Wednesday, March 30, 2011

మన తెలుగు



అంచనాలు

మన తెలుగులో అంచనాలకి కొన్ని మాటలున్నాయి--సుమారు; దాదాపు; రమారమి; ఇంచుమించు; బహుశా; బదా బదలుగా--ఇలా!

ఇవన్నీ "దాదాపు" ఒకే అర్థాన్ని సూచిస్తున్నా, చిన్న చిన్న తేడాలు వున్నాయి.

సుమారు--అంటే కొంత % అటో ఇటో వుండొచ్చు అని.

దాదాపు--అంటే, దగ్గర దగ్గర అంత వుండొచ్చు (అంత కంటే యెక్కువ యెట్టి పరిస్థితుల్లోనూ కాదు) అని.

రమారమి--అంటే, కొంచెం ఇటూ అటూగా అని.

ఇంచుమించు--అంటే, ఓ అంగుళం యెక్కువే వుండచ్చు అని.

బహుశా--అంటే, అనేక విధాలుగా చూసినా అని.

బదాబదలుగా--అంటే, దేనికి దాన్ని విడదీసి చూసినా అని.

ఇంకా ఇలాంటివి మీకు తోస్తే చెప్పండి.

ఇంతకీ మన "ఈనాడు" వారు ఈ మాటలని విచక్షణా రహితంగా వాడేస్తున్నారు!

అదీ సంగతి!

ఇవాళ "ఈనాడు" లో ఓ చిన్న వార్త--"....షాంపూకు మహేష్ ప్రచారం" అని!

భలే తెలుగు కదూ!

4 comments:

Anonymous said...

ఈనాడులో శంకరనారయణ అనే ఓ పెద్దమనిషి తిష్ట వేసుకొని కూర్చొని ఇలాంటి యాగి చేస్తున్నాడని వాళ్ళ స్టాఫ్ ఉవాచ

A K Sastry said...

పై అన్నొన్!

ఇదో కొత్త విషయం నాకు.

ఆ యాగీ యేమిటో, యెలాగో కొంచెం వివరిస్తే సంతోషిస్తాను.

ధన్యవాదాలు.

Anonymous said...

అంచనాలను చెప్పడానికి ఇంకా ఈ పదాలను ఉపయోగిస్తారు: ఉరమరగా, ఉజ్జాయింపుగా.

ఆ ఈనాడు వార్త శీర్షికని ఇంకా మెరుగ్గా "వివెల్ షాంపూ ప్రచారంలో మహేష్" అని తిరగవ్రాయవచ్చు.

A K Sastry said...

డియర్ Veeven!

యెన్నాళ్లకెన్నాళ్లకి!

మరో రెండు మాటలు జోడించినందుకు చాలా సంతోషం.

బహుశా కాలమ్ వెడల్పు సహకరించలేదేమో. కానీ నా బాధల్లా మధ్యలో 'న ' కు బదులు స్పేస్ ఇస్తే, అది బూతు అయిపోదుగా? అని.

ధన్యవాదాలు.