Thursday, April 1, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.........

"రిజర్వేష కావేషాలు"

ఈ మధ్య అదేదో సినిమాలో హీరోనే కాకుండా ఐదారు పాత్రలు 'పింజారీ' అనే మాటని వాడాయట. 

'అదిగో! మా కులం పేరెత్తారు. ఆ సినిమా వాళ్ళు క్షమాపణలు చెప్పాలి--లేకపోతే సినిమా ఆడనివ్వం!' అన్నారట ఓ కులం వాళ్ళు.

పూర్వం 'థగ్గులూ' 'పిండారీలూ' మొదలైన జాతులవాళ్ళు వుండేవారట.  వీళ్ళు దేశద్రిమ్మరులు. వీళ్ళ ముఖ్య వృత్తి 'దోపిడీలు, దొంగతనాలు, హత్యలు'.  వీళ్ళకీ, చెంఘిజ్ ఖాన్ కీ భయపడే (చెంఘిజ్ ఖాన్ వీళ్ళ జాతివాడేమో నాకు తెలియదు) ఈ నాడు ప్రపంచవింతల్లో ఒకటైన చైనా మహా కుడ్యాన్ని నిర్మించారు అప్పటి పాలకులు. అంతేకాదు--అఫ్ఘనీస్థాన్, బెలూచీస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం లలో బలమైన కోటలు పాలకులు కట్టించుకున్నది కూడా వీళ్ళకి భయపడే!

థగ్గులని ఇంగ్లీషువాళ్ళు స్వీకరించి, 'థగ్' అనేమాటని వాళ్ళ భాషలో ప్రవేశపెట్టుకున్నారు.  మనవాళ్ళు పిండారీలని 'పింజారీలు' గా స్వీకరించారు.

ఈ మాటకీ, 'పొడుగు పింజ' పొట్టి పింజ' 'దూది పింజ' లకీ సంబంధం అంటగట్టి, దాన్ని ఓ కులానికి అన్వయించిన మేథావి యెవరో--వాడికి శిరసు వంచి పాదాభివందనం చెయ్యడం కాదు--తోలు వొలవాలి!

ఇక రిజర్వేషాల విషయానికొస్తే.........."సమాజం లో 'అణగారిన వర్గాలకి' (అణగద్రొక్కబడ్డకాదు--గమనించండి) కొంత వెసులుబాటు కల్పించి, నిర్ణీత సమయం లో వాళ్ళని పై వర్గాలతో సమం చెయ్యడం" అనే వుదాత్త ఆశయం తో మన పెద్దలు రాజ్యంగం ద్వారా కల్పించిన రక్షణ కవచాలు అవి.

ఈ ఆశయం కోసం, కొన్ని కులాలనీ, వర్గాలనీ గుర్తించింది ప్రభుత్వం.

అసలు కులాలు యెలా యేర్పడ్డాయి?

మనిషి అవలంబించే వృత్తుల్ని, వంశ పారంపర్యంగా కొనసాగించడం తో, అవి కులాలుగా స్థిర పడ్డాయి. 

మనువు చెప్పాడు, విష్ణువు ముఖం లోంచి ఓ కులం, భుజాల్లోంచి ఓ కులం, పొట్టలోంచి ఓ కులం, తొడల్లోంచి మరిన్ని కులాల వాళ్ళూ పుట్టారు--ఇవన్నీ 'ట్రాష్'!--"ప్రక్షిప్తాలు"--అంటే "ఇన్సర్టెడ్"!

శతాబ్దాలుగా ఈ కుల వ్యవస్థ మన దేశం లో వ్రేళ్ళూనుకోడానికి, 'ముందుబడిన కులాలతో' సమానం గా 'వెనుకబడ్డ కులాలకీ' బాధ్యత వుంది!

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

7 comments:

Nrahamthulla said...

రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 60 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.

A K Sastry said...

డియర్ Nrahamthulla!

మీరన్నట్టు జరిగితే యెలా వుండేదో!

కాని, బుందేల్ ఖండ్ యుధ్ధాల్లో ఓడిపోయిన రాజ్యాల్ని ఆక్రమించి, జోహార్ చెయ్యగా మిగిలిన హిందూ స్త్రీలని మహమ్మదీయ సైనికులు అనుభవించగా, వాళ్ళకి కలిగిన సంతానాన్ని 'బొందిలీలు ' అని వ్యవహరిస్తున్నారు.

వీళ్ళని మహమ్మదీయులు వాళ్ళలో కలవనివ్వలేదు--వాళ్ళు హిందువులలో కలవడానికి ఇష్టపడలేదు. ఈ రోజు దయనీయ పరిస్థితుల్లోనే కొనసాగుతున్నారు.

వీళ్ళ ప్రసక్తి ప్రస్తుత 'ముస్లిం రిజర్వేషన్ బిల్లు ' లో వుందో లేదో నాకు తెలియదు.

మరి రోళ్ళు తయారు చేసేవారు, గంట్లు కొట్టేవాళ్ళు, దూదేకుల వాళ్ళు అన్ని మతాల్లోనూ వున్నారు--వాళ్ళలో మహమ్మదీయులకే రిజర్వేషన్ ఇవ్వడం యేవిధం గా సబబో పెద్దలే చెప్పాలి.

Nrahamthulla said...

మహమ్మదీయుడి కంటే ముందు వాడొక మనిషి.సాటి భారతీయుడు.బ్రతుకుతెరువు లేని పేదవాడు.మానవత్వం చూపించాలి.మతంపేరుతో అతనికి ఏహక్కులూ అవకాశాలూ ఇవ్వకూడదా?ఎప్పుడో ఎవడో కిరాతకుడు చేసిన పనికి ఎన్నాళ్ళు నేటి తరం అవమానం పడాలి?రోళ్ళు తయారు చేసేవారు, గంట్లు కొట్టేవాళ్ళు,అన్ని మతాల్లోనూ వున్నామిగతా మతాల్లోని వారికి ఎంతోకొంత వారివారి కులాలరూపంలో రిజర్వేషన్ దొరికింది.ఇస్లాం మతంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వకూడదని అడ్డుకోవడం అన్యాయంకాదా?అసలు ఈ రిజర్వేషన్ అందుకునే అవగాహనేలేక గంటాఫకీర్ లాంటి వాళ్ళు అల్లాడుతుంటే అగ్రవర్ణ ముస్లిములే గంటాఫకీర్ అవతారాలెత్తి ఈ సీట్లలో దూరుతున్నారట.పేదరికం ఆత్మాభిమానాన్ని హరించి ఎంతగా మనిషిని దిగజారుస్తుందో చూడండి.మతం కంటే మానవత్వమే మంచిది. ఎన్నో కమీషన్లు వారి పరిస్థితి దళితులకంటే హీనంగా ఉందని రిపోర్టులు ఇచ్చాయి.రిజర్వేషన్ కు మతం ప్రాతిపధిక వద్దు అనుకుందాము.మరి ఏ రకంగా ఆ వర్గానికి సాయం చెయ్యాలి?మతం మానవత్వాన్ని హరిస్తూ ఉంది కాబట్టే ఇకనైనా కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయటం మంచిదని నా భావన.

Nrahamthulla said...

బొందిలి,దూదేకుల ఇప్పటికే బిసి.బి గ్రూపులో ఉన్నాయి.మెహతార్ లు బి.సి.ఏ గ్రూపులో ఉన్నారు.ముస్లిముల్లో సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన ఈ 14 తరగతులకు బి.సి.ఇ గ్రూపులో రిజర్వేషన్ ఇచ్చారు:
* 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
* 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
* 3. దోభీ ముస్లిం , ముస్లిం దోభీ , ధోబి ముసల్మాన్ , తురక చాకలి , తురక చాకల , తురుక సాకలి , తురకల వన్నన్ , చాకల , సాకలా , చాకలా , ముస్లిమ్ రజకులు
* 4. ఫకీరు , ఫకీరు బుడ్‌బుడ్కి , గంటి ఫకీర్, గంటా ఫకీర్లు , తురక బుడ్‌బుడ్కి , దర్వేష్ ఫకీర్
* 5. గారడీ ముస్లిమ్ , గారడీ సాయిబులు , పాముల వాళ్లు , కనికట్టు వాళ్లు , గారడోళ్లు , గారడిగ
* 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు
* 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు
* 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
* 9. లబ్బి , లబ్బాయి , లబ్బన్ , లబ్బ
* 10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల
* 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
* 12. షైక్, షేక్
* 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
* 14. తురక కాశ, కుక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె,
* 15. ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు

Kathi Mahesh Kumar said...

"ఈ కుల వ్యవస్థ మన దేశం లో వ్రేళ్ళూనుకోడానికి, 'ముందుబడిన కులాలతో' సమానం గా 'వెనుకబడ్డ కులాలకీ' బాధ్యత వుంది!" కొంచెం వివరించగలరా?!

Nrahamthulla said...

http://www.dalitvoice.org/Templates/april2010/reports.htm చూడండి.

A K Sastry said...

డియర్ Nrahamthulla!

చాలా చక్కటి సమాచారం ఇచ్చారు. నేనూ ఇవన్నీ చదివినవే గాని, చాలా వరకు మరిచి పోయాను. ముఖ్యం గా బీసీల్లో మీరు ప్రస్థావించినవి మళ్ళీ గుర్తించాను.

ముఖ్యం గా మీరు ఆవేశ పడకుండా వివరించిన తీరు నచ్చింది.

చాలా సంతోషం.

యెందుకో మీరు సూచించిన లింక్ పని చెయ్యడం లేదు.

ధన్యవాదాలు.