......వచ్చిన 2011
4. కూరగాయలు కొనాలంటే మీరు యెంత దూరం వెళ్తారు? యెంత పట్టుకెళ్తారు? బ్యాంకులు వీటికోసం అప్పులు ఇస్తాయా? వుల్లిదోశ మానేసి ప్లెయిన్ దోశ తింటే, మీరు ఆదా చెయ్యగలిగేదెంత?
జ : మళ్లీ మే, జూన్ ల వరకూ యెంతో దూరం వెళ్లవలసిన అవసరం రాదు--మీదగ్గరకే వస్తాయి, ప్రతీ రోడ్డు ప్రక్కనీ రాశులు పోసి అమ్ముతారు! తక్కువరేట్లకే కావలసినన్ని కొనేసుకోవచ్చు. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఆ అవసరం రాదు. వుల్లి దోశలూ, కూరగాయల సలాడ్లూ, పిండివంటలూ అన్నీ తినొచ్చు.
యెందుకంటే, మనదేశం లో జనాల మనస్తత్వం ప్రకారం, ప్రక్కవాడు పదిరూపాయలు యెలా సంపాదిస్తే, అందరూ అదేపని చేస్తారు--యెవరికీ గిట్టుబాటు కాకుండా పోయే వరకూ! అందరూ అన్నిరకాల కూరలూ పండిస్తారు.....వాతావరణం కూడా అనుకూలంగా వుంటుంది; విపత్తులు వుండవు; దిగుబడులు బాగుంటాయి!
మన ప్రభుత్వాలు కూడా, ప్రజలు దాహం వేస్తోంది అంటూంటే, అప్పుడు తవ్వడం మొదలుపెట్టిన నూతులు, ఇప్పటికి పూర్తవుతాయి--దిగుమతులు కూడా ప్రారంభం అవుతాయి!
యెటొచ్చీ మార్కెట్ల పరిస్థితే దిగజారుతూ వుంటుంది. అమ్ముకోలేక, పశువులకి పెట్టెయ్యడం, రోడ్ల ప్రక్కన పారబొయ్యడం వరకూ వస్తుంది.
ఆ రెండునెలలూ, ఆ తరవాత నవంబరు, డిశెంబరులూ కథ మళ్లీ మామూలే! అప్పటి సంగతి ఇప్పుడే ఆలోచించే వాళ్లెవరైనా వున్నారంటారా? వీటికి పరిష్కారం లేదా?
ఖచ్చితంగా వుంది.
మొదటిది--దొరికినప్పుడే కొనేసుకొని, వొరుగులు పెట్టేసుకోవడం ఓ పధ్ధతి. పత్రికల్లో ఆ విధానాలు వ్రాస్తున్నారు. చదివి ఆచరించండి. పచ్చళ్లూ, వూరగాయలూ పెట్టేసుకోండి.
రెండోది--తక్కువ ఖర్చుతో, కూరగాయల్ని ముఖ్య మార్కెట్లనుంచి వినియోగదారులకి తరలించగలగడం. దానికి కావలసింది పక్కా ప్రణాళికతోపాటు, నిజాయితీగల బుర్ర వున్న అధికారులు.
రవాణా చెయ్యవలసింది--"ఇన్సులేటెడ్ వ్యాన్ల" ద్వారా.
అదెలా అంటే.......
.......మరోసారి.
2 comments:
గురువు గారు, ఈ మద్య న కొంచెమ్ గెప్ వచ్చినట్లు వుంది!. We (readers) are missing you.
మరేనండి!
కొంతేమిటి....చాలా గేప్ వచ్చింది. కారణం మరేమీ లేదు....ఫణిబాబుగారన్నట్టు....40 యేళ్లుగా కలవని బంధువులనీ, స్నేహితులనీ కలవడానికి వూళ్లు తిరగడం, కొన్ని తింగర ప్రయత్నాలూ, కొంత సంఘ సేవా.....ఇలా! అవన్నీ టపాలు వ్రాయాలనే వుంది......కుదరాలి మరి.
వ్రాసినవే చాలా వున్నాయి.....ప్రచురించేలోపల రిలవెన్స్ తగ్గడమో, ప్రయారిటీలు మారడమో....తప్పదు మరి!
చూద్దాం....యెన్ని వ్రాయగలనో!
ధన్యవాదాలు.
Post a Comment