Wednesday, April 20, 2011

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి......3



......కళ్యాణం అనే ఓ ప్రహసనం

చిన జీయరు స్వామి ఇంకా మైకులో చెపుతూనే వున్నాడు. ఇంతలో అహోబిలం స్వామి యెందుకో క్రిందకి దిగివచ్చేశాడు. క్రింద నుంచొని, చేతులు వూపుతూ యెవరితోనో యేదో మాట్లాడడం కనిపించింది. మళ్లీ ఆయన పైకి యెక్కలేదు.

జనాలకి అమ్మడానికి తలంబ్రాల పొట్లాలు ఆ ముందురోజునే ప్యాకెట్లలో సిధ్ధం చేసేశారు. 
ఆ తలంబ్రాలు వేరు.

తరవాత క్రొత్త దంపతుల చుట్టూ తెర పట్టుకొని, స్వామివారి ప్రక్కన అమ్మవారిని కూర్చోపెట్టి, హారతి ఇచ్చేశారు. తతంగం పూర్తి అయినట్టే.

ఇదంతా చూస్తే, మన వివాహ వ్యవస్థని, విధానాన్ని అపహాస్యం చెయ్యడానికి కంకణం కట్టుకున్నారా అనిపించింది.

అదండీ సంగతి.

3 comments:

Anonymous said...

> జనాలకి అమ్మడానికి తలంబ్రాల పొట్లాలు ఆ ముందురోజునే ప్యాకెట్లలో సిధ్ధం చేసేశారు. ఆ తలంబ్రాలు వేరు.
:-O
అంటే, అరోజు తలంబ్రాలు year అమ్ముతారా?

Anonymous said...

అంటే, అరోజు తలంబ్రాలు వచ్చే year అమ్ముతారా?

A K Sastry said...

అవి అమ్మేవి కాదు. ముత్యాలు భద్రపరచి మళ్లీయేడు వుపయోగిస్తారు(ట). పువ్వులరేకలు అవీ నిర్మాల్యంలో కలిపేస్తారు.