Friday, December 31, 2010

కాంగీ పార్టీ

కొన్ని పచ్చి నిజాలు......కొన్ని.......లు

"కాంగ్రెస్" పార్టీ 125 యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, "కాంగ్రెస్....భారత జాతి నిర్మాణం" పేరిట ఓ పుస్తకాన్ని మొన్నటి ప్లీనరీలో ఆవిష్కరించారట.

దాంట్లోని కొన్ని పచ్చి నిజాలూ, కొన్ని అవాకులూ చెవాకులూ ఇలా వున్నాయిట.

ప.ని.లు:

1. అత్యయిక పరిస్థితి రోజుల్లో, ఇందిరాగాంధీ వద్ద ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అపరిమిత అధికారాలు కేంద్రీకృతమయ్యాయి.

సాధారణ రాజకీయ ప్రక్రియలు, ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై నిర్బంధాలు విధించారు. న్యాయ వ్యవస్థ అధికారాలు తగ్గించారు.

2. ఆ సమయంలో సంజయ్ గాంధీ పలు ప్రభుత్వ విధానాల్ని నిర్హేతుకంగా, నిరంకుశంగా అమలు చేశారు.

ఆయన గొప్ప గుర్తింపుతో నేతగా యెదిగారు. ఆయన మద్దతుతోనే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలని తీవ్రస్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది.

ఆయన మురికివాడల తొలగింపు, వరకట్న వ్యతిరేకత, అక్షరాస్యత పెంపునకు కృషి చేశారు. కానీ నిర్హేతుక, నిరంకుశ విధానాలవల్ల వాటిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

3. రాజీవ్ గాంధీ....ప్రభుత్వంలో, పార్టీలో తన బృందాన్ని తరచూ మార్చేసేవారు, పార్టీలో సంస్థాగత సంస్కరణల విషయంలో విఫలమయ్యారు.

4. పీ వీ నరసిం హారావు, ప్రథానమంత్రి పదవిలో అయిదేళ్లు పూర్తి చేసుకున్న తొలి 'నెహ్రూ-గాంధీ కుటుంబేతర' వ్యక్తి. రాజీవ్ గాంధీ పార్టీనేతగా వున్నప్పుడు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక సంస్కరణల ప్రక్రియను కొనసాగించిన పీవీ ప్రభుత్వం 'విజయవంతమైంది'.  

5. భరత సహజ శత్రువైన పాకిస్థాన్ అమెరికా స్నేహంతో బలోపేతమయింది.

6. ఆర్థిక దిగ్గజంగా యెదిగిన చైనా ప్రస్తుతం వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల్లో, భారత్ వైపు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

7. యూపీయే-2 ప్రభుత్వానికి ధరల పెరుగుదలే ప్రథాన సమస్యగా మారింది. (ఇది ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక వ్యాఖ్యట.)

ఇంక ఇవాళ్టి ముఖ్య ఆర్థిక వార్త....ఆహార ద్రవ్యోల్బణం 14.44 శాతానికి పెరిగి, పదివారాల గరిష్ట స్థాయికి చేరిందిట--మొన్న 18వ తేదీనాటికి.

ప్రథాని అధ్యక్షతన సమావేశమైన ధరలపై యేర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. అంతకు ముందే, ప్రణబ్ ముఖర్జీ 'కూడా' అందోళన వ్యక్తం చేశారట!

దానికి అనేక కారణాలు చెపుతున్నారు....మన "ఆశ్వయుజ, కార్తీక" లతో సహా!

అ.చె.లు:

1. (లోక్ నాయక్) జయప్రకాష్ నారాయణ్ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టలేకున్నా, ఆయన సిధ్ధాంతమైన 'సంపూర్ణ విప్లవం' అస్పష్టం. ఆయన వుద్యమం 'రాజ్యాంగ విరుధ్ధం'. అప్రజాస్వామికం.

2. వుత్తరప్రదేశ్, తదితర రాష్ ట్రాల యెన్నికల్లో యువనేత రాహుల్ గాంధీ చొరవ ప్రశంసనీయం. 

3. మన్మోహన్ సింగ్ యూపీయే ప్రభుత్వానికి 'స్థిరత్వ' ఇమేజ్ కల్పించారు.

4. సోనియా ప్రథాని పదవి తృణీకరించి 'త్యాగమయి' అయ్యారు.

5. గత యెన్నికల్లో పార్టీ 29% వోట్లతో, 206 సీట్లు సాధించి, ప్రాంతీయ పార్టీల యెదుగుదలని 'కొంతవరకు' అడ్డుకుంది.

ఇక, కాంగీల పుస్తకం పై, పాయింట్లవారీగా నా వ్యాఖ్యలు మరో టపాలో.

3 comments:

jaggampeta said...

నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

A K Sastry said...

డియర్ SRRao!

చాలా సంతోషం. మీక్కూడా నూతన సంవత్సరం నిత్యనూతనంగా గడవాలని నా ఆకాంక్ష.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ jaggampeta!

మల్లిశ్రీ.....మీ శుభాకాంక్షలతో అప్పుడే వసంత సమీరం వీచినట్టయింది.

మీ టపాలోని జోక్స్ చాలా బాగున్నాయి. కీపిటప్.

మీక్కూడా నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.