Friday, August 28, 2009

హేతువాదం…..


హేతువాదులు-9
ఇక బ్రహ్మోత్సవాలు :—  

పాపం ఆ బ్రహ్మ యే ముహూర్తంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించాడోగానీ, ఆయనక్కూడా ‘రిమ్మతెగులు’ పుట్టేలా ఆయన చేత అనేక గుళ్ళలో ఉత్సవాలు జరిపించేస్తున్నారు!  

రేపు సెప్టెంబర్ లో మొదలౌతాయి శ్రీ వారి ‘వార్షిక’ బ్రహ్మోత్సవాలు. మొన్ననే మొదలయ్యాయి ‘కాణిపాక’ వినాయక బ్రహ్మోత్సవాలు! శ్రీ కాళ హస్తీస్వరుడికో యెవరికో మొన్న ముగిశాయి.  

ఇక మొన్ననే మా వూరి దగ్గరలో వున్న ‘తలుపులమ్మ’కి పూర్తయ్యాయి. రేపెప్పుడో మావూరి ‘పుంతలో ముసలమ్మ’కి ప్రారంభమౌతాయి! తరవాత ఇంకో ‘రాట్నాలమ్మకి’ ఇంకో ‘ఆంజనేయుడికి’ ఇలా!  

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, రోజూ రెండుపూటలా స్వామి తన వాహనాలపై శ్రీమాడ వీధుల్లో భక్తుల కనులపండువుగా వూరేగుతారు. బాగానే వుంది.  

మరి నాకర్థం కాని విషయం—ఓ నాలుగడుగులు ముందుకి స్వామివారిని తీసుకెళ్ళగానే, వాహనాన్నీ, స్వామినీ, పక్కన అర్చకుల్నీ ‘దండెల’పై మోస్తున్నవారు, పైకీ కిందకీ యెగరేస్తూ వుంటారు! ఇది యెందుకో యెవరికైనా తెలుసా? (తెలిస్తే చెప్పండి—లేకపోతే నన్నడగండి.)  

అలా యెగరేస్తూంటేనే, మొన్నోసారి ఓ ‘దండె’ దూలం విరిగిపోయి, స్వామితో సహా భూపతనం కావలసిన పరిస్థితి వచ్చింది!  

ఇక, ఇదివరకు ఈ ‘స్నపన తిరుమంజనాలూ’ అవీ జరిగేవో లేదో తెలియదుగానీ, ఇప్పుడు టీవీలకోసం సుశిక్షిత సైనికుల్లా అర్చకస్వాముల శిష్యులూ, ప్రశిష్యులూ కాడ చెంబుల్ని పంచామృతాల్లో ముంచడం, అవి స్వాములకి అందించడం ఓ రెండు మూడు గంటల కాలక్షేపం!


తరవాత ఉత్సవ మూర్తుల్ని తుడవడం, అలంకరించడం—ఇలాంటి వాటికో రెండు గంటలు—ఇలా మరో కాలక్షేపం! (మరి ఆ గంగాళాలకొద్దీ పంచామృతాలు యే డ్రెయినేజీల్లో కలుస్తున్నాయో!)  

అగ్నిహోత్రానికి ఓ రెండో రెండున్నరో అడుగుల చదరం లో ఇటుకలతో కుండం నిర్మించి, లేనిపోని తిప్పలు పడడం! 

కుండానికి నాలుగుపక్కలా మంత్రాలతో దర్భల్ని వుంచుతారు. తరువాత, ‘…………అనుమతేన మన్యస్వాహ్ సరస్వతేన మన్యస్వాహ్……………..’ ఇలా కుడిచేతి మూడువేళ్ళతో వాటిపై ఓ దిక్కునించి ఇంకోదిక్కుకి నీళ్ళు జల్లుతారు.  

మరి కర్త చేతులు అంతపొడవు వుండవుగా! అందుకని కుడిపక్క మంత్రం చెప్పే ఆయనకీ, యెడమపక్క ఇంకో శిష్యుడికీ, యెదురుగా టీవీ కెమేరా ఆపరేటర్లకీ ఇచ్చి, వాళ్ళచేత పెట్టిస్తున్నారు దర్భలు! (నీళ్ళు జల్లడం నాకు కనిపించలేదు—కెమేరా స్థంభాలమీదకీ, సీలింగుమీదకీ తిరిగి పోవడం తో!)  

ఇక మంత్రం చెప్పే ఆయన చెప్పుకుంటూ పోతే, కర్త పెదాలు కదుపుతూ, గబగబా యాక్షన్ చేశేస్తూ వుంటాడు! (వీళ్ళముందూ యే డబ్బింగు ఆర్టిస్టులూ, ఉత్తరాది హీరోయిన్లూ దిగదుడుపే!)  

యెందుకంటారు ఇవన్నీ?  

ఈ భక్తి చానెల్ని మూసేస్తే యెంతబాగుండును! శ్రీవారి పవిత్రత కాస్త నిలబడును—అనిపిస్తూంటుంది నాకు.  

ఆలోచించండి!

14 comments:

హేతువాది said...

దేవునికి అన్ని రకాల సేవలు చేస్తునారు ... బాగానేఉంది. మరి ఉదయానే ముగించాలిసిన కాల కృత్యాల మాట మరిచిపోయారు, పాపం దేవుడు ...ఎన్నాళ్ళనుండో మల,మూత్రాదుల సేవలు లభించక ఎలా ఉన్నాడో!!

విజయ క్రాంతి said...

అయ్యా హేతువాది గారు , ఏమిటి మీ ప్రొఫైల్ లో నుండి మీ ఫోటో ,మీ వుద్యోగం తీసేసారు ? ఆ మాత్రం ధైర్యం లేని మీరు హేతువాదం గురించి మాట్లాడితే జనాలు ఎలా నమ్ముతారు సర్ ?

ఇక కృష్ణ శ్రీ గారు , మీరు నా మాట విని కచ్చ శ్రీ అని మార్చుకోండి పేరు

Krishna Sree said...

డియర్ హేతువాది!

మనలో మన మాట—శిలా విగ్రహాలు ‘అవి రెండూ’ విసర్జించవు కనక సరిపోయింది! లేకపోతే….!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ విజయ క్రాంతి!

హవ్వ! ఇదెక్కడి అభియోగం!

నా అన్ని బ్లాగుల్లోనూ, నా ఫోటో, ప్రోఫైల్ వివరాలూ, నా బ్లాగు లిస్టూ అన్నీ కనిపిస్తూనే వున్నాయే!

మరి మీ బ్రౌజర్ లోపమా—మీ దృష్టి లోపమా మీకే తెలియాలి!

నా పేరు ‘కృష్ణ శ్రీ’, నేను బ్యాంకులో వుద్యోగం చేస్తున్నాను—ఇప్పుడింకా మూడేళ్ళకు పైగా వుద్యోగం వుంటుంది!

ఇంకో విషయం—నేను యేది వ్రాసినా నేను మనసారా నమ్మినదీ, ఆచరించేదీ—పదిమందికీ తెలియాలనుకున్నవే వ్రాస్తున్నాను! యెవరికీ భయపడాల్సిన అవసరం లేదు కనకనే ‘ఓపెన్’ గా వ్రాస్తున్నాను! గ్రహించండి!

ధన్యవాదాలు!

Asmita said...

:)

Dear Krishna Sree garu!

Vijaya Kranthi's half comment is for Hetuvadi , don't get confused
she/he suggested only your name change! not about your pic and details

Emito! ee roju blogs lo andaru Marthanda/praveen sarma avutunnaru:)

Malakpet Rowdy said...

ఎన్నాళ్ళనుండో మల,మూత్రాదుల సేవలు లభించక ఎలా ఉన్నాడో!!
___________________________________

వాటిని సేవించే 'హేటు'వాదులుండగా, వేరే సేవలు ఎందుకూ?

Told ya! I can be as rude as you.

మధు said...
This comment has been removed by the author.
మధు said...

@ హేతువాది: మీ కామెంట్ మీ మనోవికారానికి పరాకాష్ట. మీ తండ్రో, తల్లో పోయాకా ఫోటో పెట్టి దండ వేస్తారు కదా.... ఆ ఫోటో కి దణ్ణం పెట్టుకుంటారు కదా ..... అప్పుడు గుర్తుకు తెచ్చుకోంది మీ ' మల మూత్రాది సేవలు ' కుదిరితే వాళ్ళకు చేయగలరేమో చూడండి.

@krishna sree: your response to hetuvaadi shows ur maturity level as a human being....shame on you.

Malakpet Rowdy said...

Hey hey dont go too personal. Talk about the bullcrap he writes but please dont bring in personal things. What did his parents do?

Krishna Sree said...

Dear Asmita!

Thank you for correcting me. Actually I did'nt notice the same in my haste.

డియర్ విజయక్రాంతి!

అంత కచ్చ యెందుకు నామీద!

అవును--సక్రమంగా లేని యేది చూసినా నాకు కచ్చగానే వుంటుంది!

ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ మధు!

'మనలో మనమాట ' అని వ్రాసేవి సరదా కోసం వ్రాసేవి!

ఇంగ్లీషు లో 'in a lighter vein' అంటారు!

వాటిని చూసి ఆవేశపడిపోకూడదు!

ధన్యవాదాలు!

హేతువాది said...

ఓ నాలుగడుగులు ముందుకి స్వామివారిని తీసుకెళ్ళగానే, వాహనాన్నీ, స్వామినీ, పక్కన అర్చకుల్నీ ‘దండెల’పై మోస్తున్నవారు, పైకీ కిందకీ యెగరేస్తూ వుంటారు!
ఇది యెందుకో తెలిస్తే చెప్పండి

Malakpet Rowdy said...

అలా రండి దారికి హేతువాది గారూ. పిచ్చి పిచ్చి వ్రాతలు రాస్తే సమాధానాలు కూడా ఎలా ఉంటాయో చూశారు కదా! ఇప్పటికైన కాస్త బుధ్ధి తెచ్చుకున్నారు సంతోషం!!

Krishna Sree said...

డియర్ హేతువాది!

హమ్మయ్య! అడిగారా?

ఇదివరకెప్పుడో నా వేరేటపాలో వ్రాసినట్టే గుర్తు!

అయినా మళ్ళీ వ్రాస్తాను!

సింపుల్ గా చెప్పాలంటే--అది ఓవర్ యాక్షన్!

నా తరువాత టపా చదవండి.

ధన్యవాదాలు!