విస్తృత సంప్రదింపులు
మనదేశంలో కాంగీవాళ్లూ, మీడియా వాళ్లూ 'ఓ ప్రత్యేకజాతిగా' గుర్తించినవాళ్ల (ప్రపంచ వ్యాప్తంగా వున్న ఓ మతానికి సంబంధించిన.....కాదు!) పండుగ తరవాత, ఓ నిర్ణయం వస్తుంది అని వూదరగొట్టారు--బొచ్చె లాంటివాళ్లు.
గులాం నబీయేమో, తాంబూలాలు ఇచ్చేశాను....కోర్ కమిటీవాళ్లే తన్నుకు చస్తారు--అనేశాడు.
మధ్యలో మాయ వేసిన బ్రేకు లో పడి, "రెండో ఎస్సార్సీ" అన్నారొకడో, ఇద్దరో!
"ఆమాటన్నవాడి నాలుక చీరేస్తాం. గొంతుక కోసేస్తాం" అనలేదు బక్కన్న.
ఇంతకీ, రోకలి తన పన్నుతోసహా నానిందా?
అప్పుడేనా!
ఇవాళ మన నీలం పాగా గడ్డపోడు "విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి, ఆ పనిమీదే వున్నాం" అన్నాడు.
మాయమ్మేమో, "నా రాజ్యానికివచ్చినప్పుడే నీ నోరులేస్తోందేమి బిడ్డా? ఢిల్లీ లో నీతల్లికి సమ్‌ఝాయించు బే!" అని గర్జించింది.
గజం మిధ్య, పలాయనం మిధ్య!
2 comments:
LOL
phani
పై అన్నోన్ (phani)!
మెచ్చితే మేకతోలు కప్పినట్టు కాదు. "అసలు విషయం" పై వ్యాఖ్యానించాలి!
అబ్బే! వూరికే అన్నా!
Post a Comment