Monday, November 14, 2011

వుత్సవాలు.....3



......వైభవంగా

.......జరుగుతున్నాయి--రాష్ట్రమంతటా. 

మా చిన్నతనంలో, మా మేష్టార్లు చెప్పేవారు--"జాతీయ దుబారా" (నేషనల్ వేస్ట్); "నేరమయ దుబారా" (క్రిమినల్ వేస్ట్)--ల గురించి. 

పగటిపూట ఎలెక్ ట్రిక్ లైటు వెలిగించినా, యెవరూ లేనిచోట ఫాన్ తిరుగుతున్నా--అవి "అలాంటి వేస్ట్"లు అని.

మనం ప్లగ్ పాయింట్ల స్విచ్చులు కట్టేసినా, టీవీలూ వగైరా "స్టాండ్ బై"లో పెట్టినా, యెంతో కొంత కరెంటు "కాలుతుంది" అనీ, వుత్తమ విధానం ఆ ప్లగ్ పిన్స్ ని తొలగించడమేననీ శాస్త్రఙ్ఞులు చెపుతున్నారు. 

మన ఎస్పీ బాలు కూడా చెపుతున్నాడు!

మనందరం ఇంత "జాగ్రత్తగా" కరెంటు వాడుకుంటూంటే.......

అనేక "గుళ్ల"లో, "దేవాలయాల"లో, "పందిళ్ల"లో, ఇవేకాకుండా పర్యాటక స్థలాల్లో, పుట్టినరోజు, సమర్త లాంటి ప్రైవేటు ఫంక్షన్లలో--ఇలా ప్రతీ చోటా "సీరియల్ లైట్లు" దండలు దండలుగా వెలిగించడం, పేపర్లలో "వైభవంగా...." అంటూ వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి.....ప్రతీరోజూ చూస్తున్నాం.

మరి, వీటన్నింటికీ అయ్యే "కరెంటు ఖర్చు" యెవరిస్తున్నారు? యెవరిచ్చినా, అదంత అవసరమా? 

కరెంటు దీపాల్లేనిరోజుల్లో, గుళ్లెక్కడున్నాయో ప్రజలకి తెలియదా? వాళ్లు పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ చేసుకోలేదా? 

ఇదంతా యెవడబ్బ సొమ్ము?

భక్తి పేరుతో, ఆ "లైటింగు"వాళ్లు బాగుపడడానికి (వృధ్ధిరేటులో వాళ్లూ భాగమేకదా!), "జాతీయ దుబారా" కోసం, కాక ఇవేమిటి? (వాళ్లూ బ్రతకాలిగా?!).

అందుకే.......భక్తి వ్యాపారులూ జిందాబాద్!

2 comments:

Anonymous said...

> వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి
వార్తలు వ్రాయించుకోవడం ఉచితం కాదేమో? ఎంతోకొంతో ముట్టచెప్పాలేమో?

A K Sastry said...

పై అన్నోన్!

మరదే!.....వ్రాయించుకోవడం అని తప్ప ఇంకేమైనా అన్నానా?

డబ్బులఖ్ఖర్లేదు.....ఓ చిన్న "బుడ్డి" నుంచి....హైదరాబాదు లాంటి చోట్ల ఓ "ఇంటిస్థలం" చాలు....అంటాననుకున్నారా?

నాలుగో జాగీరంతా మనమీదకి వొంటికాలిమీద రాదూ?!

ప్రెస్ కౌన్సిలో యేదో....దాంట్లో ఫిర్యాదు చేశారంటే....ఇంతే సంగతులు.

అయినా "అసలు విషయం" గురించి మాట్లాడరేం? అన్నోన్ గా కూడా భయమే?