Sunday, August 16, 2009

హేతువాదం…..

హేతువాదులు-8
మా కాలేజ్ చదువులయిపోయాక నిరుద్యోగ పర్వం రోజుల్లో, సాయంత్రం కాలక్షేపానికి మా ఫ్రెండ్ సైకిలు షాపు దగ్గర కాసేపు కూర్చొనేవాళ్ళం.
అప్పట్లో యెవరైనా కొత్తసైకిలు కొనుక్కుంటే, సైకిలు బిగించిన తరవాత, దానికి తీగతో నిమ్మకాయ హేండిలుబారుకి బిగించి, సిందూరం మెత్తి, మడ్ గార్డులమీద కూడా సిందూరం చల్లి, ‘ఇలా తూర్పుగా తొక్కుకు వెళ్ళండి. అక్కడున్న కనక దుర్గమ్మ గుళ్ళో ఓ కొబ్బరికాయ కొట్టండి! అంతా శుభం జరుగుతుంది.’ అనేవాడు ఆ షాపు వోనరు!
ఓసారి ఈ వ్యవహారం యేమిటో చూద్దామని మేము కూడా ఓ కొత్త సైకిలాయన తో గుడి దాకా వెళ్ళాము.
ఆయన ‘కొత్త సైకిలుకి పూజ జరిపించండి’ అంటే, ఆ పూజారి గారు నిర్మొహమాటం గా ‘సైకిలు పూజలూ, బండి పూజలూ అని ప్రత్యేకం గా వుండవు—మీ పేరూ గోత్రం చెపితే, మీ పేరున అమ్మవారికి అష్టోత్తరం చేస్తాను!’ అన్నాడు!
మరి ఇప్పుడో—సైకిలుకీ, మోటర్ సైకిలుకీ, కారుకీ, లారీకీ—కాకుండా ఆయుధ పూజల పేరుతో బీరువాలకీ, ఇనప్పెట్టెలకీ కత్తులకీ చాకులకీ, పెన్నులకీ—ఇలా ‘ప్రత్యేక’ విశేష పూజలు చేసేస్తున్నారు!
ఇక ప్రతీ నేతా, వీ ఐ పీ ప్రతీ గుడిలోనూ, ఆఖరికి శ్రీ రామనవమి, వినాయక చవితి పందిళ్ళలో కూడా—ప్రత్యేక పూజలూ, విశేష పూజలూ చేసేసే వాళ్ళే—మన మీడియా వాటిని ప్రముఖ వార్తల్లా ప్రకటించడమే!
ఆఖరికి గద్దర్ కూడా ఆ మధ్య శ్రీవారికి బ్రేక్ దర్శనం చేసుకొని, విశేష పూజలు చేసేశాడు.
(గద్దర్ ప్రత్యేకతేమిటంటే—రోడ్లమీద చొక్కా లేకుండా ఓ నల్ల కంబళీ కప్పుకొని తిరుగుతాడు—గుడికి మాత్రం చక్కగా పొడుగుచేతుల చొక్కా ధరించి వెళతాడు!)
అదో సంగతి!

2 comments:

Praveen Mandangi said...

గద్దర్ విప్లవకారుడెలా అవుతాడు? చొక్కా విప్పుకుని తిరుగుతూ ఇదే మగతనం అని ప్రదర్శించుకుంటూ ఆడవాళ్ళని అవమానించేవాడు విప్లవకారుడా?

Vissu said...

మొండి శరీరం చూపిస్తూ ఆనందం పొందే కామపిశాచి వాడు.