.....నా వ్యాఖ్యలు
5. ఇందిరా గాంధీ సైతం, రష్యాతో స్నేహం పాటిస్తూ, అమెరికాని కట్టడి చెయ్యడానికి అవసరమైనప్పుడు వాజపేయీ ని పంపించేది! మన నిర్వాకం యేమిటి మరి?
6. చూపదు మరి! అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలోది కాదనీ, కాశ్మీర్ వాళ్ల వీసాల మీద కాకుండా వేరే కాయితాలపై స్టాంపులు వేస్తున్నా, మన అధికారులకీ వాళ్లకీ వీసాలు నిరాకరించీ, పటాల్లో ఆ ప్రాంతాలన్నీ మినహాయించి తన యిష్టం వచ్చినట్టు ప్రచురించీ--ఇలా చేస్తుంటే, మన నిర్వాకం యేమిటి?
7. అదేదో ఇప్పుడే కళ్లు తెరిచినట్టు! వేణుగోపాలరెడ్డి చేతులు కట్టేసినప్పుడు తెలీదా ఈ సంగతి? (నేను మూడేళ్ల క్రితమే--మాంద్యం, ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదల, తెలంగాణా మొదలైన దరిద్రాలు 'కాంగీ' ప్రభుత్వ హయాములోనే యెందుకు వస్తాయి? అంటే, కొంతమంది 'మోకాలికీ, బోడిగుండుకీ ముడేశా'నన్నారు! ఇప్పుడేమంటారు?)
ఇంక అవాకులూ, చెవాకుల విషయానికొస్తే.....
1. లోక్ నాయక్ స్పష్టంగా నిర్వచించాడు తన సంపూర్ణ విప్లవ సిధ్ధాంతాన్ని. ఆయన వుద్యమం రాజ్యాంగ విరుధ్ధం, అప్రజాస్వామికం అనడం వీళ్లకే చెల్లింది. అలా అయితే, ఎమర్జన్సీ విధించవలసినంత అవసరం యెందుకు వచ్చింది? ఆయన మీద లాఠీ ఛార్జ్ చేసే అవసరం యెందుకు వచ్చింది? ఇందిర పతనం యెందుకు అయ్యింది?
2. బీహార్ సంగతి మాట్లాడ లేదెందుకో?
3. ఆ స్థిరత్వమెంతో, అవిశ్వాస తీర్మానాలప్పుడూ, ఇప్పుడు పార్లమెంటు స్థంభించడం లోనూ తెలియడం లేదూ?
4. ఆవిడ త్యాగం యెంతవరకు అంటే, బాధ్యతల్లేకుండా అధికారం అనుభవించడం వరకే అని అందరూ తెలుసుకున్నారిప్పటికి!
5. మద్దతులూ, పొత్తులూ అంటూ చివరిదాకా తేల్చకుండా, కొన్ని పార్టీలని ముంచి, వోట్లు చీలడంతో అన్ని సీట్లు వచ్చాయని వాళ్లకీ తెలుసు. అందుకేనేమో--బాబా రామ్ దేవ్ కూడా పార్టీ పెడతానంటున్నాడు!
చివరిగా--ఈ పుస్తకం సంపాదక బృందంలో నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ డైరెక్టరు కూడా సభ్యుడట! పబ్లిక్ సర్వెంట్ పార్టీ పని చెయ్యచ్చా? అంటే, తప్పులేదంటారేమో వీళ్లు! అధికార దుర్వినియోగం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్యే కదా!
No comments:
Post a Comment