Monday, August 31, 2009

హేతువాదులు-10


వూరేగింపులు


దేవుళ్ళనీ, రాజులనీ, వధూవరులనీ పల్లకీ లో వూరేగించడం యెప్పటినించో వస్తున్న ఆనవాయితీ! కొంచెం పెద్దింటి మహిళల్ని మేనాల్లో అత్తవారిళ్ళకీ, పుట్టిళ్ళకీ పంపించేవారు! (వధూవరులని అలా వూరేగించడం ఇప్పుడు అనాగరికం! రాజులెలాగా లేరు! మేనాలు ఇప్పుడు అవసరం లేదు!)  


ఇవన్నీ, ఒకేఒక వెదురు బొంగు ఆధారంగా, ముందూ వెనుకా మోసేవాళ్ళ భుజాల మీద వుండేలా, మధ్య భాగం లో దేవుడైనా, రాజైనా, వధూ వరులైనా, మహిళలైన కూర్చోవడానికి అనువుగా పీఠాలూ, పైకప్పులూ, మేనాలకైతే తలుపులూ నిర్మించేవారు.  


ఆ బొంగులని ప్రత్యేకంగా 'కణాది బొంగు ' అనే జాతి వెదురు కర్రలతో తయారు చేశేవారు. (అలాంటి బొంగులతోనే ఆ రోజుల్లో, సోలలూ, అరసోలలూ, తవ్వలూ తయారుచేసేవారు.)  


మా చిన్నప్పుడు మా మాతామహులవారి వూరు వెళ్ళినప్పుడు ఓ వెదురు పొదలో పల్లకీ బొంగు ఆకారంలో వున్న ఒక లావుపాటి బొంగుని చూసి, 'అయ్యబాబోయ్! అంతలావు బొంగుని--ఆ ఆకారం వచ్చేలాగ యెలావంచారో?' అని ఆశ్చర్యపడిన మాకు, మా నాన్నగారు చెప్పారు--'ఆ వెదురు లేతగా, సన్నగా వుండగానే, అది పల్లకీకి పనికొస్తుంది అనుకున్నప్పుడు--దాన్నీ ఆ ఆకారం లో వంచి, తీగలతో కట్టేస్తారు--అదింక ఆ ఆకారం లోనే పెరుగుతుంది--పెద్దదయ్యాక దాన్ని నరికి, పల్లకీలు తయారు చేస్తారు.' అని.  


పల్లకీలో దేవుణ్ణి (వుత్సవ మూర్తులని) చక్కగా ఆసీనుణ్ణిచేసి, పడిపోకుండా చక్కగా బందోబస్తు చేసి, గుడిలోంచి బయటికి అర్చక స్వాములే స్వయంగా మోసుకొంటూ వస్తారు. గుడి గుమ్మం దాటేముందు--వాళ్ళ భుజం మీద వున్న పల్లకీ బొంగుని (దండెని) గుండ్రంగా ఇటూ అటూ తిప్పి, దేవుడు 'పడిపోవడంలేదు ' అని నిర్ధారణ చేసుకొని, బయటికి తెస్తారు (వూరిలోకి వెళ్ళాక విగ్రహాలు పడిపోతే, వూరికే అరిష్టం అని నమ్మేవారు!)--అక్కడనించి, చాకలివాళ్ళకి అప్పచెపుతారు పల్లకీ మోతని!  


అదీ ఈ అచారానికి మూలం.  


మరి ఈ రోజు, ప్రతీ నాలుగడుగులకీ ఆ దండెల్ని పైకీ కిందకీ యెగరెయ్యడం లో యేమైనా అర్థం వుందా--వేలం వెర్రి కాకపోతే!  


కాదంటారా?





19 comments:

Malakpet Rowdy said...

పాతకాలపు అలవాట్లు మార్చినవి కొన్ని ఉన్నాఇ - మారాల్సినవి చాలా ఉన్నాయ్. అందులో కొన్ని మనకి అక్కరలేదు కూడా. కాని మనం "పాత కాలపు అలవాట్లన్నీ మోసాలు" అనే కుహానా హేతువాదుల మధ్య "పెద్దలు చెప్పారు కాబట్టీ ప్రశ్నించకుండా విని తీరాలి" అనే అతివాదుల మధ్య నలుతున్నాంగా :))

Unknown said...

నేనూ అదే అనాలనుకున్నాను...ఎమ్మార్ గారు చెప్పేసారు...

kodali srinivas said...

డియర్ క్రిష్నశ్రీ గారికి అబినందనలు!
ఇలానే అన్నింటిని పరిసిలించుతూ పొతే ఏదో ఒకనాటికి మా మార్గం సరేనదేనన్న దానికి వస్తారు.
అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం. స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత.

Malakpet Rowdy said...

అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం
___________________________________

అది అసలైన హేతువాదం. అది వేరు, మీలాంటి కులగజ్జి పట్టిన మోసగాళ్ళు చేసే వాదం వేరు. అసలైన హేతువాదులు ఆధారాల్లేకుండా పిచ్చి వాగుడు వాగరు.

A K Sastry said...

డియర్ Malakpet Rowdy!

కాలానుగుణంగా అలవాట్లు మారుతూనేవున్నాయి--వేలం వెర్రిగా వాటిని పాటించేవారివి తప్ప!

నలగద్దు--'కుహనా'లైనా, 'అతివాదులైనా' ప్రశ్నించండి! యెవరు, యెక్కడ, యెప్పుడు చెప్పారు--అంటూ!

సమాధానం రాలేదో--మంచిది--వచ్చిందా, అది మీకు నచ్చిందా--ఓ కే! లేదా--వదిలెయ్యండి!

అంతే!

(నా 'కృష్ణశ్రీ' బ్లాగులో 'మంత్రాలూ--గాయత్రి ' టపా మీద 'మంగేష్' కామెంట్లనీ, నా సమాధానాలనీ చదవండి!)

-----------------------------------

'అసలైన హేతువాదులు ఆథారాల్లేకుండా పిచ్చి వాగుడు వాగరు '

అద్గదీ మాట!

కీపిటప్!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ ధరణీరాయ్ చౌదరీ!

నేనూ చెప్పేశాగా!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ హేతువాది!

మీ అభినందనలకి నా కృతఙ్ఞతలు!

'మీ మార్గం' యేమిటో నాకు తెలీదు--అది సరైందో, లేదో చెప్పే అర్హత నాకుందనుకోను!

మీ హేతువాద నిర్వచనం బాగానే వుంది.

'పున: సమీక్ష ' సంగతేమోగానీ, ప్రతీ విషయాన్నీ, 'కార్య, కారణ సంబంధాలతో, తర్క శాస్త్ర, హేతువాద రీత్యా' ఆలోచించడమే నేను నేర్చుకున్నదీ--గత 53 సంవత్సరాలుగా ఆచరణలో పెడుతున్నదీ!

ఇక 'మానవ (సమాజ) శ్రేయస్సు ' అనేది యెవరికి వారి దృక్పథం మీద ఆధారపడి వుంటుంది--శాస్త్రీయతతో దానికి సంబంధం లేదు!

అవునంటారా?

ధన్యవాదాలు!

kodali srinivas said...

మలక్ పేట రౌడి : నాకు కుల..ఉందని వాగు తున్నావు అంటేనే నీలో మనిషి చచ్చాడు.నీతో వాదనకు స్వస్తి పలికినతరువాత కుడా ,సంస్కార హీనం గా కుల పిచ్చి నసాలాని కెక్కి గజ్జి కుక్క కన్నా నీచంగా వ్యక్తి నిందకు పలుపడే నీలాంటి రౌడి, గుండా లకు హేతువాదులు బయపడరు. చేతనైతే సిద్దాంత పరంగా వాదన చేయి. పని పాటలు లేని జులాయిలతో తగాదాలు పడే తెరిక,ఓపిక నాకు లేదు. రెండవసారి నీతో వాదనలకు స్వస్తి.

Malakpet Rowdy said...

నీతో వాదనకు స్వస్తి పలికినతరువాత కుడా
__________________________

చా! నిజమా? మరి ముందు వ్యాఖ్యలో నాకు ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పిన వైనాన్ని ఏమనాలి? సిగ్గు లేని తనమా? కేరెక్టర్ లేని దగుల్బాజీతనమా?

చేతనైతే సిద్దాంత పరంగా వాదన చేయి
_______________________

అబ్బో! అబ్బబ్బో! సిద్ధాంతపరంగానే అడిగాను తమరు కూసిన కారుకూతలకి ఆధారాన్ని చూపించమని. అక్కడ తోకముడిచి సిగ్గు లజ్జ లేకుండా వేరే చోట కామెంట్లు రాసింది ఎవరో మరి!

సిధ్ధాంతపరంగా మళ్ళీ అడుగుతున్నా - మీరన్న మాటలకి ఆధారాలు చూపిస్తారా? ఆ విషయంలో వాదనకు దిగే దమ్ముందా?

ఇక్కడా ఎవడూ ఎవడికీ భయపడడు. కాని విషయం భయం గురించి కాదు .. లాజిక్ గురించి. మీ వాదనలో అది లోపించింది కాబట్టి తోక ముడిచి నోరు మూసుకుని కూర్చున్నారు .. చేసిన మోసం బయట పడేసరికి!

దమ్ము, సత్తా ఉంటే, మీరు చేసిన వ్యాఖ్యకి ఆధారాలు చూపించడి. అది చూపించేదాకా మీకు ఒకటే పేరు .. తప్పుడూ వ్రాతలతో జనాలని మోసం చేసే "మోసగాడు" అని.

పని పాటలు లేని జులాయిలతో తగాదాలు పడే తెరిక,ఓపిక నాకు లేదు
___________________________________________

తమకేం పనీ పాట ఉన్నయో తమ వ్రాతలు చూస్తేనే అర్ధమవుతుంది. LOL. People do know what your profile is and what mine is!

Malakpet Rowdy said...

నీలో మనిషి చచ్చాడు
____________________

Right! తమలాంటి చీడపురుగులతో వాదించడానికి తగినది నాలాంటి పశువులే.


Lets start it from the beginning:

This was the blog post

http://hetuvaadi.blogspot.com/2009/07/blog-post_25.html

అందులో తమరు శెలవిచ్చింది:

* ఈ దేశంలో సంపదంతా కేవలం రెండు వర్గాల చేతులలో ఉంది.నల్ల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వారు ఒక వర్గం ఐతే, ఒక వర్గం దేవాలయాల్లో,చెర్చిలలో,మసిదులలో మత పెద్దల ఆదీనంలో దాగున్నాయి.*

దానికి శ్రీకర్ వ్రాసినది:

భారత దేశం లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వాటి లో పని చేసె పూజారులు ఎంత మంది దగ్గర ఎంతెంత సంపద పోగు పడి ఉందో మీదగ్గర ఎమైనా సమాచారం ఉందా? ఉంటె తేలియజేయగలరు.

వెంటనే మీరు నాలుక కరచుకొని ( అప్పటికీ తప్పు ఒప్పుకోకుండా)

మత పెద్దల ఆదినంలో సంపద ఉన్నదంటే ... దేవాలయాల క్రింద,మసీదుల క్రింద, చర్చ్ ల క్రింద ఉన్నస్థిర,చర ఆస్తుల సంగతి గురించి.



తమరి కుక్క కాటుకి శ్రీకర్ చెప్పు దెబ్బ:

నేను మీరు ప్రొఫసర్ కనుక మీరు ఇతరుల మీద ఆరోపణలు చేసేట్టాప్పుడు మీదగ్గర తగినంత సమాచారం ఉంట్టుందని,మీదగ్గర నుంచి దానిని అంకెల రూపం లో తెలుసు కోవచనుకున్నా ను. అందువలననే నేను "భారత దేశం లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వాటి లో పని చేసె పూజారులు ఎంత మంది దగ్గర ఎంతెంత సంపద పోగు పడి ఉందో మీదగ్గర ఎమైనా సమాచారం ఉందా? ఉంటె తేలియజేయగలరు." అని అడిగాను. దానికి కారణం నేను ఎక్కువగా ప్రొఫసరస్ బ్లాగ్లు చదువుతాను వారు ఎమీ రాసినా అంకెలతో (స్టాటిస్టిక్స్ తో ) వివరిస్తారు కాబట్టి. కాని మీ సమాధానం చదివాక నాకు మా ఊరిలో పార్క్ లో కుచొని ఉబుసపోక మాటలు చెప్పుకునే వారికి మీటపా కి పెద్ద తేడా కనపడ లేదు.



దానికి మీ కారు కూతలు:

నేను స్టాటిస్టిక్స్ లో కాని ,ఆర్ధిక శాస్త్రం లో కాని ప్రొఫెసర్ను కాదు. సివిల్ ఇంజనీరింగ్ లో మాత్రమే నాకు ప్రేవేశం ఉంది.
ఇక పొతే మీరు అడిగిన గణాంక విషయాలకు వస్తే అదొక పెద్ద పరిశోధనా అంశం అవుతుంది. మీ బ్లాగ్స్ బట్టి మీ రంగం స్టాటిస్టిక్స్ కు సంభంధం ఉందనుకుంటున్నాను. దేశంలో ఉన్న అన్ని మత సంస్థల ఆస్తి పాస్తులు ,వాటి ఆదాయ వ్యయాలు లెక్కలు తేల్చి ,వాటిని మా బోటివారికి అందించితే మీ లాంటి వారికి తెల్పుతాం.అలాగే నాకు తెలిసిన మేరకు ఈ దేశంలో ఉన్న సంపదలో అత్యధిక భాగం మత సమస్థల చేతులలో వుందన్నది వాస్తవం.

( అంటే మీ దగ్గర లెక్కలు లేవు గానీ, ఆరోపణలు మాత్రం చేస్తారన్నమాట - ఇక్కడే తెలుసోంది తమరెలాంటి చీడపురుగులో)

Then I said:

Mind you - I am only asking you the "Scientific base" for your own arguments. Since you people always talk about Science, I am talking Science too. Let's prove or disprove your argument Scientifically - But are you willing to present your Data?



When you didnt answer,

I said

ఇదండీ మీ హేతువాదుల వరస. అరోపణలు చెయ్యండలో ముందే గానీ, దానికి ఆధారాలు అడిగితే మాత్రం రోజులకి రోజులు తినేస్తారు. లేకపోతే సమాధానం చెప్పకుండ తప్పించుకుంటారు :))

All I asked for was Data. So, if you are not presenting your Data, shall I assume that you made false allegations just to become popular?


and your stupid answer for that

శ్రీవారి డాలర్ల గోల్ మాల్ లో రాష్ట్ర హై కోర్ట్ టి.టి.డి. వారిని పక్షం రోజులలో స్వామి వారి ఆస్తులు,ఆభరణాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది.లెక్కలు రానియండి విషయం తెలుస్తూంది. ఇలాగే మిగిలిన అన్ని మత సంస్తలపైన కోర్ట్ లలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తె,నిజాలు బయటకు వస్తాయి.ఓపిక పట్టండి.

(దీనర్ధం ఏమిటి? మీ దగ్గర ఆధారాలు లేకపోయినా అడ్డమైన వ్రాతలు వ్రాసి జనాలని తప్పుదారి పట్టించడమేగా?)

కోడాలి శ్రీనివాస్ మార్కు హేతువాదం ఇదేనా? మీకన్నా పనీ పాట లేని జులాయిలు చాలా నయం. వాళ్ళు సమాజానికి మేలు చెయ్యకపోయినా, తమ లాంటి చీడపురుగుల్లా కీడు మాత్రం చెయ్యరు.

Malakpet Rowdy said...

తెలివి ఉన్నవాళ్ళు తమలాంటి దగాకోరు మోసగాళ్ళతో వాదించడం మానుకుంటే తమ బోటివారు అనే మాట ఏమిటి? "మా ప్రశ్నలకి సమాధానం లేదు" అని. కాని తమలాంటి మూర్ఖులకన్న పెద్ద మూర్ఖుడినైన నేను తగిలేసరికి "వాదానికి స్వస్తి" ... ఆహా! ఇదీ కోడాలి గారి హేతువాదం :))

Bhãskar Rãmarãju said...

మలక్ -
*నీలో ఉన్న మనిషీ* అంటే?
నీలో ఇంకో మనిషి ఉన్నాడా? సూపించు!! ఇదెలా సైంటిపిక్కుగా నిరూపించు, అట్టా ఇట్టా కాదు.

మంచు said...

అయ్యా హెతువాదిని అని చెప్పుకుంటూ రుజువులు , డెటా లేని పిచ్చిపిచ్చి అరొపణలు చేసే పెద్దమనిషి గారు..
మీరు మాలాంటి పని పాటలు లేని జులాయిలతో తగాదాలు పడే తెరిక,ఓపిక నాకు లేదు అని రాసారు. మీరు నేను ఇంతకు ముందు ఉదహరించిన లాంటి కామెంట్ లు పెడుతున్నంత కాలం మిమ్మల్ని వదిలేది లేదు.
http://teluguradical.blogspot.com/2009/08/blog-post_28.html లొ నీచమయిన మొదటి కామెంట్ మీదెనా ? మీరొక ప్రొఫెసరా..? మీరు గౌరవం ఇవ్వాలా?
ఒక కులాన్ని బహిరంగంగా తిడితే మీది కుల గజ్జి అనరా? http://naprapamcham.blogspot.com/2009/08/blog-post_23.html లొ మీరు రాసిన పనికి మాలిన కామెంట్ తెలీదా?
సిద్దంతపరమయిన వాదన చెయ్యడానికి మీదగ్గర విషయం వుందా.. దానికి ముందు మాకు మీ పై కామెంట్స్ కి సమాదానం చెప్పండి.

Malakpet Rowdy said...

నీలో ఇంకో మనిషి ఉన్నాడా? సూపించు!!
_____________________________

LOL I didnt say that! It was him!!


Machipallaki,

Well asked! I forgot about that Naprapancham thing

kodali srinivas said...

@మంచు పల్లకి:కామెంట్స్ కి సమాదానం.
౧. దేవునికి సుప్రభాతం, రెండు సార్లు నైవేద్యం,పెళ్లి, పవళింపు ....వంటి సేవలు చేసేవారు ,దేవుణ్ణి మానవ మాత్రునిగా భావించి చేస్తున్నారు. ఇది హేతు బద్దం గా లేదనే దానికి నేను "కాల కృత్యాల సేవ " దేవునికి లేదేమిటనినా ప్రశ్న...దానికి కృష్ణశ్రీ గారి సమాధానం సరిపోయాయి. పోని దేవునికి మీరు చేసేవి సరైనవిగా తలస్తే సమాధానం ఇవ్వండి. అసహనంగా వాగితే దానికి సమాధానం ఏముంటుంది? తిట్లు,శాపనార్ధాలు తప్ప.
౨. నా వుద్దేసంలో ''దోపిడీ చేసే పూజారి వర్గం" అంటే ... దేవుని పేరుతొ అమాయకులను దోపిడీ చేసే అర్చకులు,పాస్టర్లు,ముల్లాలు వంటివారు. ఇక్కడ 'దోపిడీ' అనే పదం ఒక వర్గానికే పరిమితం. అందర్ని కలిపి ఒకే గాటను కట్టి నేను అనటం లేదు. కాని దోపిడీ చేసే పూజారి వర్గం' లో నా భావాన్ని మీరు తప్పుగా అన్వహించుకొని, దాన్ని 'బ్రాహ్మణ కులాన్ని'గా భావించి దానికి ప్రతిస్పందిచారు. నేను బ్రహ్మనలందరిని కుల పరంగా దూషించి వారి మనసులు నొప్పించ్చాలనే ఉద్దేశం కానేకాదు. వారంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈ విషయం లో నేను ఎవరినైనా నొప్పించి ఉన్నట్లేయితే క్షంతవ్యుణ్ణి. బ్రాహ్మణులు సభ్యత, సంస్కారాలతో మాట్లడతారన్న నా కున్న అభిప్రాయాన్ని చెడగొట్టకండి.
వాస్తు పై సిద్ధాంత చర్చకి నేను సిద్దం అన్నా సమాధానం రాలేదు.

A K Sastry said...

వ్యాఖ్యాతలకి నా విఙ్ఞప్తి

డియర్ 'వ్యాఖ్యాతల్లారా'!

బ్లాగుల అర్థం, పరమార్థం మన భావాలని స్వేచ్చగా ఇతరులతో పంచుకోవడం.

మరి రెండేసి, మూడేసి 'సూడో నింస్ ' తో, అసలు విషయాన్ని పక్కన పెట్టి లేదా పక్కదారి పట్టించి, దేన్నీ పూర్తిగా చదివి ఆకళింపు చేసుకోకుండా, యెవరు యెవర్ని యేమన్నారో కూడా మరిచిపోయి, ఆవేశాలూ, కావేషాలూ వెదజల్లడం యేవిధం గా భావ్యం?

ఆలోచించండి!

మీలో సాఫ్త్ వేర్ ఇంజనీర్లూ, ప్రొఫెసర్లూ, ఆర్కిటెక్ట్ లూ--ఇంకా రకరకాలైన వృత్తులో వున్నవాళ్ళు వుండచ్చు! జులాయిగా తిరిగేవాళ్ళు బ్లాగుల్ని అధ్యయనం చెయ్యలేరనే నా నమ్మకం!

ముసుగులు తొలగించి, బయటికి రండి--ఆరోగ్యకరమైన, అర్థవంతమైన చర్చలు చేద్దాం! దానివల్ల పదిమందికీ మంచి జరుగుతుందని ఆశిద్దాం!

ధన్యవాదాలు!

Malakpet Rowdy said...

అసహనంగా వాగితే దానికి సమాధానం ఏముంటుంది? తిట్లు,శాపనార్ధాలు తప్ప
___________________________________

Exactly. పిచ్చి వాగుడు వాగితే సమాధానాలు కూడ అలాగే ఉంటాయి. చేతిలో కీబోర్డు ఉంది కదా అని పిచ్చి వ్రాతలు రాస్తే దానికి వచ్చే రియాక్షన్ కూడ అదే! మీ చేతిలోనే కాదు మా చేతిలో కూడ ఉంది కీబోర్డ్.

ఇక సిధ్ధాంతపరమైన చర్చ - నేను మాట్లాడుతోంది మీరు మత సంస్థలపై వ్రాసిన కూసిన కారుకూతల మీద సిధ్ధాంత పరమైన చర్చ. నేనెప్పుడైనా సిధ్ధం. తోక ముడిచి పారిపోయింది తమరే.

ఇక వాస్తు అంటారా? నాకు వాస్తు మీద పెద్దగా నమ్మకం లేదు. దాని మీద మీ పిచ్చి వాగుడిమీద అంతకన్నా నమ్మకం లేదు.



బ్రాహ్మణులు సభ్యత, సంస్కారాలతో మాట్లడతారన్న నా కున్న అభిప్రాయాన్ని చెడగొట్టకండి
___________________________________

మీరు మీకో అభిప్రాయం కూడాను! మీలాంటి వాళ్ళ అభిప్రాయాలూ, నాలాంటివాళ్ళ అభొప్రాయాలు ఎంత? సముద్రంలో కాకిరెట్ట!



కృష్ణశ్రీ గారూ, మీ బ్లాగులో ఇలా గొడవ పడ్డందుకు క్షమించండి. మిమ్మల్ని ప్రశ్నలడిగిన చోటే మీరు సమాధానం చెప్పారు. కానీ ఈ మోసగాళ్ళు పిచ్చి వ్రాతలు వ్రాసి తీరా వివరణ అడిగితే వేరే బ్లాగుల్లోకేల్లి కామెంట్లు చెయ్యబట్టే ఇలా వాత పెట్టాల్సొచ్చింది. వాళ్ళు మనుషులైతే కదా మాటలతో వినడానికి?

Malakpet Rowdy said...

నా వుద్దేసంలో ''దోపిడీ చేసే పూజారి వర్గం" అంటే ... దేవుని పేరుతొ అమాయకులను దోపిడీ చేసే అర్చకులు,పాస్టర్లు,ముల్లాలు వంటివారు
___________________________________

Do you have any evidence/data to support this?

Can you tell us all how much has been looted by the priests of the three religions?

Anonymous said...

మిగిలిన మతాల గురించి ఏమో కానీ, హైందవంలో దేవుని పేరుతో దోచుకునే దొంగ స్వామీజీలు అంటే కొంచెం అయినా నమ్మేట్లుగా ఉందిగానీ అర్చకులు దోచుకోవటమేమిటి? ఎక్కడా వినలేదు. ఒక వేళ ఖర్మ కొద్దీ కొండకచో ఉన్నా దానిని దేశ సంపద స్థాయిలో generalize చెయ్యటమేంటి విడ్డూరంగా...

BTW రౌడీ గారూ, మీరు నిన్న 2వ తేదీన ఇచ్చిన సమాధానాలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయి. నిజమైన హేతువాదులు హేతుబధ్ధంగానే జవాబులు ఇస్తారని ఆశిద్దాము.