథుడు చచ్చిపోయాక, ఆవిషయం చెప్పి రాముణ్ణి తిరిగి రాజ్యం యేలుకోమని చెప్పడానికి వచ్చిన భరతుడు ససైన్యం గా రావడం చూసి, యుద్ధానికేమో అని భయపడ్డారు—రాముడూ, లక్ష్మణుడూ! వెంటనే రాముడు ‘తమ్ముడూ! మన రాజ్యం యెలావుంది? పరిపాలన యెలా సాగిస్తున్నావు? పనికిరానివాళ్ళని మంత్రులుగా నియమించలేదుగద?........’ ఇలాంటి ఓ రెండుపేజీల సందేహాలు, హితబోధలూ సాగిస్తాడు—తండ్రి పోయాడు అని కూడా చెప్పనివ్వకుండా!

మరి కుమ్మరి మొల్ల కూడా రామాయణం వ్రాసింది! ఇంకా అనేక కులాలవాళ్ళూ వ్రాశారు—ఇతర భాషల్లో కూడా!

ఇవన్నీ యెవరికోసం అని మీరనుకుంటే అది మీ ఇష్టం!

ధన్యవాదాలు!

Malakpet Rowdy said...

Hmmm,

I dont know anything about Vastu and perhaps my ignorance about it drove me towards my perception - I havent believed in it so far.

But your point about Township vs Home is interesting!

Krishna Sree said...

డియర్ Prof. Kodali Srinivas! Praveen Sarma!

మీరిచ్చిన లింకుల తాలూకు టపాలు ఇంతకు ముందెప్పుడో చదివాను.

ధన్యవాదాలు!

Praveen Sarma said...

ఒల్లు ఒంచి పని చెయ్యడం చేతకాకపోతే జ్యోతిష్యునిగానో, వాస్తు పండితునిగానో అవతారం ఎత్తి కబుర్లు చెప్పి సంపాదించడమే.

Praveen Sarma said...

మలక్ పేత్ రౌడీ లాంగ్వేజ్ నిజంగా రౌడీ లాంగ్వేజే. కావాలంటే ఈ లింక్ చూడండి. http://webhosting4india.net/images/bharadwaja_language.png గాలి నా పుత్రుడు (తండ్రి లేకుండా పుట్టినవాడు) అని తిట్టేది ఏ వర్గం వాళ్ళు? భోగం వీధుల్లో తిరిగేవాళ్ళ నోటి నుంచే అలాంటి తిట్లు వస్తాయి. చెప్పేవి శ్రీరంగ నీతులు, తిరిగేవి పెద్దాపురం & వేల్పూరు బోగం వీధులు.

Malakpet Rowdy said...

నీకు బుర్ర ఒకటే పని చెయ్యదనుకున్నా .. కళ్ళూ కూడ పని చెయ్యవన్నమాట .. ఆ కామెంట్ రాసిందెవడో ఒక సారి చూసుకో!

LOLOLOL

Praveen Sarma said...

తెలుసు. నీ కంపెనీ వాడే.

Malakpet Rowdy said...

ఛా! అవునా!! Then prove it or shut up :))